పాత ఆధార్ జూన్ 14 తర్వాత కూడా పనిచేస్తుంది

జూన్ 14 తర్వాత పాత ఆధార్ కార్డులు పనిచేయవంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఉడాయ్ ఖండించింది. గత పదేళ్లుగా ఆధార్ కార్డును ఎలాంటి అప్‌డేట్ చేసుకోని వారు జూన్ 14లోగా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. గడువు తర్వాత అప్‌డేట్ చేసుకోవాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అప్‌డేట్ చేయని పాత ఆధార్ కార్డులు పని చేయకపోవడం అనేది ఉండదని స్పష్టం చేసింది.

Read More

హైదరాబాద్ ఇక ఉమ్మడి రాజధానిగా లేనట్లే!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2వ తారీఖున ముగియనుంది. దీంతో హైదరాబాద్ లో ఉన్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నీఆ రాష్ట్రానికి మార్చుతున్నారు. గతేడాది ముఖ్యమంత్రి జగన్ అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ కి తరలించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (GAD)కు ఆదేశాలు జారీ చేశారు.

Read More

జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కు త్వరలో లీగల్ నోటీస్

అమరావతి,26 మే: విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డిపై రెండు రోజులుగా అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో త్వరలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసు జారీ చేయనున్నారు. శనివారం విశాఖపట్నంలో కార్పోరేటర్ మూర్తి యాదవ్ సిఎస్ జవహర్ రెడ్డి వారిపై చేసిన అసత్యమైన,నిరాధార ఆరోపణలు వాస్తవం కాదని ఇప్పటికే ఖండిస్తూ పత్రికా ముఖంగా స్టేట్మెంట్/రిజాయిండర్ ఇవ్వడమైనది. అయినప్పటికీ […]

Read More

రాష్ట్రానికి పట్టిన గ్రహణం జూన్‌ 4న వీడనుంది

స్థానిక సంస్థలకు మంజూరైన నిధులు దారిమళ్లించారు ఈ ఎన్నికల్లో జగన్‌రెడ్డికి తమ సత్తా చూపించాం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని దేవుళ్లను మొక్కుకున్నా పీఆర్‌ చాంబర్‌ అధ్యక్షుడు, టీడీపీ నేత వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ శ్రీకాళహస్తి, మహానాడు : ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని భగవంతుడిని కోరుకున్నట్లు పీఆర్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ నేత వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. తిరుమల శ్రీవారు, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, శ్రీకాళహస్తిలోని పరమశివుడిని […]

Read More

పిన్నెల్లి సోదరులపై మరో హత్యాయత్నం కేసు

సీఐ నారాయణస్వామి స్టేట్‌మెంట్‌ ఆధారంగా నమోదు సిట్‌ రంగప్రవేశం తర్వాత మారిన పరిణామాలు మాచర్ల, మహానాడు : మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తలపై దాడి చేయబోయిన పిన్నెల్లి బ్రదర్స్‌, వారి అనుచరులను అడ్డుకున్న కారంపూడి సీఐ నారాయణస్వామిపై రాళ్ల దాడి జరిగింది. దాంతో తీవ్రంగా గాయపడిన సీఐ తొలుత 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు […]

Read More

సీఎస్ జవహర్‌రెడ్డిపై కేంద్రానికి లేఖ రాస్తున్నాం

– సిఎస్ దురాగతాలపై సీబీఐ విచారణ జరపాలి – అసైన్డ్ చట్టాన్ని కాపాడాలి – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ దళిత కార్పొరేషన్ల రద్దుకు, నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి పంపించే దళితుల నిధులు డైవర్ట్ కావడానికి పూర్తి బాధ్యత సిఎస్ జవహర్ రెడ్డి భరించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిజెపి అధికార ప్రతినిధి ఆర్డీవిల్సన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గతంలో ఎస్ఆర్ శంకరన్, […]

Read More

మోదీపై కుహనా మేధావుల కడుపుమంట

– దేశ ప్రజలు అమాయకులు కాదు – ఇన్కమ్ టాక్స్,ఇడి, సిబిఐల ద్వారా 26,000 కోట్ల రూపాయల సీజ్ – మీడియా సంస్థలలో, డిబేట్లలో, అనలిస్టుల పేరుతో, యాంకర్ల పేరుతో కడుపు మంట – బిజెపి, మోడీ మీద అక్కసు వెళ్ళగక్కే కుహనా -లౌకికాలకు సమాధానం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి గతంలో కంటే ఓట్లు, సీట్లు తగ్గుతాయని కొంతమంది దేశ వ్యతిరేకులు, అవినీతిని ప్రోత్సహించేవారు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లు, […]

Read More

మంత్రి కాకాణి అనుచరుడు పూర్ణారెడ్డి అరెస్ట్

– రేవ్ పార్టీ ఏర్పాటులో మంత్రి కాకాణి అనుచరుడికి ముఖ్యపాత్రగా గుర్తింపు – వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరు డు అరుణ్ కుమార్ సెల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు – కేసు దర్యాప్తును వేగవంతం చేసిన బెంగళూరు పోలీసులు – మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ బెంగళూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు వేగవంతం చేశారు. ఈ […]

Read More

మోడీ,అమిత్ షా ఆందోళనలో ఉన్నారు

రైతులకు చట్టబద్ధంగా మద్దతు ధర దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో 30 లక్షల ఉద్యోగ ఖాళీలు పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఫరీద్ కోట్ : ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తాం, రైతుల కష్టానికి తగిన ఫలితం రాబోయే రోజుల్లో దక్కనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ […]

Read More

ఆర్వో సీల్‌ లేకున్నా పోస్టల్‌ బ్యాలెట్ల చెల్లుబాటు

ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు సంతకం ఉన్నా సరిపోతుందని వెల్లడి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఉత్తర్వులు అమరావతి: ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్ల చెల్లుబాటులో ప్రతిపక్షాలకు భారీ ఊరట లభించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌ వెనక రిటర్నింగ్‌ అధికారి సంతకం ఉండి …సీల్‌ లేదన్న కారణంతో పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్‌ అధికారి సంతకానికి, బ్యాలెట్‌ చెల్లుబాటుకు సంబంధం లేదని స్పష్టం చేసింది. […]

Read More