హైదరాబాద్: దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఖాజిపల్లి చౌరస్తాలో ఓ వెల్డింగ్ షెడ్‌లో కెమికల్ ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా ట్యాంకర్ పేలింది. దాంతో చుట్టుపక్కల ఉన్న పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. వెల్డింగ్ చేస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Moreకేంద్రమంత్రులకు శుభాకాంక్షలు: రేవంత్
హైదరాబాద్: తెలుగురాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా ఆకాంక్షించారు.
Read Moreజగన్ కుటుంబం కలిసిపోవాలి
పూనమ్‌కౌర్ ఆసక్తిక ట్వీట్ వైరల్ భిన్నంగా స్పందిస్తున్న వైసీపీ అభిమానులు అమరావతి: టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పు డు సినిమాలకు దూరంగా ఉంది. అయితే సినిమాయేతర విషయాలతో ఎక్కువ గా వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను లక్ష్యం గా చేసుకుని పూనమ్ చేసే ట్వీట్లు నెట్టింట […]
Read Moreజగన్‌పై తిరుగుబాటు చేసిన గిరిజనులకు ధన్యవాదాలు
12న ప్రమాణస్వీకారానికి పెద్దఎత్తున తరలిరండి టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధారునాయక్ అమరావతి: రాష్ట్రంలో కూటమి గెలిచిన ఐదు గిరిజన నియోజవర్గాల్లోనే కాకుం డా మిగిలిన 159 నియోజకవర్గాలలో జగన్‌పై తిరుగుబావుటా ఎగురవేసి కూటమికి మద్దతు తెలిపిన గిరిజన ఓటర్లకు పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, అదే స్పూర్తితో ఈ నెల 12న గన్నవరంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పెద్దఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం తెలియజే యాలని టీడీపీ ఎస్టీ […]
Read Moreబాబు గెలుపు కోసం అప్పుడే పనిచేశా..
చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నానని అనుకోవద్దు ప్రమాణ స్వీకార ముహూర్తం బలమైనది రుషికేశ్ వెళుతున్నా..ముందుగా ఆశీర్వదిస్తున్నా ఆయన గొప్పగా పరిపాలిస్తారు ఈసారైనా దేవాలయాల పాలన బాగుండాలి అమరావతిలోనూ శారదాపీఠం నిర్మిస్తాం విశాఖ స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలు విశాఖపట్నం: శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి సోమవారం మీడియా సమావేశంలో కూటమి గెలుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభు త్వం మారింది. గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్లం తప్ప సంపాదన […]
Read Moreఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం: రామ్మోహన్
శ్రీకాకుళం: కేంద్ర కేబినెట్లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు వెల్లడిరచారు. ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం. చాలా కాలం తర్వాత కేంద్రమంత్రి పదవి దక్కింది. కేంద్రంతో సఖ్యతే మాకు ముఖ్యం. మా మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి చర్చలు జరిపిన తర్వాతే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాం. రిజర్వేషన్ల అంశంలో మా ఆలోచనలో మార్పు లేదు అని స్పష్టం చేశారు.
Read Moreటీటీడీ ఇంజనీరింగ్ టెండర్లలో భారీ కుంభకోణం
‘‘రివర్స్ టెండరింగ్’’ పేరుతో స్వామికే పంగనామాలు తక్షణమే పైల్స్‌ను స్వాధీనం చేసుకోవాలి సీఐడీతో విచారణ జరిపించాలి బీజేపీ నాయకుడు నవీన్‌కుమార్ రెడ్డి తిరుపతి: టీటీడీ ఇంజనీరింగ్ టెండర్లలో భారీ కుంభకోణం బీజేపీ నాయకుడు నవీన్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. సీఐడీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్‌ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించాలని, లేనిపక్షంలో కంప్యూటర్ల నుంచి తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. టీటీడీలో ‘‘రివర్స్ టెండరింగ్’’ పేరుతో […]
Read Moreరామోజీ అంతిమయాత్రలో నారా లోకేష్
అమరావతి: రామోజీరావు అంతిమయాత్రలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామోజీరావు నాకు మార్గదర్శకులు. రైతు కుటుంబం నుంచి అధికార పార్టీలను ప్రశ్నించే స్థాయికి వచ్చిన రామోజీరావుది ఓ చరిత్ర. నా లాంటి యువతకు ఆయన స్ఫూర్తి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల గొంతు వినిపించే తత్వం ఆయనది. ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా సహించేవారు […]
Read Moreగుంటూరు శ్రీమంతుడిని వరించిన అదృష్టం
పెమ్మసానికి కేంద్ర మంత్రివర్గంలో చోటు రాజకీయ ప్రవేశంతోనే సంచలనం గుంటూరు: రాజకీయ ప్రవేశంతో సంచలన విజయం సాధించిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి వర్గంలోకి చోటు సంపాదించుకుని చరిత్ర సృష్టించా రు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో నాడు కేంద్ర మంత్రిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉండేవారు. అయితే యాదృచ్చికంగా ఆయన అల్లుడు కిలారి రోశయ్యపైనే పెమ్మసాని విజయకేతనం ఎగురవేశారు. అనూహ్యంగా కేంద్రంలో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. భారతదేశంలో ధనవంతుడైన […]
Read Moreరామోజీ పాడె మోసిన చంద్రబాబు
హైదరాబాద్: రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం జరిగిన అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు అంతిమయాత్ర కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్ర బాబు పాల్గొన్నారు. రామోజీరావు పాడె మోశారు. అంత్యక్రియల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర రామోజీరావు మృతికి సంతాపం […]
Read More