తిరుపతి, మహానాడు: తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ వచ్చింది. అగంతకుడు ఈ-మెయిల్ ద్వారా లేఖను పంపాడు. సీఐఎస్‌ఎఫ్ అధికార వెబ్‌సైట్‌కు లేఖ అందింది. అయితే, ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు ఈ సంగతిని గోప్యంగా ఉంచి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ-మెయిల్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
Read Moreసికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు
– వారానికి రెండు పర్యాయాలు – ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్, మహానాడు: కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ నుంచి గోవాకు సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) స్పెషల్ ట్రైన్ వేసింది. వారంలో రెండుసార్లు ఉండే ఈ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే అటు వాస్కోడగామా నుంచి ఉదయం తొమ్మిది గంటలకు రైలు […]
Read Moreపెనుగంచిప్రోలులో మెగా వైద్య శిబిరం
– ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు మండలం & పెనుగంచిప్రోలు గ్రామంలో ఎంపీపీ స్కూల్ నందు పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్యగారి చొరవతో విజయవాడ స్రవంతి హాస్పటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా అన్ని రకాల విభాగాలకి సంబంధించిన రోగులకి […]
Read More21,768 మంది వరద బాధితుల బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లు
సరిచేసి నేటి నుండి వారి ఖాతాల్లో వరద సాయం జమ వెల్లడించిన అధికారులు అమరావతి: ఇటీవల విజయవాడ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితుల్లో 21,768 మంది బాధితులు తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. వాటిని మళ్లీ క్షేత్రస్థాయిలో బాధితులతో తనిఖీ చేసి సరిచేశారు. ఈ బాధితులందరికీ సోమవారం సాయంత్రానికి వారందరి ఖాతాల్లోకి వరద సాయం జమ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరి ఖాతాల్లోకి […]
Read Moreముందస్తు పరీక్షలతో కేన్సర్ ను కట్టడి చేద్దాం
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేన్సర్ వ్యాధి వయసు, లింగ బేధం లేకుండా లక్షలాది మంది జీవితాలను కబలించివేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ సంస్థ “రన్ ఫర్ గ్రేస్ – స్ర్కీన్ ఫర్ లైఫ్” అనే నినాదంతో గచ్చిబౌలిలో నిర్వహించిన గ్రేస్ రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మన దేశంలో కేన్సర్ వ్యాధి లక్షలాది మంది పేదల జీవితాలను చిన్నాభిన్నం […]
Read Moreతెలుగుదేశంలో చేరిన పద్మరాజు
రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం గుడిమూల పిఎసిఎస్ అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు రుద్రరాజు పద్మరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ఆదివారం నాడు కొత్తపేటలోని తమ నివాసంలో పార్టీ కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. సఖినేటిపల్లి మండల టిడిపి అధ్యక్షులు ముప్పర్తి నాని, ప్రధాన కార్యదర్శి తాడి సత్యనారాయణ, నియోజకవర్గ టిడిపి నాయకులు, ఆచంట నియోజకవర్గ పరిశీలకులు రుద్రరాజు […]
Read Moreగుంటూరు ఛానల్ అభివృద్ధికి కృషి
– కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, మహానాడు: గుంటూరు ఛానల్ అభివృద్ధి అందరి కల… రాబోయే జనవరి నుంచి పూడికలు తీయించి నిర్వహణ బాధ్యత తీసుకుంటాం.. నల్లమడ డ్రైన్, గుంటూరు నల్ల సమస్యను పరిష్కరించి, గుర్రపు డెక్క రాకుండా శాశ్వత పరిష్కారం ఎలా అందించాలన్న అంశంపై అధికారులతో నిరంతరంగా పరిశీలిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఖర్చులు, నిధుల నిమిత్తం నాబార్డ్ […]
Read More