లంచం తీసుకుంటుండగా ఓ ఎస్సైని ఏ.సీ.బీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ జర్నలిస్టును కూడా అరెస్టు చేసారు.మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ స్టేషన్ ఎస్పై ఆనంద్ గౌడ్ ఇసుక తరలిస్తున్న ఓ టిప్పర్ ను పట్టుకున్నాడు. స్వాధీనంలో ఉన్న టిప్పర్ ను ఇవ్వడానికి 20 వేల రూపాయలు డిమాండ్ చేసాడు.బిక్కనూర్ కు చెందిన మెట్రో ఈవినింగ్ జర్నలిస్టు మస్తాన్ మధ్యవర్తిగా ఉన్నాడు.బాధితుడి “పిర్యాదు” మేరకు ఏ.సీ.బీ అధికారులు […]
Read Moreఈనెల 18 నుంచి డీఎస్సీ పరీక్షలు
హైదరాబాద్ : తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు యథాతథంగా ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 11 సాయంత్రం ఐదు గంటల నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది. వరుసగా పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో చదువు కోవడానికి సమయం సరిపోదని అభ్యర్థులు అంటున్నారు. అయితే డీఎస్సీ యథాతథంగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ […]
Read Moreఆ కుట్రలు చేస్తే టీడీపీ గల్లంతవుతుంది
చంద్రబాబుపై విజయశాంతి వ్యాఖ్యలు హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం వచ్చారని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ ప్రయోజనాలే రహస్య అజెండాగా ఉందేమోనన్న అనుమానం కలుగుతుంది. అలాంటి కుట్రలు చేస్తే ఆ పార్టీ పూర్తిగా గల్లంతు అవుతుంది” అని పేర్కొన్నారు. దీంతో ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Moreకొత్త పింఛన్లకు అర్హుల జాబితాను సిద్ధం చేయండి
– మంత్రి సీతక్క హైదరాబాద్: తెలంగాణలో కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్నవి, కొత్త ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు. చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని, ఆ వివరాలను ప్రభుత్వానికి […]
Read Moreగాయని ఉషా ఉతుప్ భర్త కన్నుమూత
కలకత్తా: ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త జానీ చాకో (78) గుండెపోటుతో సోమవారం రాత్రి కన్ను మూశారు. కలకత్తాలోని తన నివాస ములో టీవీ చూస్తున్న సమ యంలో జానీకి ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీక రించారు. కాగా, ఉషా ఉతుప్ తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో […]
Read Moreప్రిన్సిపల్ దారుణ హత్య
అసోం: ఏపీలోని ఒంగోలుకు చెందిన రాజేష్ అసోం లో దారుణ హత్యకు గురయ్యారు. రాజేష్ అసోంలోని శివసాగర్‌లోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్, లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థికి కెమెస్ట్రీలో తక్కువ మార్కులు రావడంతో పాటు ప్రవర్తన బాలేదని మందలించారు. దాంతో ఆ విద్యార్థి కక్ష పెంచుకున్నాడు. రాజేష్ క్లాస్ చెబుతున్న సమయంలో ఆ విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో రాజేష్ మరణించారు.
Read Moreనేతన్నలు, చేనేతల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్ సర్కార్
-కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆత్మహత్యలు -ఇప్పటికే 10 మంది నేతన్నల ఆత్మహత్యలు -ఆనాలోచిత నిర్ణయాలు మాని నేతన్నలు, చేనేతలకు ఉపాధి కల్పించాలిని కేటీఆర్ డిమాండ్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతల పై కక్ష గట్టి వారి ప్రాణాలు తీస్తుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతల ఆత్మహత్యలు నివారించి వారికి ఉపాధి కల్పించే […]
Read Moreఎన్టీటీపీఎస్ ఐదో దశలో ప్రమాదం
ఎన్టీటీపీఎస్ ఐదో దశలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. బాయిలర్ స్తంభించడంతో కార్మికులు మరమ్మతులు చేస్తున్న సమయంలో డోర్లు అకస్మాత్తుగా తెరుచుకోవడంతో వేడి యాష్, మంటల సెగలు మరమ్మతులు చేస్తున్న ఇద్దరు కార్మికులపై పడి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికులలో ఒకరు శాశ్వత ఉద్యోగి, మరొకరు కాంట్రాక్టు కార్మికుడు. వారిద్దరినీ వెంటనే గొల్లపూడిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 40 శాతానికి పైగా గాయాలతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. […]
Read Moreవైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించేందుకు నిరాకరణ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కేఎం కృష్ణారెడ్డి కోరడంతో విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ సోమవారం […]
Read Moreశ్రీవారి బ్రహ్మోత్సవం షెడ్యూల్
తిరుమల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 2024 వరకు గమనిక: 2024లో, అధిక మాసం లేదు, కాబట్టి సాలకట్ల బ్రహ్మోత్సవం (సాలకట్ల అంటే వార్షికం) & నవరాత్రి బ్రహ్మోత్సవాలు కలిపి 1 బ్రహ్మోత్సవం మాత్రమే జరుగుతుంది. తిరుపతి బ్రహ్మోత్సవం షెడ్యూల్ : 3 అక్టోబర్ 2024 – గురువారం రాత్రి: 7 నుండి 8 వరకు – అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన 4 అక్టోబర్ 2024 – శుక్రవారం […]
Read More