లోన్ వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్!

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్‌ లకు షాకిచ్చింది.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ట్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్‌) పెంచుతున్నట్టు ఆ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. సవరించిన లోన్ వడ్డీ రేట్లు ఈనెల ఏడోతేదీ నుంచే అమలు లోకి వస్తాయని తెలిపింది. ఆరు నెలల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటును, మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటును అయిదు బేసిస్ పాయింట్ల మేర పెంచినట్టు వెల్లడించింది. మిగితా టెన్యూర్ ఎంసీఎల్‌ఆర్‌ రేటును యథాతథం […]

Read More

ప్రధాని మోదీతో సీఎం బాబు భేటీ

ఢిల్లీ: రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు , ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చంద్రబాబు,ఢిల్లీ చేరుకొని నేరుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్‌ శంకుస్థాపన, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకొనేందుకు కేంద్రం నుంచి […]

Read More

మండలాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు

– యడ్లపాడులో గ్రీవెన్స్ నిర్వహించిన ప్రత్తిపాటి యడ్లపాడు, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వారం వారం మండలాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రతివారం ఒక మండలంలో ఈ వేదిక నిర్వహించి ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశా లతో పాటు రెవిన్యూ సమస్య ల […]

Read More

మున్సిపాలటీ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష

అద్దంకి: మున్సిపాలిటీ లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మంచి నీటి సరఫరా, రహదారులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలపై దృష్టి పెట్టాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులకు సూచించారు. పట్టణ వీధుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా శుభ్రం చేయాలని తెలిపారు. […]

Read More

25 వేల కేజీల డ్రగ్స్ కేసు ఏమైంది?

– సీబీఐ,పోలీసులు, ఇంటర్ పోల్ చేసిన ఆపరేషన్ రిజల్ట్ ఏది? – మార్చి నెల నుండి ఇప్పటివరకు విశాఖ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసును ఎందుకు బయటపెట్టడం లేదు? – ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ విశాఖ: రాష్ట్రంలో ఇసుక ఇబ్బందుల వల్ల దాదాపుగా 26 సెక్టార్లకు సంబంధించిన వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక 370 రూపాయలు సీనరేజీ, వంద రూపాయలు హ్యాండిల్ చార్జెస్ […]

Read More

ధర్మవరం రూపురేఖలు మార్చే హ్యాండ్లూమ్ క్లస్టర్

– ఏర్పాటుకు సత్వర చర్యలు – కేంద్రానికి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి అమరావతి : శతాబ్దాలుగా చేనేత రంగానికి ముఖ్యంగా పట్టు చీరెల ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచిన శ్రీ స‌త్య‌సాయి జిల్లాలోని త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం ధర్మవరంలో “హ్యాండ్లూమ్ క్లస్టర్” ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర జౌళి, చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక లేఖలో […]

Read More

జానీ మధ్యంతర బెయిల్ రద్దు చేయండి

– పోలీసుల పిటిషన్ రంగారెడ్డి: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది, మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. జాతీయ అవార్డు అందుకోవడం కోసం రంగారెడ్డి కోర్టు మంజూరు చేసిన 4 రోజుల మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేయనున్నారు. ఈ నెల 10వ తేదీన కోర్టులో హాజరుకావాలని జానీ మాస్టర్‌ను రంగారెడ్డి కోర్టు ఆదేశించింది. అయితే జానీ […]

Read More

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం

ముంబై: చెంబూరులో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం అయినట్టు తెలిసింది, అయితే, ఈ ప్రమాదానికి గల కారణాన్ని పోలీసులు విచారణలో భాగంగా తేల్చారు. దేవీ నవరాత్రుల్లో బాగంగా ఇంట్లో పెట్టిన దీపం వల్లే కుటుంబంలోని ఏడుగురు మరణించారని పోలీసులు నిర్దారించారు. పోలీసుల కథనం ప్రకారం.. చెంబూరు లోని సిద్ధార్థ్‌ కాలనీలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు సమాచారం అందించారు. దీనిపై […]

Read More

రూ.290 కోట్లతో రాష్ట్ర రహదారులకు మరమ్మతులు

• తొలి దశలో 1393 రోడ్లకు 7071 కి.మీ మేర మరమ్మతులు • వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ. 186 కోట్లు విడుదల • రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడి • రహదారుల నిర్వహణపై SRM వర్సిటీలో ఆర్ & బీ శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ అమరావతి: రాష్ట్రంలో మెరుగైన రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని […]

Read More

అభివృద్ధికి మావోలే అడ్డు!

– హింసతో ఏదీ సాధించలేం.. – జనజీవన స్రవంతిలో కలవండి… ఇది నా పిలుపు – అనేక పథకాలు అమలవుతున్నాయి… – వాటిని వినియోగించుకుని ప్రజల్లోకి వచ్చేయండి… – వికసిత్ భారత్ సాధించాలంటే ఆదివాసీలు భాగం కావాలి – కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఢిల్లీ: వికసిత్ భారత్ సాధించాలంటే అందులో ట్రైబల్ ప్రజలు కూడా భాగం కావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. కానీ […]

Read More