– స్పష్టం చేసిన సీఈవో వికాస్ రాజ్ హైదరాబాద్: ఈ నెల 4న ఉదయం 8 గంటలకు లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు.మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ఉంటుందని.. 8.30 గంటలకు ఈవీఎం ల ఓట్ల లెక్కింపు షురూ అవుతుందని ప్రకటించారు. హైదరాబాద్ లోని బీఆర్‌కే భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌంటింగ్ కేంద్రాల వద్ద […]
Read Moreకర్నాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
కర్నాటక: మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను గురువారం అర్ధరాత్రి బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి వచ్చిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. వెంటనే సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విచారణ నిమిత్తం సీఐడీ కార్యాలయానికి తరలించారు.
Read Moreకోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
కృష్ణా: గన్నవరం నియోజకవర్గం తేలప్రోలు రైల్వేస్టేషన్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో లోకో పైలట్ అత్యవసరంగా రైలును నిలిపివే శారు. హుబ్లీ నుంచి చెన్నై వెళ్లే ఈ రైలుకు బ్రేక్ పైపులు హీట్ కావడంతో బోగీ లలో పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన లోకో పైలట్ అత్యవసరంగా రైలును నిలిపివేశారు. బ్రేక్ పైపులు సరిచేసిన అనంతరం చెన్నైకు బయలుదేరింది.
Read Moreతెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ లోగో మార్పు
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్‌ఎస్పీ) తన లోగోను మార్చుకుంది. బెటాలియన్స్ తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ)గా అధికారిక లోగోను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం టీజీఎస్పీ డీజీ స్వాతిలక్రా ఎక్స్ వేదికగా లోగోను షేర్ చేశారు. టీఎస్‌ఎస్‌పీని ఇకనుంచి టీజీఎస్పీగా బెటాలియన్స్ పిలవాలని ఆమె సూచించారు.
Read Moreపెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు ఖాయం
జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి గుంటూరులో కూటమి ముందస్తు విజయోత్సవ వేడుకలు గుంటూరు: అరంగేట్రంతోనే రాష్ట్రంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ఫలితాల్లో ఓట్ల సునామీని సృష్టించబోతున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీనివాసరావుతోటలో కూటమి ముందస్తు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి […]
Read Moreహస్త కళాకారులకు శిల్ప గురు బహుమతులు
చేతి వృత్తుల వారికి ప్రాధాన్యం బీజేపీ ఆర్టిసన్ సెల్ కన్వీనర్ బంగారుబాబు విజయవాడ: రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆర్టిసన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ బంగారు బాబు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. భారత ప్రభుత్వం జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హస్తకళలో రాణించిన కళాకారులకు శిల్ప గురు బహుమతులు అందించనున్నారు. చేతి వృత్తి కళాకారులను గుర్తించి తగిన ప్రాధా న్యం ఇస్తుందని చెప్పారు. పలు రంగాలలో ఉన్న చేతి వృత్తి […]
Read Moreపిఠాపురంలో కౌంటింగ్‌ను అడ్డుకునేందుకు కుట్ర
ఓటమి భయంతో రౌడీషీటర్లను ఏజెంట్లుగా పెట్టారు ఎన్ని కుట్రలు చేసినా పవన్‌కళ్యాణ్ గెలుపు ఆపలేరు తనపై వైసీపీ దుష్ప్రచారాలు మానుకోండి పిఠాపురం టీడీపీ నేత వర్మ హెచ్చరిక పిఠాపురం: తనపై వైసీపీ నేతల దుష్ప్రచారాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నేతల దుష్పచారం ప్రజలు అర్థం చేసుకున్నారు. అత్యధిక మెజారిటీతో పవన్‌కళ్యాణ్ గెలవబోతున్నాడన్న సమాచారంతో కౌంటింగ్‌కు ఆటంకం కలిగిం చాలన్న […]
Read Moreనేటి నుంచి పల్నాడు జిల్లాలో 144 సెక్షన్
సాయంత్రం నుంచి దుకాణాలు మూసివేయాలి అత్యవసరమైతేనే బయటకు రావాలి ర్యాలీలు, మైకులకు అనుమతి లేదు దేవాలయాల్లోనే హనుమజ్జయంతి జరుపుకోవాలి పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్ సూచనలు నరసరావుపేట: టూ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీడియో పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు ఎస్పీ మల్లికాగార్గ్ తెలిపారు. సోషల్ మీడియా లేదా వాట్సాప్‌లలో ఎగ్జిట్ పోల్స్ తరువాత ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని, దానికి […]
Read Moreచంద్రబాబును కలిసిన కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాత, నవ్యాంధ్ర ఉజ్వ ల భవిష్యత్తు సాధనే లక్ష్యంగా త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ నున్న దార్శనికులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసినట్లు మీడియాకు వివరించారు.
Read More7,8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సుకు సన్నాహాలు
తాజ్‌కృష్ణ హోటల్‌లో వేదికకు ఏర్పాట్లు వివిధ దేశాల నుంచి వరి శాస్త్రవేత్తల హాజరు వరి ఎగుమతిదారులకు సువర్ణావకాశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సదస్సు నిర్వాహకులతో చర్చలు హైదరాబాద్: వచ్చె నెల 7,8వ తేదీలలో తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగే ప్రపంచ వరి సదస్సుకు ముమ్మరంగా సన్మాహాలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సదస్సును నిర్వహిస్తున్న అంతర్జాతీయ పంటల […]
Read More