ధరల నియంత్రణపై సర్కారు దృష్టి

– మంత్రులు లోకేష్‌, నారాయణ సమీక్ష విజయవాడ, మహానాడు: వరద ముంపు ప్రాంతాల్లో అందుతున్న సహాయక చర్యలు, నిత్యావసర ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముంపు ప్రాంతాల్లో తాజా పరిస్థితి, సహాయక చర్యలు అందుతున్న తీరు, ధరల నియంత్రణపై మంత్రులు అధికారులతో సమావేశమై చర్చించారు. మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్‌, అధికారులు సీఎంవో, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More

సీఎం ఆదేశాలతో క్షేత్రస్థాయిలో సరుకుల పంపిణీ

– ఎమ్మెల్యే అరవిందబాబు విజయవాడ, మహానాడు: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవడాన్ని మించిన సేవ ఏముంటుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. కృష్ణా వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరంలోని 40వ డివిజన్లో ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీలో పాల్గొన్నారు. ఇప్పటికే నరసరావుపేట నుండి మంచినీటి ట్యాంకర్లను పంపించిన అరవిందబాబు, బుధవారం తానే స్వయంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. రెండు రోజులుగా వరద ప్రభావిత […]

Read More

రెండు వేల మందికి ఆహారం, మంచినీరు

విజయవాడ, మహానాడు: విజయవాడ బాధితులకు అండగా నిలిచేందుకు శ్రీ గురు కృష్ణ చారిట్రబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ నాయకులు సహకారంతో 2,000 మందికి సరిపడా ఆహార పొట్లాలను, వాటర్ బాటిల్ లను పంపించే వాహనాన్ని జనసేన పార్టీ నేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ మంచి కార్యానికి పూనుకున్న ప్రతి […]

Read More

పెద్దఎత్తున కదిలిన దాతలు

– కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్‌ విజయవాడ, మహానాడు: మంత్రి లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలో ముమ్మరంగా సాగుతున్న సహాయ చర్యలు. వరద బాధితులకు చేయూత నిచ్చేందుకు పెద్దఎత్తున కదిలివస్తున్న దాతలు. మంత్రిని కలిసి రూ. 10 లక్షల చెక్కును అందజేసిన గుంటూరు లోటస్ ఇన్ ఫ్రా ప్రతినిధులు కె.వంశీ కృష్ణ, రాంబాబు, చిన్న అంకారావు, శ్రీనివాసరావు. ఏలూరుకు చెందిన ప్రవాస భారతీయులు మేకా వినయ్ బాబు, సామినేని పవన్ కుమార్ […]

Read More

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వడ్లమూడి, మహానాడు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించింది. ఈ మేరకు వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పి.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఆరు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున వరద బాధితుల కోసం […]

Read More

పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లను తొలగింపు అన్యాయం

– మాజీ మంత్రి హరీష్‌ రావు ఆక్షేపణ హైదరాబాద్‌, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించడం అన్యాయమని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి గారు.! పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలు ను ఏకకాలంలో విధుల నుండి […]

Read More

బాపట్ల జిల్లా రేపల్లెలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, అనగాని సత్య ప్రసాద్ లు పర్యటించారు

బాపట్ల జిల్లా రేపల్లెలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, అనగాని సత్య ప్రసాద్ లు పర్యటించారు. మండలంలోని ముంపుగ్రామాల్లో ఒకటైన బొబ్బరలంక వాసులు సుమారు 50 కుటుంబాలు ఉంటున్న పునరావాస కేంద్రానికి వెళ్లి మంత్రులు పరిశీలించారు. వారికి అందుతున్న సహాయక చర్యలపై మంత్రులు ఇరువురు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతీ ఒక్క వరద బాధితునికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Read More

అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్ రూ. కోటి విరాళం

విజయవాడ, మహానాడు: ఏపీ, తెలంగాణలో వరద సహాయక కార్యక్రమాల కోసం చెరో యాభై లక్షల రూపాయలు.. మొత్తం రూ. కోటి సాయంగా అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్ అందించింది. ఈ సంక్షోభంలో రెండు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలుస్తాం.. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం.. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నామని అక్కినేని కుటుంబం, గ్రూప్ కంపెనీస్ తెలిపింది.

Read More

ఊపందుకున్న పారిశుద్ధ్య పనులు

– 3,454 మంది కార్మికులు, 450 ఆరోగ్య సిబ్బంది నిమగ్నం విజయవాడ, మహానాడు: వరద ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పురపాలక శాఖ వేగవంతం చేసింది. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలయ్యాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3,454 మంది పారిశుద్ధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఇతర మున్సిపాలిటీల నుంచి 5,889 మంది కార్మికులను విజయవాడ […]

Read More

సోనూసూద్ రూ.2 కోట్ల విరాళం

వరద బాధితులకు అండగా ఏపీకి రూ. 1 కోటి, తెలంగాణకి రూ.1 కోటి మొత్తంగా 2 కోట్ల విరాళం ఇస్తున్నట్టు రియల్ హీరో సోనూసూద్ ప్రకటించారు.

Read More