కారంచేడు, మహానాడు: కారంచేడు గ్రామంలో జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపి దగ్గుబాటి పురంధేశ్వరి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.
Read Moreఘనంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ కొత్త కార్యాలయం ప్రారంభం
గుంటూరు, మహానాడు: గుంటూరు, బృందావన్ గార్డెన్స్ 2/3, స్పెన్సర్స్ బ్యాక్ సైడ్ లో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు, మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, డిసిసి అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు లింగం శెట్టి ఈశ్వరరావు, […]
Read Moreన్యాయం కోసం కన్నీళ్లతో పోటెత్తిన అర్జీదారులు
– కిక్కిరిసిన టీడీపీ కేంద్ర కార్యాలయం – కష్టాలు చెప్పుకున్న దివ్యాంగులు – భూ సమస్యలు పరిష్కరించాలంటూ వైసీపీ బాధితులు – ఉద్యోగాలు కల్పించాలంటూ నిరుద్యోగులు మంగళగిరి, మహానాడు: గత పాలనలో నిండుకున్న కడగళ్ల కన్నీళ్లతో గుండెల నిండా బాధతో నేడు వినతులతో పోటెత్తారు అర్జీదారులు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీలు ఇచ్చేందుకు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వందల సంఖ్యలో తరలివచ్చారు. వచ్చిన అర్జీదారులతో టీడీపీ కేంద్ర […]
Read Moreప్రతి ఇంట్లో జాతీయ జెండా ఎగరాలి
– గుంటూరులో జరిగిన హర్ ఘర్ తిరంగా 3.O లో పెమ్మసాని గుంటూరు, మహానాడు: ‘ప్రతి ఇంట్లో మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడాలి. ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలి’ అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా హర్ ఘర్ తిరంగా 3.O కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్న […]
Read Moreట్రాఫిక్ జరిమానాలు, శిక్షలు ఇక కఠనం
న్యూఢిల్లీ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో అన్ని విభాగాలతో పాటు పోలీసు విభాగం కూడా అలర్ట్ అయింది. ఆయా జిల్లాల్లో ఎస్పీల ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ముమ్మర తనిఖీ చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యహరిస్తున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్‌లను ఉల్లంఘనలకు పాల్పడే వారికి జరిమానాలు వేయటమే కాకుండా.. తరచూ పట్టుబడేవారికి జైలు శిక్షతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం […]
Read Moreచెరువు భూమిలో అక్రమ లేఅవుట్… కూల్చివేత
భారీ భద్రత మధ్య కూల్చివేతలు కోట్లలో విలువ చేసే చెరువును కాజేసే ప్రయత్నం చెరువు భూమిలో అక్రమ లేఅవుట్ బహదూర్‌పురా ఎంఐఎం ఎమ్మెల్యే జోక్యం… అరెస్ట్ రంగారెడ్డి: హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వ ఆస్తులు, కాలువలు, చెరువులను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు శివరాం పల్లి, రాజేంద్రనగర్‌లో అక్రమ లేఅవుట్‌ను […]
Read Moreభద్రతాదారుడు లేక ఖాళీగా దర్శనమిస్తున్న టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్
(వాసు) మంగళగిరి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నిత్యం వచ్చి పోయే భక్తుల భద్రత కోసం టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. టూరిస్ట్ అవుట్ పోస్టులో ఒక కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ ఉంటారు.గత కొంత కాలం నుండి టూరిస్ట్ పోలీస్ ఔట్ పోస్ట్ లో ఎవరూ విధులు నిర్వహించకపోవడంతో ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తుంది. ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి నిత్యం భక్తులు వచ్చి పూజలు […]
Read Moreడిప్యూటీ సీఎంకు “ఆప్తా” ఆహ్వానం
ఆగస్ట్ 30,31 తేదీల్లో అమెరికాలో ఆప్తా 16వ వార్షికోత్సవం జనవరి 4,5 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ లో బిజినెస్ కాన్ఫరెన్స్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి ఈ నెల 30,31 తేదీల్లో అమెరికాలో జరిగే అమెరికన్ ప్రోగ్రెసీవ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా) 16వ వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానం వచ్చింది. ఆప్తా ప్రతినిధుల బృందం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని కలిసి […]
Read Moreఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో శిశువును పీక్కుతిన్న కుక్కలు
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలో శుక్రవారం సాయంత్రం ఎమర్జెన్సీ వార్డు ముందు ఓ పసిగుడ్డును కుక్కలు ఎక్కడి నుంచో తీసుకు వచ్చి పీక్కుతిన్నాయి. గమనించిన రోగుల బంధువులు వాటిని తరిమి శిశువును అత్యవసర విభాగానికి తీసుకువెళ్లారు. అయితే, అప్పటికే కుక్కలు నడుము కింది భాగం తినడంతో చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. బతికి ఉన్న శిశువును తీసుకు వచ్చి తిన్నాయా? లేక చనిపోయిన శిశువును తీసుకువచ్చాయా? అనేది తెలియాల్సి […]
Read Moreఏపీలో ప్రాజెక్టుల పేర్ల మార్పు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లోని 12 సాగునీటి ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లనే పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టును గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా, వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతలను ముక్త్యాల ఎత్తిపోతలుగా మార్చింది. వరికపూడిశెల, సంగం బ్యారేజీ, తాటిపూడి రిజర్వాయర్, హంద్రీనీవా సుజల స్రవంతి పేర్లనూ పునరుద్ధరించింది.
Read More