నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం

– హోంమంత్రి అనిత కడప, మహానాడు: కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది పెట్రోల్‌ దాడి ఘటనలో ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందడం విషాదకరమని ఏపీ హోంమంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడు విఘ్నేష్‌ను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. నిందితుడు, అతడికి సహకరించిన వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. బాధితురాలి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని అనిత హమీ ఇచ్చారు.

Read More

సీఎం రేవంత్‌కు 317 జీవోపై తుది నివేదిక అందజేత

హైదరాబాద్‌, మహానాడు: 317 జీవో పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సభ్యులు, మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు నిష్ణాతులైన మేధావులతో సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల అభిప్రాయాలను క్యాబినెట్ సబ్ కమిటీ వినతుల రూపంలో ప్రత్యక్షంగా, వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ ను స్వీకరించి వారి […]

Read More

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తమ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు చేసింది. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరంను ఈ మేరకు ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది.

Read More

వైవిధ్య ఉత్పత్తుల్లో ప్రపంచ అగ్రగామి టాటా

– ఆర్థిక నిపుణుడు చెరుకూరి కుటుంబరావు గుంటూరు, మహానాడు: ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలలో వైవిధ్యం గల వస్తు ఉత్పత్తి చేస్తూ 420 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో ప్రపంచ గుర్తింపు పొందిన వ్యాపార దిగ్గజంగా టాటా గ్రూప్ రూపొందటం అభినందనీయమని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ప్రణాళిక సంఘ పూర్వ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు పేర్కొన్నారు. స్థానిక జనచైతన్య వేదిక హాలులో ఆదివారం భారత్ ప్రగతిలో టాటాల పాత్ర అనే అంశంపై […]

Read More

గుర్ల ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

– డయేరియా మరణాలపై సీనియర్ ఐఎఎస్ అధికారితో విచారణ అమరావతి, మహానాడు: విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో అతిసారంతో ఎనిమిది మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం మరోసారి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. డయేరియా వల్లనే మరణాలు అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడారు. వైద్య శిబిరాలు ఏర్పాటు […]

Read More

బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు!

– వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం కక్కుర్తి తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం వీఐపీ దర్శన టికెట్లను వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం బ్లాక్‌లో అమ్ముకున్నారు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై భక్తులు ఆరు టికెట్లు పొందారు. ఈ ఆరు టికెట్లను రూ.65 వేలకు వైసీపీ ఎమ్మెల్సీ విక్రయించారు. ఈ సంఘటనపై టీటీడీ అధికారులకు ఓ భక్తుడి ఫిర్యాదు చేశారు. విచారణలో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం బ్లాక్‌లో టికెట్లు అమ్ముకున్నారన్న […]

Read More

ఘనంగా ఏపీఎస్‌పీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం ప్రారంభం

– 4 రోజుల పాటు వేడుకలు – తొలిరోజు విజేతలు వెల్లడి – ముగింపు ఉత్సవానికి హాజరుకానున్న హోం మంత్రి అనిత గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఏపీఎస్‌పీఎఫ్‌) 33 ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆ సంస్థ అధినేత డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ ఆధ్వర్యంలో ఐజి బి.వెంకటరామిరెడ్డి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆదివారం ఏపీఎస్‌పీఎఫ్‌ స్పోర్ట్స్‌ మీట్‌-2024ను ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలు […]

Read More

పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు!

– గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం – సీఎం బాబుతోనే గ్రామాలకు పూర్వ వైభవం – మంత్రి సవిత మరువపల్లి, మహానాడు: ఉపాధి హామీ పథకం రాష్ట్రాలకు జీవం పోషిందని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజక వర్గం పెనుకొండ మండలం రాంపురం పంచాయతీ మరువపల్లి గ్రామంలో 86 లక్షల నిధులతో ఆదివానం పలు అభివృద్ధి పనులకు […]

Read More

‘సూపర్ సిక్స్‌’ అమలు రాష్ట్రంలో ఒక చరిత్ర!

– మంత్రి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు, మహానాడు: తెనాలిలో పల్లె పండుగ లో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్  శంకుస్థాపన చేశారు. ఖాజీపేట గ్రామంలోని అనుమర్లపూడి, కొలకలూరు, ఎరుకలపూడి, కటేవరం, సంగం జాగర్లమూడి అంగలకుదురు మల్లెపాడు, జగ్గడిగుంటపాలెం గ్రామంలోని నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆర్ధిక ఇబ్బందులు ఉన్న ‘సూపర్ సిక్స్‌’ అమలుతో […]

Read More

టీడీపీ మైనారిటీ నేత షేక్‌ కరిముల్లా మృతికి సీఎం సంతాపం

అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన షేక్ కరిముల్లా మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కరిముల్లా మృతి బాధాకరం అని అన్నారు. కింది స్థాయి నుండి రాష్ట్ర నేతగా కరిముల్లా ఎదిగారన్నారు. కరిముల్లా కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతిని తెలిపారు.

Read More