అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

– నేర సమీక్షా సమావేశం డీజీపీ జితేందర్ విజ‌య‌వాడ‌, మహానాడు: రాష్ట్రంలో నేరాలను నియంత్రించడానికి, నేర ధోరణులను విశ్లేషించడానికి, ప్రజల భద్రత పెంచడానికి, చట్టాల అమలును మెరుగుపరచడానికి అవసరమైన చర్యలపై డిజిపి డాక్టర్ జితేందర్ అధ్యక్షతన మంగళవారం నాడు డిజిపి కార్యాలయంలో సమగ్ర అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల సీపీలు, జోన్ల ఐజీలు, రేంజ్ డీఐజీలు, స్టాఫ్ అధికారులు హాజరయ్యారు. […]

Read More

లేఅవుట్లు, భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తులు స‌ర‌ళీకృతం

– మీడియా స‌మావేశంలో మంత్రి నారాయ‌ణ విజ‌య‌వాడ‌, మహానాడు: రాష్ట్రంలో లేఅవుట్లు, భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తుల‌ను నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళీకృతం చేస్తామ‌ని మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ తెలిపారు. ఇదే స‌మ‌యంలో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. రాష్ట్రంలో ప‌లు బిల్డ‌ర్ల అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌తో విజ‌య‌వాడ‌లోని సీఆర్డీఏ ప్ర‌ధాన కార్యాల‌యంలో మంగళవారం మంత్రి నారాయ‌ణ స‌మావేశం నిర్వ‌హించారు. సీఆర్డీయే క‌మిష‌న‌ర్ కాటంనేని భాస్క‌ర్, అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ […]

Read More

రెవెన్యూ శాఖ‌లో ప‌దోన్న‌తులు క‌ల్పించండి

– మంత్రి పొంగులేటిని కోరిన‌ డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌ అమరావతి, మహానాడు: రెవెన్యూ శాఖ‌లో అర్హులైన ఉద్యోగులంద‌రికీ ప‌దోన్న‌తులు క‌ల్పించాల‌ని డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు వి.ల‌చ్చిరెడ్డి, కె.రామ‌కృష్ణ కోరారు. ప‌దోన్న‌తులు ల‌భించ‌క‌పోవ‌డంతో ఏళ్ల త‌ర‌బ‌డి ఉద్యోగులు ఎదురు చూస్తున్న‌ట్టుగా తెలిపారు. రెవెన్యూ వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి గ్రామ స్థాయిలో అనుభ‌వం ఉన్న వారికి అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు. తెలంగాణ డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు వి.ల‌చ్చిరెడ్డి ఆధ్వ‌ర్యంలో అసోసియేష‌న్ ప్ర‌తినిధులు […]

Read More

కాశ్మీరీ వలసవాదుల భద్రత, స్వయం ఉపాధికి కేంద్రం చర్యలు

– వివరాలు వెల్లడించిన హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ, మహానాడు: కాశ్మీరీ వలసదారుల భద్రత ఉపాధి కోసం కేంద్రం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మంగళవారం  దీనికి సంబంధించిన సమాచారం తో పాటు గణాంకాలను హోం మంత్రిత్వ శాఖ వివరాలు తెలిపింది. ఆ డేటా ప్రకారం, ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ-2015, ప్రధానమంత్రి పునర్నిర్మాణ పథకం-2008 కింద మంజూరైన 6,000 ప్రభుత్వ ఉద్యోగాల్లో 5,724 మంది కాశ్మీరీ వలసదారులు […]

Read More

అక్రమ కేసులు, హత్యలపైనే అధిక ఫిర్యాదులు

• వైసీపీ పాలనలో అక్రమంగా సస్పెండ్ చేశారంటూ పోలీసుల కన్నీరు • 2023 పోలీస్ రిక్యూర్మెంట్ లో తప్పుడు మార్కుల వలన ఆగిన నియామకాలను కొనసాగించాలని వినతి • భూ కబ్జాలు, చోరీలు, బెదిరింపులపై మంగళగిరికి తండోప తండాలుగా తరలివచ్చిన అర్జీదారులు అమరావతి, మహానాడు: ప్రజా తీర్పుతో వైసీపీ ప్రభుత్వం కూలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో వైసీపీ పాలనలో జరిగిన ఘోరాలు ఒక్కొక్కొటీ బయటపడుతున్నాయి. మంగళగిరి టీడీపీ జాతీయ […]

Read More

పండగలా ‘హర్ ఘర్ తిరంగా’

– బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు హైదరాబాద్, మహానాడు: ఆగస్టు 15 సందర్భంగా ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించుకోవాలని నిర్ణయించినట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 7న అన్ని జిల్లాల్లో హర్ ఘర్ తిరంగ కార్యక్రమం నిర్వహణ కోసం విధివిధానాలపై […]

Read More

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల

అమరావతి, మహానాడు: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామి నేషన్ల స్వీకరణ, 30న పోలింగ్, సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించు కుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా, వైసీపీకి 615, కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్సను ఎంపిక […]

Read More

తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన సుష్మా స్వరాజ్‌

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. దివంగత సుష్మా స్వరాజ్ వర్థంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీలో అనేక కీలక బాధ్యతలు […]

Read More

ఇతర రాష్ట్ర విద్యార్థులు స్థానికులు అవుతారనే వాదన సరికాదు

ట్విట్టర్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనల ప్రకారం, MBBS అడ్మిషన్ల కోసం గత ప్రభుత్వం G.O.114 Dt.5.7.2017ని జారీ చేసింది. దీని ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిబంధనను కొనసాగించింది కావున G.O.33 జారీతో ఇతర రాష్ట్ర విద్యార్థులు స్థానికులు అవుతారనే వాదన సరైనది కాదు. మునుపటి G.O […]

Read More

ఏపీఐఐసీ కాలనీలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తా

-4వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఏపీఐఐసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మంగళవారం ఉదయం పర్యటించారు. అనంతరం కోగంటి రామయ్య కళ్యాణమండపంలో స్థానిక పెద్దలతో సమావేశమై స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి […]

Read More