అంబటి పిటిషన్‍పై హైకోర్టు తీర్పు రిజర్వ్

సత్తెనపల్లి :  తన   సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 వార్డుల్లో  రీ పోలింగ్ని ర్వహించాలని   మంత్రి అంబటి రాంబాబు   వేసిన పిటీషన్‌పై హైకోర్టులో గురువారం హైకోర్టు విచారణ చేసింది. మొత్తం నాలుగు పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ జరపాలని అంబటి కోర్టులో పిటిషన్ వేశారు. అంబటి పిటిషన్‍పై హైకోర్టులో   విచారణ ముగిసింది. పిటీషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

Read More

కుప్పకూలిన ఎమ్మెల్యే కొడాలి

గుడివాడ: ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థతకు గురయ్యారు. గురువారం తన నివాసంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్‌మెన్లు సపర్యలు చేసి వైద్యులకు సమాచారం అందించారు. దానితో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. కొడాలి ఇటీవలి కాలంలో అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసిందే.

Read More

డ్రగ్స్‌తో అగ్రనటులకూ లింకులు?

– సినిమాను చాకి‘రేవ్’పెడుతున్న పార్టీలు! -రేవ్ పార్టీ ఫీజు 50 లక్షలా? -మత్తుకు సినిమా చిత్తయిందా? -ఖాకీ విచారణ కంటితుడుపేనా? -స్టార్లతో ఖాకీలు కుమ్మక్కువుతున్నారా? -నాటి డ్రగ్స్ కేసు అటకెక్కిందా? -ఆ కేసులో రాజకీయ పార్టీ నేతల హస్తం? -రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకోదా? ( అన్వేష్) సినిమా.. అదో గమ్మతు లోకమే కాదు.. గ‘మత్తు’ లోకం కూడా! హీరోలు, హీరోయిన్లు తేడా ఏమీలేదు. అంతా మత్తుకు దాసాహమే. ఒకప్పుడు […]

Read More

హేమ బ్లడ్ టెస్టులో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్టు

– అవును.. హేమ డ్రగ్స్ తీసుకుంది – తనపేరు కృష్ణవేణి అని చెప్పిన హేమ – 87 మందికి పాజిటివ్‌ – బెంగుళూరులో డ్రగ్స్‌ పార్టీ – సినీ సెలబ్రెటీల హల్‌చల్‌ – మాకు సంబంధం లేదంటూ వీడియోలు వైరల్‌ – పోలీసుల దర్యాప్తులో పాజిటివ్‌ కేసులు బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలో పాల్గొన్న మొత్తం 109 మంది శాంపిల్స్ సేకరించి బ్లడ్ […]

Read More

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న హరీష్ రావు

జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రఖ్యా త పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, తదితరులు ఉన్నారు.

Read More

మహిళలకు బడుల బాధ్యతలు

-ఇక నుండి ప్రతి బడి- అమ్మ ఒడి -ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు -ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడిలా ఉండేలా…ప్రభుత్వ పాఠశాలల ఆలనా పాలన కోసం సర్కారు సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బాగోగులను పట్టించుకునే బాధ్యతను అక్కడి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలని […]

Read More

బాణసంచా విక్రయాలపై నిషేధం

– ఈసీ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు, ఉరేగింపులకు అనుమతులు రద్దు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Read More

మమతకు హైకోర్టు మొట్టికాయ.. ఎందుకంటే… ?

(రఘువంశీ) కలకత్తా హైకోర్టు నిన్న ఒక తీవ్రమైన తీర్పు ఇచ్చింది. ఏ తరగతినైనా OBCగా వర్గీకరించే రాష్ట్ర అధికారాన్ని నియంత్రించే 2012 స్కీమ్‌లో “శాసన విధానం” పూర్తిగా లేకపోవడాన్ని బెంచ్ ఎత్తి చూపించి, బెంగాల్ ప్రభుత్వం 2010 నుండి ఇప్పటివరకు ఇచ్చిన సుమారు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు అన్నిటినీ రద్దు చేసింది. అయితే, ఈ సర్టిఫికెట్లు ఆధారంగా ఇప్పటికే ఉద్యోగం పొంది ఉద్యోగాల్లో ఉన్నవారు అలాగే సెలెక్ట్ అయ్యి […]

Read More

హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

నాలుగు బూత్‌లలో రీపోలింగ్‌కు పిటిషన్‌ సత్తెనపల్లి, మహానాడు: నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. నియోజకవర్గంలోని 236, 237, 253, 254 బూత్‌లలో రీ పోలింగ్‌ నిర్వహించాలని పిటిషన్‌లో కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు మరో ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది.

Read More

ఛలో మాచర్లకు అనుమతి లేదు: ఎస్పీ

నరసరావుపేట, మహానాడు: తెలుగుదేశం పార్టీ గురువారం తలపెట్టిన ఛలో మాచర్ల కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ తెలిపారు. జిల్లాలో కౌంటింగ్‌ నేపథ్యంలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున టీడీపీ రాష్ట్ర నాయకు లు, కార్యకర్తలు, ప్రజలు ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ర్యాలీగా వెళ్లడం చేయకూడదని హెచ్చరించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read More