జగన్ రెడ్డి, ఎన్నికల తర్వాత జైలుకెళ్లడం ఖాయం

– టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం – వైసీపీనేతల ప్యాంట్లు తడుస్తున్నాయి – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు టీడీపీ-జనసేన పార్టీల అధినేతల ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటనతో ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ కిందే భూకంపం వచ్చిందని, రాష్ట్రంలో ఎండలు పెరిగినప్పటికీ తాడేపల్లి కొంపలో మాత్రం ఎన్ని ఎయిర్ కూలర్లు వేసినా, అక్కడున్న నాయకుల కు చెమటలు ఆగడంలేదని, […]

Read More

అద్దంకి సిద్దం సభను విజయవతం చేస్తాం

– మీడియా సమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి నెల్లూరు, ఫిబ్రవరి 24: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించే సిద్ధం మహాసభలకు ప్రజల నుండి అనూహ్య రీతిలో స్పందన లభిస్తోందని, మార్చి 3న అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం,కొర్సిపాడు మండలం, పిచ్చికలగుడిపాడు గ్రామం, జాతీయ రహదారి పక్కన జరగనున్న చివరి సిద్ధం మహాసభకు 15 లక్షల మంది వరకు హాజరు కానున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి […]

Read More

రేవంత్ రెడ్డిని కలిసిన టిజిఓ సంఘం ప్రతినిధులు

సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. టిజిఓ ప్రెసిడెంట్ ఏలూరి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, కోశాధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎ.పరమేశ్వర్ రెడ్డి, లేడీ రిప్రసెంటేటివ్ జి. దీపా రెడ్డి, ఇసి మెంబర్ పంతంగి యాదగిరి తదితరులు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.

Read More

మంగళగిరి ఎయిమ్స్ ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని

రాష్ట్రానికి నాలుగు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబులు నేడు వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ రూ.233 కోట్లతో 9 సిసిబిలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మంగళగిరి ఎయిమ్స్ లో ఏర్పాట్లను సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణ బాబు అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన నాలుగు సంచార ఆహార భద్రతా పరీక్షా ప్రయోగశాలలను ఆదివారం నాడు రాజ్ కోట్ నుండి […]

Read More

అంగ‌రంగ వైభ‌వంగా తిరుపతి ఆవిర్భావ వేడుకలు

తిరుపతి పుట్టిన రోజు వేడుకను టీటీడీ క్యాలెండర్‌లో భాగం చేస్తాం – టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం – టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి – గోవింద నామ స్మరణలతో పులకించిన తిరునగరి తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను త‌ల‌పించేలా మన తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలను టీటీడీ ఆధ్వ‌ర్యంలో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించిన‌ట్లు ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు. తిరుప‌తి […]

Read More

హుజూర్ నగర్ లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్, ఫిబ్రవరి 24 :: హుజూర్ నగర్ నియోజకవర్గంలో దాదాపు రూ. 437 .70 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ప్రారంభించారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి లతో కలసి ఈ పనులను ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మాణంలో […]

Read More

ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి

సమర్థతకు పట్టం కట్టిన సీఎం రేవంత్ రెడ్డి క్రమశిక్షణకు మారుపేరు చిన్నారెడ్డి 4 సార్లు వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన చిన్నారెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చిన్నారెడ్డి   కాంగ్రెస్ పార్టీ సీనియర్ సమర్థ నాయకులు, నాలుగుసార్లు (4) వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ వాది డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ […]

Read More

గీతక్క ఇంచార్జిగా ఉన్న నల్లగొండ జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచాం

– గీతక్క లాంటి వారు మంత్రివర్గంలో లేకపోవడం లోటు – జె.ఈశ్వరీబాయి వర్దంతి కార్యక్రమంలో టీజీ సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజుల్లోనే అంబేద్కర్ స్పూర్తిగా రాజకీయాల్లో ఈశ్వరీబాయి తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో రాణిస్తూనే గీతారెడ్డి ని డాక్టర్ చదివించారు. ప్రతీ పురుషుడి విజయం వెనకాల ఒక మహిళ ఉన్నట్లు గీతక్క ప్రతీ విజయంలో డాక్టర్ గారి సహకారం ఉంది. ఈ కార్యక్రమానికి హాజరు కావడం నేను బాధ్యతగా […]

Read More

ధరణి అర్జీలు పెండింగ్‌లో పెట్టవద్దు

– టీజీ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధరణి కమిటీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణిలో 2.45 లక్షల […]

Read More

చమురు శుద్ధి కర్మాగారం కావాలి

-బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసిన గ్యాసు సాధన సమితి కోనసీమ ప్రాంతంలో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలని కృష్ణా గోదావరి బేసిన్ చమురు గ్యాస్ సాధన సమితి బిజెపి కీ విజ్ఞప్తి చేసింది. బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని కలసి సాధన సమితి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. సహజవనరులు అధికంగా ఉన్న కృష్ణా గోదావరి బేసిన్ పై ప్రత్యేక దృష్టి […]

Read More