పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి రూరల్ మండలం గుడిపూడి గ్రామంలో మాతృశ్రీ అచ్చమాంబ తిరునాళ్ల మహోత్స వం సందర్భంగా మంగళవారం ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.
Read Moreనాగర్‌కర్నూలు ఎంపీ స్థానానికి మల్లు రవి నామినేషన్
నాగర్‌కర్నూలు, మహానాడు : నాగర్‌కర్నూలు ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమా ర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం
టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం.దారు నాయక్ నరసరావుపేట, మహానాడు : పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎం.దారునాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల వైసీపీ పాలన లో అభివృద్ధి శూన్యమని, పల్నాడు జిల్లా ప్రజలు ఏడు నియోజకవర్గాలు వైసీపీకి పట్టం కట్టడం తో దానికి ప్రతీకార చర్యగా భూ కబ్జాలు, భౌతిక దాడులు, రాజకీయ హత్యలు, అత్యాచారాలు వంటివి […]
Read Moreకూటమి అభ్యర్థులను గెలిపించండి
టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా విజయవాడ, మహానాడు : కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, మచిలీపట్నం పరిశీలకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాల యంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడని దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజలు కోలుకోలేని విధంగా నష్టపోయారన్నారు. పేర్ని నాని మంత్రిగా నియోజవర్గానికి చేసింది శూన్యమన్నారు. […]
Read Moreముగిసిన హరిహర క్షేత్రం 18వ వార్షికోత్సవ వేడుకలు
భక్తిశ్రద్ధలతో మహా పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం స్వాత్మానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు పాల్గొన్న మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుటుంబం నగరోత్సవంలో పాల్గొన్న భక్త జనం ప్రకాశం జిల్లా చీమకుర్తి, మహానాడు : చీమకుర్తి హరిహర క్షేత్రంలో గత రెండు రోజులుగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతు ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారంతో ముగిశాయి. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి […]
Read Moreదెందులూరులో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా
మరోసారి అవకాశం కల్పించండి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ కూటమి నేతలతో జోరుగా ఎన్నికల ప్రచారం దెందులూరు, మహానాడు : దెందులూరు మండలంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి మంగళవారం టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దెందులూరు మండలం పెరుగుగూడెం, చల్ల చింతలపూడి, ముప్పవరం, సీతంపేట గ్రామాల్లో వారు పర్యటించారు. మహిళలు పూలు, మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. అందరి ఆశీస్సులతో రెండు సార్లు […]
Read Moreకాపుల ఆత్మీయ సమావేశంలో కన్నా, భాష్యం ప్రవీణ్
పల్నాడు జిల్లా పెద్దకూరపాడు, మహానాడు : పెదకూరపాడు అమరావతి సత్యసాయి కళ్యాణ మండపంలో మంగళవారం ఏర్పాటు చేసిన మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కాపుల ఆత్మీయ సమావేశంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఎన్నికల్లో కూటమి విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreనాయీ బ్రాహ్మణులకు అవకాశాలు కల్పిస్తాం
చిరువ్యాపారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తాం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రజలతో మమేకమై..సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : దేవాలయ పాలకవర్గాలలో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించేందుకు కూటమి ప్రభు త్వం కట్టుబడి ఉంది..మున్సిపల్ కాంప్లెక్స్‌లో షాపులు కేటాయిస్తాం.. ఇళ్ల స్థలాలు లేని వారికి ఇంటి స్థలం కేటాయిస్తామని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు. దర్శి పట్టణంలో ప్రచారంలో భాగంగా […]
Read Moreకూటమి కార్యకర్తల జోలికొస్తే తాటతీస్తాం
నీ ఉడత ఊపులకు ఎవరూ భయపడరు ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి తిరుగులేని మెజార్టీతో గెలవబోతున్నాం చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు : కూటమి కార్యకర్తల జోలికొస్తే తాటతీసి పంపిస్తారని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ఆయన మంగళవారం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నియోజవర్గంలో అవాకులు, చవాకులు పేలుతున్న […]
Read Moreసుజనా, చిన్ని విజయం కోసం ప్రచారం
విజయవాడ, మహానాడు : విజయవాడ పశ్చిమలో సుజనాచౌదరి విజయం కోసం టీడీపీ మాజీ కార్పొరేటర్, 41,42 డివిజన్ల క్లస్టర్ ఇన్‌చార్జ్ యేదుపాటి రామయ్య మంగళవారం ప్రచారం నిర్వహించారు. విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని, పశ్చిమలో సుజనాను గెలిపించాలని ఇంటింటికీ తిరిగి అభ్యర్థించారు. రామయ్య వెంట బూత్ ఇన్‌చార్జ్‌లు నెలకుర్తి వెంకటరావు, అన్నాబత్తిన శ్రీనివాస్, మైనంపాటి రమేష్, కాశీ, పత్చవ మల్లికార్జున, వెంకట్, మహేష్, శ్రీనివాస్ తది తరులు పాల్గొన్నారు.
Read More