ఇక తెలంగాణ వాహనాలన్నీ టీజీ

గెజిట్ నోటిఫికేషన్‌ జారీ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక నుండి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌లు టీఎస్ స్థానంలో టీజీ పేరుతో ఉండే విధంగా రిజిస్ట్రేషన్లు చేయాలని పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం, సీరియల్ నంబర్ 29- ఏ , టీఎస్ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల […]

Read More

వైసీపీ రౌడీయిజం

-టీడీపీ యువనేత లోకేశ్ రాష్ట్రంలో వైసీపీ రౌడీయిజానికి పాల్పడుతోందని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. ‘వైజాగ్లో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. టీడీపీకి ఓటు వేశారని దాడి చేయడం దుర్మార్గం. ఓటమి ఖాయమని తెలిసే ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారు. ఇది మహిళలపై జరిగిన దాడి కాదు.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి’ అని ఆయన పేర్కొన్నారు.

Read More

ఎంఐఎం నేతలపై కేసు

మాధవి లతపై దాడి కేసు హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై గురువారం తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవి లత అనుచరుడు నసీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్ పురా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. […]

Read More

ఏపీలో హింసపై ఈసీ సీరియస్

పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇవాళ రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ… పోలింగ్ రోజు, అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని నిర్ధారించింది. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్టు నివేదిక అందిందని […]

Read More

కాళ్లూ చేతులు లేకపోతేనేం..

పద్మశ్రీ అవార్డు గ్రహీత కేఎస్ రాజన్న కేఎస్ రాజన్న.. తన సేవా కార్యక్రమాలకు గానూ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. దివ్యాంగుడైన ఆయన మోకాళ్లపై నడిచి వచ్చి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి అవార్డు తీసుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా వద్దకు వెళ్లి నమస్కరించారు. కర్ణాటకకు చెందిన రాజన్న 11 నెలల వయసులో పోలియో బారిన పడి కాళ్లు, చేతులు కోల్పోయారు. మనోధైర్యం కోల్పోకుండా ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం […]

Read More

తప్పు చేసిన పోలీసు అధికారులపై కేసులు నమోదు చేసి విచారణ జరపాలి

– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. ఇప్పుడు ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా చేరింది. నగరంలోని నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి…టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దారుణంగా దాడిచేశారు. ఆడవాళ్లపై కూడా పాశవిక దాడికి పాల్పడ్డారు. వైసీపీ మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం […]

Read More

దెబ్బల్లో రక్తపు దెబ్బలు వేరయా?

– అన్నకు అలా.. చెల్లికి ఇలా! – బెజవాడలో జగనన్నపై రాయి దాడికి నుదుటిపై గీతలు – మాచర్లలో చెల్లి రెడ్డమ్మ నుదుటన కొడవలి గాయం – రెడ్డమ్మ చెల్లి నుదుటన కారిన రక్తం – సోషల్‌మీడియాలో మళ్లీ జగనన్న ‘కట్టు’ కథలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగనన్న. బెజవాడలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనను ‘చంపే కుట్ర’(?)తో ఇద్దరు యువకులు, బస్సు మీదున్న అన్నపై […]

Read More

గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

-ఈ ఆఫీసులో అక్రమాలకు అవకాశం -అప్‌గ్రేడ్‌ నిలిపివేతకు ఆదేశాలివ్వాలని వినతి అమరావతి, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వ ఈ` ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌ వ్యవహారం నిలిపివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు లేఖ రాశారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్‌గ్రేడ్‌ పేరుతో ఈ`ఆఫీస్‌ మూసివేతపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ`ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం […]

Read More

లక్షల కోట్లు కంటైనర్లలో బయట దేశాలకు

• జగన్ రెడ్డి విదేశాలకు పారిపోవడానికి సిద్ధం అయ్యాడు • జూన్ 4 వచ్చే ఫలితాలను చూసి జగన్ రెడ్డి, వైసీపీ గ్యాంగ్ షాక్ అవ్వబోతున్నారు • జగన్ రెడ్డి భ్రమలు జూన్ 4 న తొలగబోతున్నాయి • జగన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్య పోతుంది • పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక ఐప్యాక్ తో జబ్బలు జరుసుకుంటున్నాడు • బూత్ లలో కౌంటింగ్ […]

Read More

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉంది

-ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదాస్పదం -ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూ సమస్యలు పెరుగుతాయని వెల్లడి -అనకాపల్లిలో న్యాయవాదులతో సమావేశమైన లక్ష్మీనారాయణ -సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అనకాపల్లి : ఏపీలో ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆయన ఇవాళ అనకాపల్లిలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఈ […]

Read More