సుధా రెడ్డికి చెవిరెడ్డి సమాధానం చెప్పాలి!

– టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి డిమాండ్ చంద్రగిరి, మహానాడు: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దమ్ముంటే ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధా రెడ్డికి సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సవాలు చేశారు. నాని కుటుంబంపై అసత్య ప్రచారాలు చేయడం మాని ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు […]

Read More

గుంటూరు ప్రజలకు పెమ్మసాని దసరా కానుక

– శంకర్ విలాస్ వంతెన 4 లైన్ల గా విస్తరణ – ఆర్ వో బీ నిర్మాణానికి రూ. 98 కోట్లు మంజూరు – పెమ్మసాని తొలి ప్రతిపాదనకు నితిన్ గట్కరి ఆమోదముద్ర – ఎక్స్ వేదికగా ప్రకటించిన కేంద్ర మంత్రి గుంటూరు, మహానాడు: దశాబ్దాల గుంటూరు కలలకు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఊపిరిలూదారు. ప్రజలకు ఏం కావాలో ఎరిగిన […]

Read More

మహిళలు, చిన్నారుల భధ్రతకు అత్యధిక ప్రాధాన్యం

•అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిపై తక్షణమే కఠిన చర్యలు •శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను 48 గంటలలో పట్టుకుని రిమాండ్ కు పంపాం •శ్రీ సత్యసాయి & బాపట్ల జిల్లాల్లో మహిళలపై జరిగిన అత్యాచార కేసులు ప్రత్యేక కోర్టు ద్వారా విచారణకు హైకోర్టుకు లేఖ రాష్ట్ర హోమ్ & విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అమరావతి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల […]

Read More

‘మద్యం’ టెండర్లలో పారదర్శకత ఏది?

– ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ, మహానాడు: ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన చంద్రబాబు మద్యం సిండికేట్లను అరికట్టడంలో రాజకీయ చోద్యం చూస్తున్నారని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే.. ఎక్కడికక్కడే అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై. సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను దక్కించుకున్నారని తెలిసింది. కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా మెజారిటీ షాపులు […]

Read More

పల్లె ప్రగతికి బాటలు వేస్తాం

– ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట, మహానాడు: పల్లెల అభివృద్ధికి అభివృద్ధి బాటలు వేస్తామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన “పల్లె పండుగ” వారోత్సవాల్లో భాగంగా సోమవారం నరసరావుపేట మండలం రావిపాడు, లింగంగుంట్ల, అల్లూరివారిపాలెం, ఇక్కుర్రు గ్రామాల్లో జడివానలోనే తడుస్తూ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా […]

Read More

అభివృద్ధి బాటలో పల్లెలు

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: ఎన్డీయే సర్కారు పాలనలో పల్లెలు అభివృద్ధి బాట పడుతున్నాయని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.  పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం, కట్టావారిపాలెం గ్రామంలో రూ.15 లక్షలు, కంటెపూడి గ్రామంలో రూ.20 లక్షలు, భీమవరం గ్రామంలో రూ.8 లక్షల రూపాయలతో నిర్మించనున్న కాలువలు, రోడ్ల పనులకు సోమవారం శంకుస్థాపన చేసి, మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి […]

Read More

స్వచ్ఛ చల్లపల్లికి హీరో రవితేజ ప్రశంసలు

చల్లపల్లి: కృష్ణా జిల్లా చల్లపల్లిలో పదేళ్లుగా జరుగుతున్న స్వచ్ఛ కార్యక్రమాలను ప్రముఖ సినిమా హీరో రవితేజ అభినందించారు.సోమవారం ఆయన స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలను అభినందిస్తూ వీడియో సందేశాన్ని పంపించారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్లు డాక్టర్ డీ.ఆర్.కే. ప్రసాద్-డాక్టర్ టీ. పద్మావతి ఆధ్వర్యంలో దేశం, రాష్ట్రం గర్వించే విధంగా స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలు నిర్వహించడం మంచి విషయం అని అన్నారు.  

Read More

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు

– అందుబాటులోకి 108 కొత్త ఇసుక రీచ్‌లు – నదుల్లో ఉద్ధృతి దృష్ట్యా తొలివిడత వినియోగంలోకి 40 ఇసుక రీచ్‌లు – నదీ తీర ప్రాంతాల్లో కొత్త ఇసుక రీచ్‌ల గుర్తింపు -మంత్రి కొల్లు రవీంద్ర గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రస్తుతం ఇసుక లభ్యత సంక్లిష్టమైందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఇసుకపై జగన్‌ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక అందుబాటు […]

Read More

అనకాపల్లిలో అభివృద్దిని పరుగులు పెట్టిస్తాం

– మోడల్ నియోజకవర్గంగా అనకాపల్లి – ఎంపి సీఎం రమేష్ హామీ – కశింకోట గ్రామం లో 2.24 కోట్ల రూపాయలు సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేసిన అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీ.ఎం రమేష్ అనకాపల్లి: కశింకోట గ్రామం లో అగ్రహారం వీధి నందు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ రెండు కోట్ల 24 లక్షల రూపాయలు సీసీ రోడ్లు […]

Read More

తుపాను… ప్రభుత్వం అప్రమత్తం!

– హోం మంత్రి అనిత వెల్లడి విశాఖపట్నం, మహానాడు: బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడామని, ఎలాంటి ప్రమాదం జరగకముందే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించుతున్నామని చెప్పారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే.. తుపాను వల్ల ఏ ప్రాంతాలు ప్రమాదానికి గురవుతాయో ముందుగా గుర్తించాం.. అక్కడికి బృందాలను పంపిస్తున్నాం. తుపాను షెల్టర్‌లు […]

Read More