గ్రామాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ

త్వరలో నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సమీక్షకు వచ్చే అవకాశం గ్రామాల వారి నివేదికలు సిద్ధం చేయండి మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం సాయంత్రం అవనిగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తుంగల సుమతి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. […]

Read More

వినతులు స్వీకరించిన మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి

అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మంత్రిని కలిశారు. చాలా ఏళ్ల నుంచి వసతి గృహాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నామని తమను ఆప్కోస్ […]

Read More

వంట గ్యాస్‌తో ఈకేవైసీ లింక్ ఎలాంటి చివరి తేదీ లేదు

కేంద్రం కీలక ప్రకటన ఢిల్లీ: గ్యాస్ వినియోగాదారులు ఈకేవైసీ రిజిస్ట్రర్ చేసుకోవాలని, లేదంటే సబ్సిడీ కట్ అవుతుందంటూ గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటన బాగా వైరల్ అవడంతో ప్రజలు భయంతో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. మరోవైపు గ్యాస్ కంపెనీలు సైతం ఈ ప్రక్రియను ప్రారంభించడం.. గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రమే ఈకేవైసీ రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేయడంతో, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. […]

Read More

జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి పూర్తి స‌హ‌కారం

* ఆర్ఆర్ఆర్ కు స‌హ‌క‌రించండి * మ‌న్నెగూడ ర‌హ‌దారి * ఎన్‌హెచ్ఏఐ అధికారులతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి త‌మ పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ర‌హ‌దారుల నిర్మాణానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని తొల‌గిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏ) ఉన్న‌తాధికారులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తో ఆయ‌న నివాసంలో మంగ‌ళ‌వారం […]

Read More

కౌలు రైతులకు రుణాలు సులభతరం చేయండి

-వ్యవసాయానికి ఊతమివ్వండి -సంపద సృష్టించే రంగాలకు బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలి -100 శాతం డిజిటల్ లావాదేవీలు సాధించాలి. నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి పోతుంది. -5 రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, బ్యాంకర్లు, నిపుణులతో సబ్ కమిటీ -స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు -సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 227వ ఎస్ఎల్ బీసీ సమావేశం -2024-25 ఆర్థిక సంవత్సరానికి […]

Read More

నిరుద్యోగులకు మా సంపూర్ణ మద్దతు

ఈటల రాజేందర్ హైదరాబాద్: కెసిఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రావు వచ్చినా బ్రోకర్లకే పట్టం కడుతూ ఉద్యోగాలు అమ్ముకుంటారు అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు కానీ ఏం చేయలేదు. నిరుద్యోగుల్లో అలజడి నెలకొని ఉన్నది. చదువుకున్న వారంతా భగ్గుమంటున్నారు. యువత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించింది. అవిశ్వాసం ప్రకటించింది. ఒక ఉద్యోగానికి ఇంకో ఉద్యోగ పరీక్షకు […]

Read More

జగన్ బాధిత పోలీసులకు మోక్షమెప్పుడు?

-అసలు అస్మదీయులెవరు? తస్మదీయులెవరు? -ఇంకా లూప్‌లైన్‌లో 50 మంది జగన్‌రెడ్డి పోలీసు బాధితులు – జీతాలు లేకుండా వీఆర్‌లో ఏళ్లపాటు మగ్గిన పోలీసు అధికారులు – అందులో కమ్మవర్గానికి చెందిన వారే ఎక్కువ – ప్రభుత్వం మారినా మారని పోస్టింగుల తీరు – మంత్రి అచ్చెన్న అన్నయ్య కూడా ఇంకా లూప్‌లైన్‌లోనే – రామతీర్థలో బాబుపై కేసులు పెట్టిన అధికారికి పోస్టింగ్ – బాబు కాన్వాయ్‌కు లారీలు అడ్డుపెట్టిన వారికి […]

Read More

పసికూనల ప్రాణాలు తీస్తున్న రష్యా సైన్యం

-చిన్నారుల ఆసుపత్రిపై దాడి -41 మంది మృతి కీవ్‌: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. సోమవారం కీవ్‌లోని చిన్నారుల ఆసుపత్రిపై క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారులతో సహా 41 మంది చనిపోయారు. 170 మందికి పైగా గాయపడ్డారు. వివిధ నగరాల్లో రష్యా చేసిన దాడుల్లో 100కు పైగా భవనాలు నేలమట్టం అయ్యాయి. దాడి సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పోలండ్‌లో ఉన్నారు. […]

Read More

మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తునిపై ఐజీకి ఫిర్యాదు చేసిన సుధాకర్

గుంటూరు: ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన సామాన్య పౌరుడు అయిన సుధాకర్ పై తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వారి అనుచరులు దాడికి దిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడికి సంబంధించి తెనాలికి చెందిన సుధాకర్ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠికి సోమవారం ఫిర్యాదు చేశారు. తనపై దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులపై దర్యాప్తు వేగవంతం చేయాలని కోరారు. స్పందించిన ఐజీ తగిన […]

Read More

డిప్యూటేషన్ పై ఆంధ్రకు ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడు

ఢిల్లీ: తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి యల్. సుబ్బరాయుడు డిప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కి వెళ్తున్నారు. మంగళవారం కేంద్ర హోం శాఖ అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి సుబ్బరాయుడు ను మూడేళ్లపాటు ఇంటర్ క్యాడర్ డిప్యూటేషన్ లో ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేస్తూ, వెంటనే తెలంగాణ ప్రభుత్వం […]

Read More