రాష్ట్ర పండగగా వాల్మీకి జయంతి

– ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు – పాదయాత్రలో మంత్రి లోకేశ్ ఇచ్చిన మరో హామీ అమలు అమరావతి : యువగళం పాదయాత్రలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం […]

Read More

ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్‌ దుర్మార్గం

– హిందూపురం గ్యాంగ్‌ రేప్‌పై మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్‌ హిందూపురం: ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్‌ అత్యంత దుర్మార్గం, విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయి . మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చిత్తూరు జిల్లాలో బాలిక హత్యపై […]

Read More

సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం

– టీటీడీ ఈవో శ్యామలరావు తిరుమల, మహానాడు: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ మేరకు అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఏమన్నారంటే.. 15 లక్షల మందికి వాహన సేవలను తిలకించేలా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశాం. 3.5 లక్షల మంది గరుడ సేవను వీక్షించారు. బ్రహ్మోత్సవాలపై భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. […]

Read More

డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసిన చీరాల ఎమ్మెల్యే

దర్శి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర రావు, రమేష్ బాబుని ఆదివారం లక్ష్మీ నివాసంలో చీరాల శాసన సభ్యుడు ఎం.ఎం. కొండయ్య మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించారు. నాలుగు నెలల కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ప్రజలకు […]

Read More

సీఐడీకి టీడీపీ ఆఫీసుపై దాడి కేసు!

– సర్కారు నిర్ణయం అమరావతి: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీఐడీకి బదలాయించాలని ఎన్డీయే సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మంగళగిరి పీఎస్‌ల పరిధిలో కేసుల విచారణ జరుగుతోంది. కేసు తీవ్రత దృష్ట్యా, సీఐడీకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ జైలుకెళ్ళారు. ఇదే కేసులో సజ్జల, దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డిపై అభియోగాలు […]

Read More

పంచాయతీలను దిష్టిబొమ్మలుగా మార్చిన వైసీపీ!

– కూటమి పాలనలో నేటి నుండి ‘పల్లె పండగ’ – టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని, గ‌డిచిన ఐదేళ్లకాలంలో గ్రామ సీమలన్నీ ఎడారిని తలపించాయన్నాయని, కనీస సౌకర్యాలకు నోచుకోక దిష్టిబొమ్మలుగా తయారయ్యాయని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గెలిచిన సర్పంచులు అభివృద్ధి చేయలేక, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పదిహేనో […]

Read More

ఏడాదిలోపు రామలింగేశ్వర స్వామి గుడికి ఘాట్ రోడ్డు

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: వినుకొండపై కొలువైన రామలింగేశ్వర స్వామి గుడికి ఏడాదిలోపు ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హామీ ఇచ్చారు. అందుకు కావాల్సిన నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు, దాతలు సహకరిస్తే ఆ ఆలయాన్ని మరిన్ని సౌకర్యాలతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. వినుకొండ బోసుబొమ్మ సెంటర్ లోని శ్రీ సమర్ధ సద్గురు […]

Read More

‘అమరావతి’ కోసం దీక్షా బద్ధులు అవుదాం

– డాక్టర్‌ మాదల శ్రీనివాసు అమరావతి, మహానాడు: అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి ఈ విజయదశమికి తొమ్మిదేళ్ళు పూర్తయ్యాయి. ఈ కాలంలో ఏ లక్ష్యం కోసం రైతులు భూములు త్యాగం చేశారో, నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేశాయో ఆ అమరావతి నిర్మాణం కొరకు కుల, మత, వర్గ రాజకీయాలకు అతీతంగా, రాష్ట్ర ప్రజలంతా సమిష్టిగా కృషి చేశారని డాక్టర్ మాదల శ్రీనివాసు అన్నారు. […]

Read More

నేను ఇచ్చిన మరో హామీ నెరవేరింది

– మంత్రి నారా లోకేష్‌ అమరావతి, మహానాడు: యువగళం పాదయాత్రలో నేను ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చింది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు పాదయాత్రలో నన్ను కలిసి విన్నవించారని  రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. వారి సెంటిమెంటును గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో […]

Read More

రాష్ట్ర గ్రంథాలయాలన్ని పరిశీలించిన పెమ్మసాని

గుంటూరు, మహానాడు: గ్రంథాలయాల్లో విద్యార్థులు, పాఠకులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని రూరల్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. గుంటూరులోని రాష్ట్ర గ్రంథాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, జనసేన నాయకులతో కలిసి పెమ్మసాని ఆదివారం పరిశీలించారు. గ్రంథాలయ భవనం శిథిలావస్థలో ఉండటాన్ని గమనించిన పెమ్మసాని భవన, నిర్వహణ వివరాలను అధికారులను అడిగి […]

Read More