-ఆస్తులు, నీళ్లు పరిష్కారం తూతూమంత్రంగా -విద్యావకాశాలు, ఉపాధి కోల్పోతున్న యువత -10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ లాంటి నగరం నిర్మించలేని రాష్ట్ర ప్రభుత్వాలు -అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడాలి -మాజీ మంత్రి డా.సాకే శైలజానాథ్ డిమాండ్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం నేటితో ముగియునున్న సందర్భంలో మాజీ పీసీసీ చీఫ్ డా సాకే శైలజానాథ్ విచారం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా […]
Read Moreతెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘జాతీయ ప్రగతికి రాష్ట్రం చేసిన సహకారం పట్ల ప్రతి భారతీయుడు గర్వ పడుతున్నారు.. ఈ రాష్ట్రానికి గొప్ప చరిత్ర, శక్తిమంతమైన సంస్కృతి ఆశీర్వాదం ఉన్నాయి. రాబోయే కాలంలో రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నాం’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Read Moreతెలంగాణ ఉన్నత శిఖరాలకు చేరాలి
మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం హైదరాబాద్ లో హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “భిన్న సంస్కృతులను, భిన్న ప్రాంతాల ప్రజలతో మినీ భారత్ లాగా విలసిల్లే తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వానికి, సౌబ్రాతృత్వానికి గొప్ప ప్రతీక.. భారత అభివృద్ధి పయనంలో రాష్ట్రం మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని మనసారా […]
Read Moreవైకాపా ధనంజయ రెడ్డిని కరేపాకును చేసిందా?
జగనుకు కళ్లు, చెవులు లాగా పనిచేసిన ఆయన కార్యదర్శి ధనంజయ రెడ్డి గారి రిటైర్మెంట్ నిన్న. ఆయన రిటర్మెంట్ సభలో ఏ అధికారులు పాల్గొన్నారో & ఎంత ఘనంగా వీడ్కోలు పలికారో చూద్దామని సాక్షిని తిరగేస్తే.. అందులో అధికారుల పేర్లు లేవు. ఫోటో చూస్తే శ్రీలక్షి వున్నట్లుగా మసక మసకగా కనిపించింది సాక్షి పత్రికలో. సాక్షి వెబ్‌సైటులో వెతికా డిజిటల్ ఫోటోలో క్లారిటీ వుంటుంది అని. గంట సేపు వెతికినా […]
Read Moreబాబు లేఖతోనే తెలంగాణ
– తెలంగాణలో బడుగులకు గొడుగు పట్టిన ఘనత టీడీపీదే – పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దుతో బీసీ,ఎస్పీలకు స్వేచ్ఛ – బీసీలకు రాజకీయ జన్మనిచ్చిన ఘనత టీడీపీదే – తెలంగాణ టీడీపీ ఆఫీసులో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం ఆదివారం ఎన్‌టిఆర్ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామభూపాల్ రెడ్డి మొదట జాతీయ […]
Read Moreతెలంగాణ ప్రదాత తల్లి సోనియమ్మ
-దశాబ్దాల కలలను సాకారం చేశారు -ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు -మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్: తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలను అర్థం చేసుకుని విశ్వసనీ యతకు పట్టం కట్టి కలలను సాకారం చేసిన తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో తొలిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు ఆలోచనలు, ఆకాంక్షలకు […]
Read Moreనేడు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం
-కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ రాక -సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు పూర్తి -గన్‌పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించనున్న నేతలు -వేదికపై తెలంగాణ గీతం ఆవిష్కరణ..అనంతరం సన్మాన కార్యక్రమాలు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 9.30 నిమిషాలకు గన్ పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద సీఎం […]
Read Moreదశాబ్ది వేడుకలకు గవర్నర్‌కు రేవంత్ ఆహ్వానం
హైదరాబాద్: గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయనను ఆహ్వానించారు. ఈ వేడుకలను ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ హాజరుకానున్నారు.
Read Moreనాడు బలిదేవత..నేడు దేవత అయిందా?
-రాచరిక ఆనవాళ్లు ఉంటే వీటిని కూడా మార్చండి -అమరుల కుటుంబాలను ఇప్పటికైనా ఆదుకోండి -బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్: రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ లోగోను మారిస్తే కొన్ని పట్టణాల పేర్లు కూడా మార్చాలని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణాలు, జిల్లాలో పేర్లలో కూడా రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని వాటిని కూడా మార్చాలని కోరారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో […]
Read Moreనరసరావుపేట కౌంటింగ్ పరిసరాల్లో ఆంక్షలు
నరసరావుపేట: జేఎన్‌టీయూ కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. జూన్ 4న కఠిన ఆంక్షలు అమలుచేస్తామని ఎస్పీ మల్లికాగార్గ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల డ్రోన్స్ ఎగరవేయడానికి అనుమతి లేదని, అనుమతి లేనిదే చుట్టుపక్కల తిరగరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read More