అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్ష

అమరావతి: టెట్ పరీక్ష కొత్త షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇక అక్టోబర్ 4 నుంచి కీ విడుదల చేయనున్నట్టు, తుది ఫలితాలను నవంబర్ 2న విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రెండన ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వచ్చే నెల 8 వరకు పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించవచ్చునని, […]

Read More

సింపుల్ గవర్నమెంట్ – ఎఫెక్టివ్ గవర్నెన్స్

– మంత్రి నారా లోకేష్ అమరావతి: అధికారులతో యుద్ధ ప్రాతిపదికన జిఓ 225 విడుదల చేయించడంతో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన 25మంది దివ్యాంగ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఉండవల్లి నివాసానికి వచ్చి నాకు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులందరినీ అభినందించాను. వారికి ల్యాప్ ట్యాప్‌లను బహుకరించాను. సింపుల్ గవర్నమెంట్ – ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే మా లక్ష్యం అని […]

Read More

మళ్లీ ‘కొల్లు’వు దీరిన మట్టి దందా

-బందరులో మళ్లీ తెరపైకి మట్టిదందా -మంత్రి కొల్లు పేరుతో వ్యాపారం -అప్రతిష్ఠ అంటూ తమ్ముళ్ల హెచ్చరికలు (బహదూర్) హథ విధీ.. ప్చ్.. ఇదేం ఖర్మమని గోలం చేశాం. జనం కూడా ఏమాత్రం సహించలేదు. బందరు మట్టి బాబులకు అత్తారింటికి దారి చూపించారు. అందరూ అనుకున్నట్టే.. వాళ్లు పోయారు. ఇప్పుడు వీళ్లొచ్చారు. ఈ దందా మారదా? అని జనం నెత్తినోరు కొట్టుకునే స్థితి దాపురించింది. మైన్స్ శాఖ మంత్రి ఇలాఖాలోనే .. […]

Read More

మెరిట్ స్టూడెంట్స్ కి ఉచిత ల్యాప్ టాప్స్ పంపిణీ

కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కడియాల లలిత్ సాగర్ నేడు ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం, ముండ్లమూరులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సౌజన్యంతో ముండ్లమూరు మండలంలోని 20మంది పేద విద్యార్థులలో మెరిట్ స్టూడెంట్స్ కి ఉచిత ల్యాప్ టాప్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కడియాల లలిత్ సాగర్. వెంకట్ జెల్లెలమూడి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ ల్యాప్ టాప్స్ ని స్పాన్సర్ చేశారు. డాక్టర్ లలిత్ సాగర్ మాట్లాడుతూ…. […]

Read More

పిన్నెల్లిని కస్టడీకి తీసుకున్న పోలీసులు

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో నెల్లూరు సెంట్రల్ జైలులో విచారిస్తున్నారు. సీఐపై దాడి, ఈవీఎం ధ్వంసంతో పాటు దాడుల్లో ఎవరెవరు పాల్గొన్నారనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Read More

ధ్రువీకరణ పత్రం అందుకున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్

అమరావతి, జూలై 8, 2024: ఎమ్మెల్యే కోటాలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా జూలై 5 న నామినేషన్ దాఖలు చేసిన పిడుగు హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు, ఎమ్మెల్సీ గా ఆయనను ఖరారు చేస్తూ రిటర్నింగ్ అధికారి ఎం. విజయ రాజు శాసన సభ కార్యాలయంలో నేడు ధ్రువీకరణ పత్రం జారీ చేసి హరిప్రసాద్ కు అందజేశారు. పత్రికా రంగంలో సుమారు ఇరవై సంవత్సరాలకు పైగా పనిచేసిన అనుభవం […]

Read More

సామాన్యులకు అండగా మంత్రి లోకేష్ “ప్రజాదర్బార్”

-ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి -13వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ అమరావతిః ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం కృషిచేస్తోంది. గత ఐదేళ్లు ఎలాంటి భరోసా లభించక సామాన్యులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక సతమతమయ్యారు. అలాంటి వారికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” భరోసా ఇస్తోంది. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉండవల్లి […]

Read More

తెలంగాణలో కార్పొరేషన్ పదవుల పండగ

తెలంగాణ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నామినేటెట్ పదవులను భర్తీ చేసింది. ఏకంగా 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ కాణంగా నిలిపివేసిన జీవోను టీజీ ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఛైర్మన్లుగా నియమితులైనవారు రెండేళ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు. కార్పొరేషన్ల ఛైర్మన్లు: హౌసింగ్ కార్పొరేషన్ – ఆర్. గురునాథ్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ – కాల్ప సుజాత గ్రంథాలయ పరిషత్ – ఎండీ రియాజ్ […]

Read More

‘మా’కు నటి హేమ లేఖ

బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతంతో నటి హేమ ‘మా’  సభ్యత్వాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు హేమ లేఖ రాశారు. తన డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ కాపీతో ఈ లేఖను సోమవారం స్వయంగా మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేశారు. రేవ్ పార్టీ విషయంలో తనపై అసత్య ప్రచారం జరిగిందని, మీడియా కథనాల ఆధారంగా తన సభ్యత్వంపై వేటువేయడం […]

Read More

ఈరోజు నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాయలసీమతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే […]

Read More