– కొమ్మాలపాటి శ్రీధర్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారన్నారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకోవడం తో నిరుద్యోగులు హర్షం వ్యక్తం […]
Read Moreచిత్తశుద్ధిలో చంద్రబాబుకు ఎవరు సాటి లేరు, రారు
– మాజీమంత్రి ప్రత్తిపాటి చెప్పింది చేసే చిత్తశుద్ధి, పేదల కష్టాలను పట్టించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎవరు సాటి లేరు, రారన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రాలపై సంతకం చేయడమే అందుకు నిదర్శనమన్నారు. వాటితో పాటు పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన దస్త్రాలపై సంతకాలతో […]
Read Moreప్రజాసమస్యలను అత్యవసరంగా పరిష్కరించండి
– గళ్ళా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత 5ఏళ్ళ నుండి ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారని, వీటిని అత్యవసరంగా గుర్తించి, పరిష్కార దిశగా మునిసిపల్ అధికారులు కృషి చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. గురువారం తనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన మునిసిపల్ అధికారాలతో మాధవి సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో తన దృష్టికి వచ్చిన పలు ప్రజాసమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. […]
Read Moreడ్వాక్రా, అంగన్వాడి, ఆశా ఉద్యోగస్తులతో కేక్ కట్ చేసిన కన్నా
సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు తెలుగుదేశం జనసేన బిజెపి అధికారంలోకి వచ్చిన తరుణం మరియు కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ డ్వాక్రా, అంగన్వాడి, ఆశ వర్కర్లు మరియు మహిళ నాయకులు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreకేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని బాధ్యతలు స్వీకరణ
ప్రజా సేవకు అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ, చంద్రబాబుకు కృతజ్ఞతలు : పెమ్మసాని ‘ప్రజలు, నాయకుల అంచనాలకు తగిన విధంగా పనిచేస్తాను. ప్రజా సమస్యలను పరిష్కరించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టను.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలోని స్థానిక సంచార్ భవన్ లో కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోకి అడుగుపెట్టిన […]
Read Moreమరోసారి పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు
అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు సిద్ధం అయ్యారు. వెంకటపాలెంలోని టీటీడీ నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. గతంలో తమకు న్యాయం జరగాలని న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర చేశారు. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో తమ కష్టాలు తొలగిపోయాయని 15 రోజులు యాత్ర చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.
Read Moreఅప్పుడు మీకు చట్టాలు గుర్తు రాలేదా?
-విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్ బుద్దా వెంకన్న మాట్లాడుతూ…వైసిపిలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి కనిపించలేదా?. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసిపోయారు. లోకేష్ జూమ్ మీటింగ్ లోకి వస్తే వాళ్లకి తప్పు అని చెప్పలేదేం. దాడులు చేయవద్దని మా నాయకుడు ముందే చెప్పారు. ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయి రెడ్డి రాద్దాంతం చేస్తున్నారు. ఈ ఐదేళ్లల్లో […]
Read Moreకొచ్చర్ల గ్రామం నుండి తిరుమల వరకు అబ్బూరి శ్రీకాంత్ పాదయాత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మరియు వినుకొండ నియోజకవర్గం నుంచి జీవీ ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా కొచ్చర్ల గ్రామం నుండి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్రగా అబ్బూరి శ్రీకాంత్ చేయబోతున్నారు.ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు మరియు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిశంకర […]
Read Moreనేడు ఇటలీకి ప్రధాని మోదీ
జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి పీఎం పదవి చేపట్టిన అనంతరం మోదీ తొలి విదేశీ పర్యటన కానుంది. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, తదితరులు హాజరు కానున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణలపై చర్చించనున్నారు.
Read Moreహైదరాబాద్-అయోధ్య విమానం రద్దు
హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నడిపే విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు స్పైస్ జెట్ సంస్థ ప్రకటించింది. 2 నెలల క్రితం వారానికి 3 సర్వీసుల చొప్పున స్పైస్ జెట్ ఈ విమాన సర్వీసును ప్రారంభించింది. అయితే, తగినంత డిమాండ్ లేక పోవడంతో సర్వీసును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీసును రద్దు చేసినప్పటికీ చెన్నై-అయోధ్యల మధ్య విమాన సర్వీసును యథాతథంగా నడుపుతున్నట్లు పెర్కొంది.
Read More