నేడు ఇటలీకి ప్రధాని మోదీ

జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి పీఎం పదవి చేపట్టిన అనంతరం మోదీ తొలి విదేశీ పర్యటన కానుంది. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, తదితరులు హాజరు కానున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణలపై చర్చించనున్నారు.

Read More

హైదరాబాద్-అయోధ్య విమానం రద్దు

హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు నేరుగా నడిపే విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు స్పైస్‌ జెట్‌ సంస్థ ప్రకటించింది. 2 నెలల క్రితం వారానికి 3 సర్వీసుల చొప్పున స్పైస్‌ జెట్ ఈ విమాన సర్వీసును ప్రారంభించింది. అయితే, తగినంత డిమాండ్‌ లేక పోవడంతో సర్వీసును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీసును రద్దు చేసినప్పటికీ చెన్నై-అయోధ్యల మధ్య విమాన సర్వీసును యథాతథంగా నడుపుతున్నట్లు పెర్కొంది.

Read More

నటుడు పృథ్వీరాజ్‌కు షాక్.. అరెస్టు వారెంట్‌ జారీ

సినీ ఇండస్ట్రీలో ‘30 ఇయర్స్‌ ఇండస్ట్రీ’ పేరిట మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీనటుడు పృథ్వీరాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకావడం లేదని ఫ్యామిలీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు, సీఎంకు టీటీడీ జేఈఓ గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.

Read More

Chandrababu: ప్రపంచంలో తెలుగుజాతి అత్యున్నత స్థాయిలో ఉండాలి: చంద్రబాబు

గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. తిరుమల: గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో తెలుగుజాతి […]

Read More

పరదాలెందుకు కట్టారు? అధికారులపై చంద్రబాబు ఫైర్..

నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే గత సీఎం పర్యటనకు కట్టినట్లే మళ్లీ దారి వెంట అధికారులు చంద్రబాబు పర్యటనకు సైతం పరదాలు కట్టారు. తన పర్యటనల్లో పరదాలు, అనవసరపు ఆంక్షలకు దూరంగా ఉండాలని అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి: నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు […]

Read More

తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు

కుటుంబంతో స్వామివారి దర్శనానికి ముఖ్యమంత్రి.. చంద్రబాబుకు స్వాగతం పలికిన టీటీడీ జేఈవో గౌతమి.. సీఎం చంద్రబాబు వెంట కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.

Read More