ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు

అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్లు పి.శ్రీలేఖ, ఎ.మురళి, ఓ.రాంభూపాల్‌రెడ్డిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

బీఆర్‌ఎస్‌ నేతలపై కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదు

వరంగల్‌ : బీఆర్‌ఎస్‌ నేతలపై కోడ్‌ ఉల్లంఘించారని వరంగల్‌లో కేసు నమోదైంది. మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని, ధాస్యం వినయ్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఏనుగు రాకేష్‌ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నాయకులపై ఈ కేసు నమోదైంది. గురువారం ఖిలావరంగల్‌లో కాకతీయ కళాతోరణం దగ్గర బీఆర్‌ఎస్‌ నేతలు నిరసన తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ధర్నా చేశారంటూ వారిపై మిల్స్‌ కాలనీ పోలీసుస్టేషన్‌లో […]

Read More

నా నిజాయితీ, ధర్మం, పోరాటమే కాపాడిరది

అధర్మాన్ని భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొన్నా దుష్ట శిక్షణకు మళ్లీ అవకాశం వస్తుందని ఆశిస్తున్నా పదవీ విరమణ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ : అధర్మాన్ని ఎదుర్కోవడమే వృత్తిధర్మంగా పనిచేశానని ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ హోదాలో పదవీ విరమణ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తన సర్వీసులో చట్టాన్ని కాపాడేందుకు కృషి చేశా.. నేను ఎవరికీ అన్యాయం చేయలే దని వ్యాఖ్యానించారు. పూర్తి […]

Read More

ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ

ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా బాధ్యతలు అనంతరం పదవీ విరమణ..ఒకేరోజు కార్యక్రమాలు విజయవాడ :  సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఉదయం విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కార్యాలయంలో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఏబీవీని పలువురు అధికారులు, స్నేహితులు, అభిమానులు కలిసి సంఫీుభావం తెలిపారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఆయనను కలిసి […]

Read More

శిశు విక్రయాలు, అక్రమ దత్తతపై నివేదిక ఇవ్వండి

ఆసుపత్రులలో పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలి బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు ఆదేశం మహిళా శిశు సంక్షేమ, పోలీసు శాఖకు కీలక సూచనలు మంగళగిరి : రాష్ట్రంలో పసి పిల్లలను విక్రయించినా, అనధికారికంగా దత్తత స్వీకరించినా అటువంటి వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక నెల […]

Read More

జస్టిస్‌ శేషసాయి సేవలు ప్రసంశనీయం

న్యాయవ్యవస్థలో అమూల్యమైన సేవలు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ఘనంగా వీడ్కోలు కార్యక్రమం అమరావతి: ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎ.వి.శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న శేషసాయి పదవీ విరమణ చేయనున్న నేప థó్యంలో శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాలులో ఘనంగా వీడ్కోలు కార్యక్ర […]

Read More

సజ్జలపై పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు

మంగళగిరి : కౌంటింగ్‌ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై తాడేపల్లి పోలీసులు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్‌ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల వ్యాఖ్యానించారు. దాంతో టీడీపీ నేత దేవినేని ఉమ, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గురువారం తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More

జూన్‌ రెండో వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు!

తెలంగాణ : టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను జూన్‌ రెండో వారంలో చేపట్టా లని ప్రభుత్వం భావిస్తోంది. పెండిరగ్‌లో ఉన్న పండిట్‌, పీఈటీలకూ బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తోంది. ఎన్నికల కోడ్‌ ముగియగానే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు 60 వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్‌ అయ్యే అవకాశం ఉంది. టెట్‌ అర్హతతో సంబంధం లేకుండానే పదోన్న తులు కల్పించాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది.

Read More

రేపటి నుంచి వాహనదారులకు కొత్త రూల్స్‌

ఢిల్లీ :  జూన్‌ 1 నుంచి దేశంలో కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. రేపటి నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆర్డీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్‌ స్కూల్‌కు వెళ్లి లైసెన్స్‌కు అర్హత సాధించవచ్చు. ఇక మైనర్‌ డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబ డితే రూ.25 వేల వరకు ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు..ఆధార్‌ కార్డు ఫ్రీ అప్డేట్‌ గడువు జూన్‌ 14తో ముగియనుంది.

Read More

హైదరాబాద్‌ నటిపై అత్యాచారం!

తమిళనాడు: నటిపై ఆమె డ్రైవర్‌, మరో ముగ్గురు అత్యాచారం చేసిన దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఓ సహాయ నటిపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read More