జులై నుంచి రాగులు పంపిణీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జొన్నలు పంపిణీ రేషన్ కార్డుదారులకు శుభవార్త అమరావతి: రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ శుభవార్త . జులై నుంచి రాగులు పంపిణీ చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం రాయలసీమలోని 8 జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా, మిగతా జిల్లాలకు విస్తరించనున్నారు. 3 కేజీల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. అటు జులై నుంచే సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో […]
Read Moreకేరళ కాదు కేరళం
రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ఆమోదం కోసం త్వరలో కేంద్రానికి ఆగస్టులో కూడా ఇదే తరహా తీర్మానం కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని కోరుతూ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలతో పాటు అందరూ ఏకపక్షంగా ఆ తీర్మానాన్ని ఆమోదించారు. పేరు మార్పునకు చెందిన తీర్మానాన్ని ఆమోదం కోసం త్వరలో కేంద్రానికి పంపనున్నారు. గత ఏడాది […]
Read Moreభావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది
ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది కంగ్రాట్స్ డియర్ నారా లోకేశ్ – లోకేశ్‌పై నారా బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ అమరావతి ఏపీ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ చేశారు. “అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఈడీ వెలుగులతో […]
Read More26వ తేదీ నుంచి పవన్ వారాహి అమ్మవారి దీక్ష
అమరావతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజులపాటు దీక్ష చేస్తారు. ఇందులో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.
Read Moreపొగాకు అదనపు పంటపై అపరాధ రుసుము రద్దు?
పొగాకు రైతులకు కేంద్రం శుభవార్త సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఇది ఏపీ పొగాకు రైతాంగానికి శుభవార్త అని పురందేశ్వరి ట్వీట్ ఢిల్లీ: పొగాకు అదనపు పంట అమ్మకం, అదనపు పంటపై వేసే అపరాధ రుసుము రద్దు గురించి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో చర్చించారు. అందుకు సానుకూలంగా స్పందించిన పీయూష్ స్పందించి అనుమతి మంజూరు […]
Read Moreడిజిటల్ లైబ్రరీ కు కేటాయించిన రూ.750 కోట్లు సొమ్ములు ఏమయ్యాయి?
– వైసీపీ తొత్తులకు ఉద్యోగాల కోసం కార్పొరేషన్ పెట్టి దోచిపెట్టారు – నాకు నోటీసులు ఇచ్చిన వాసుదేవరెడ్డి అంతా కరెక్ట్ గా చేస్తే ఎందుకు పారిపోయాడు? – చిన్న వాసుదేవరెడ్డి, దేవేందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ లాంటి నేతలను డిజిటల్ కార్పొరేషన్ ద్వారా పోషించారు. – గూగుల్ లో “పొలిటికల్ యాడ్స్” ఇవ్వొచ్చా? – యాడ్స్ ను గూగుల్ ఎందుకు తొలగించింది? • గడిచిన ఐదేళ్లలో వ్యవస్థలను, కార్పొరేషన్ లను […]
Read Moreపల్నాడు అభివృద్ధికి చేయూతనివ్వాలి, అరాచకశక్తుల్ని అణిచివేయాలి
-జీవీ ఆంజనేయులు -సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన జీవీ, పల్నాడు ఎమ్మెల్యేలు పల్నాడు అభివృద్ధికి అన్నివిధాల తోడ్పాటును అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును… అక్కడ కొన్ని ప్రాంతాలను అయిదేళ్లు రావణకాష్టంగా మార్చిన అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేశారు ఆ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. సోమవారం రాష్ట్రమంత్రిమండలి తొలి సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం నేపథ్యంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం […]
Read Moreప్రజావసరాలకు అనుగుణంగా ఇసుక సరఫరా
గనులు, ఎక్సైజ్ శాఖలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన నూతన ఎక్సైజ్ విధాన రూపకల్పన గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖలు కేటాయించడం ఒక గురుతర బాధ్యత రాష్ట్ర గనులు, భూగర్బ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, జూన్ 24 : గత ఐదేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైన గనులు, ఎక్సైజ్ శాఖలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్బ వనరులు […]
Read Moreపవన్ కళ్యాణ్ ని కలిసిన తెలుగు సినీ నిర్మాతలు
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదనీ, త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న […]
Read Moreరామోజీ సంస్మరణ సభలో లోపాలు ఉండవద్దు
రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయండి సమాచారశాఖ మంత్రి పార్దసారథి ఆదేశం మచిలీపట్నం: పద్మ విభూషణ్ గ్రహీత, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఈనెల 27వ తేదీన రామోజీరావు సంస్మరణ కార్యక్రమం నేపథ్యంలో సోమవారం సాయంత్రం పెనమలూరు మండలం […]
Read More