సీఎం కంటే.. సెక్రటరీనే ‘పవర్’ఫుల్లట

– బాబు.. లోకేష్ కంటే సీఎంఓ సెక్రటరీ ప్రద్యుమ్న సుప్రీం -మూడునెలలు దాటినా బాబు, లోకేష్ పీఆర్వోలకు దక్కని అపాయింట్‌మెంట్ ఆర్డర్లు – వారు ఇంకా ప్రైవేటు జీతగాళ్లగానే చెలామణి – అసలు ఇప్పటిదాకా సీపీఆర్‌ఓనే నియమించని వైనం – బాబు సెక్రటరీ ప్రద్యుమ్న పీఆర్వోలకు మాత్రం రెండు సీఎం మీడియా కో ఆర్టినేటర్స్ పోస్టులు – నెలకు 90 వేల జీతంతో జీఓ జారీ – లేని నిబంధనలు […]

Read More

జగన్‌ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలు!

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్లపాడు, మహానాడు: గడిచిన అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో రైతులకు ఆత్మహత్యలు తప్ప ఒరిగిందేంటని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూటిగా ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వంలో ఏడాదికి 1100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఆ పరిస్థితి మార్చాలనే ప్రజాప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. బొల్లాపల్లి మండలం పేర్లపాడులో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే […]

Read More

బ్రాహ్మ‌ణి రాజ‌కీయాల‌పై భువ‌నేశ్వ‌రి కామెంట్లు!

అమరావతి, మహానాడు: సీఎం చంద్ర‌బాబు కుటుంబం నుంచి మ‌రొక‌రు రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు జోరుగా ప్ర‌చారం సాగింది. సీఎం కోడ‌లు, మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మ‌ణి రాజ‌కీయ అరంగేట్రం చేస్తార‌ని టీడీపీ నేత‌లు కూడా ప్ర‌చారం చేశారు. విజ‌య‌వాడ ఎంపీ లేదా, గుంటూరు స్థానం నుంచి బ్రాహ్మ‌ణి పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. పెద్ద ఎత్తున వార్త‌లు […]

Read More

‘ప‌డ‌వ‌లు, ల‌డ్డూ, న‌టి’.. కాదేదీ రాజ‌కీయానికి అతీతం:

– ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా అంబ‌టి రాంబాబు సెటైరిక‌ల్ ట్వీట్ విజయవాడ: రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘కాదేది రాజకీయానికి అతీతం’ అంటూ సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. “వరదలో పడవలు, ల‌డ్డూ ప్ర‌సాదం, ముంబ‌యి న‌టి.. కాదేది రాజకీయానికి అతీతం!” అని అంబ‌టి ట్వీట్ చేశారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా పోటెత్తిన వ‌ర‌ద‌ల్లో ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద‌కు […]

Read More

లడ్డూ కల్తీ ఘటనపై సిట్ తాత్కాలికంగా నిలిపివేత

 –   డీజీపీ ద్వారకా తిరుమలరావు విజయవాడ:  తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చేసిన సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తామని చెప్పారు

Read More

కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియ పునఃప్రారంభం

– హోం మంత్రికి ధన్యవాదాలు తెలిపిన లోకేష్‌ అమరావతి, మహానాడు: అర్ధాంత‌రంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్ర‌క‌టించిన‌ హోం శాఖా మంత్రి వంగలపూడి అనితకి విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష త‌రువాత రిక్రూట్మెంట్ రెండో దశలో జ‌ర‌గాల్సిన‌ శారీరక ధారుఢ్య పరీక్షలు వేర్వేరు కారణాల‌తో వాయిదా ప‌డ‌టం వ‌ల్ల తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ను `ప్ర‌జాద‌ర్భార్‌`కు వ‌చ్చిన […]

Read More

1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు కంది పప్పు, పంచదార

• కిలో కందిపప్పు రూ.67… అర్ధ కిలో పంచదార రూ.17 • రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కంది పప్పు, పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో, పంచదార అర్ధ కిలో అందిస్తామని తెలిపారు. ఈ పంపిణీ ద్వారా 1,48,43,671 […]

Read More

హోం, రక్షణ శాఖల పార్టమెంటరీ కమిటీల్లో సభ్యునిగా కేశినేని చిన్ని

విజయవాడ: పార్లమెంటరీ స్థాయీ సంఘాలను పునర్ వ్యవస్థీకరిస్తూ 24 కొత్త కమిటీలను ఏర్పాటు చేసినట్లు లోక్ సభ సెక్రటరీ జనరల్ తెలిపారు.. ఈ వివరాలను లోక్ సభ సెక్రటరీ జనరల్ ఇటీవల పి.సి. మోడీ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివిధ కమిటీల్లో తెలుగు రాష్టాల నుండి స్థానం దక్కించుకున్నారు. అందులో ముఖ్యంగా విజయవాడ లోక్ సభ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) హోం శాఖ, రక్షణ శాఖ […]

Read More

చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం!

అమరావతి, మహానాడు: ఎన్డీయే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైసీపీ ప్రవేశపెట్టిన పలు పథకాల పేర్లలో మార్పులు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజా మరో పథకం పేరును మార్చింది. వైసీపీ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ఆ పథకానికి ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా పేరు మార్చేసింది. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు […]

Read More

సూపర్ స్టార్ రజనీకాంత్ కు స్టెంట్ వేసిన వైద్యులు

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని…. మరో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించాయి. రజనీకాంత్ భార్య లత స్పందిస్తూ… రజనీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. రజనీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన […]

Read More