విజయవాడ, మహానాడు: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంపు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి శనివారం ఉదయం పర్యటించారు. 4వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ, భారతీనగర్, సి.టి.ఓ కాలనీ, వెంకటేశ్వరనగర్, అంబేద్కర్ నగర్, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, గుణదల హరిజన వాడలతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడున్న పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. […]
Read Moreఅధికార గణం 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి
– టెలి కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం హైదరాబాద్, మహానాడు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష జరిపారు. సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ… సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, […]
Read Moreనిత్యం ప్రజా పక్షంగానే ఉన్న ప్రజానేత.. చంద్రబాబు!
– మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతి, మహానాడు: ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేసి, 30వ ఏడాదిలోకి ప్రవేశించిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడుకి హార్ధిక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ ప్రజా పక్షంగానే వ్యవహరించిన ప్రజా […]
Read Moreరేపటి ‘ప్రజా వేదిక’ రద్దు
మంగళగిరి, మహానాడు: మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో నేడు జరగాల్సిన ‘ప్రజా వేదిక’ కార్యక్రమం రద్దయింది. భారీ వర్షాలు, వరదలు ఉండడంతో పాటు వరద సహాయక చర్యల్లో అధికారులందరూ నిమగ్నమైయున్నారు. ఈ దృష్ట్యా మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ‘ప్రజా వేదిక’ కార్యక్రమం రద్దు అయింది. ఎటువంటి గ్రీవెన్స్ ఉండదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించాలని టీడీపీ శాసనమండలి సభ్యులు, కేంద్ర కార్యాలయం కార్యదర్శి […]
Read Moreసముద్రంలో చిన్నగంజాం మత్స్యకారుల గల్లంతు!
విశాఖపట్నం, మహానాడు: సముద్రంలో వేటకు వెళ్ళిన చిన్నగంజాం మత్స్యకారులు తప్పిపోయారు. చెన్నై నుండి విశాఖపట్నంకు చేపల వేటకు బోట్లో మత్స్యకారులు వెళ్ళారు. విశాఖపట్నం సముద్ర తీరంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే ఏలూరి వారిని రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. హోంమంత్రి అనిత, రెవెన్యూ అనగాని, కలెక్టర్ వెంకట మురళీ దృష్టికి సమస్య తీసుకువెళ్ళారు. అధికార యంత్రాంగం అప్రమత్తమై కాపాడేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ఎమ్మెల్యే ఏలూరి సెంట్రల్ కమాండ్ ను అప్రమత్తం […]
Read Moreపడవలో సురక్షిత ప్రాంతానికి తరలింపు
కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో లంక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. రాజధాని గ్రామం ఉద్దండరాయుని పాలెం లంక లో నివసిస్తున్న గృహస్థల వద్ద పడవలో వెళ్ళిన అధికారులు, సిబ్బంది.. అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు తహశీల్దార్ జి.సుజాత, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
Read Moreపార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, ఎంపీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్
– వరద బాధితులకు సాయం అందించాలని పార్టీ శ్రేణులకు బాబు పిలుపు అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ముఖ్యనేతలు, మంత్రులు, ఎంపీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు సాయం అందించాలని పార్టీ శ్రేణులకు బాబు పిలుపునిచ్చారు. ఇంకా.. సీఎం ఏమన్నారంటే.. తుపాను ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. ఊహించని విధంగా వరదలు సంభవించాయి. ముందస్తు […]
Read Moreగుడ్లవల్లేరు కాలేజిలో హిడెన్ కెమెరాలు బ్లూమీడియా సృష్టే!
– కుంభకోణాల నుంచి పక్కదారి పట్టించేందుకే లేనిపోని ఆరోపణలు – రాష్ట్రంలోని విద్యార్థులంతా నా బిడ్డల్లాంటివారే… వారి బాధ్యత నాదే – జగన్ మాదిరి తల్లీ, చెల్లిని రోడ్లపైకి గెంటేసే రకం నేను కాదు – మంగళగిరి నియోజకవర్గ పర్యటనలో మంత్రి నారా లోకేష్ మంగళగిరి, మహానాడు: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూమ్ లలో హిడెన్ కెమెరాలు బ్లూమీడియా సృష్టి మాత్రమేనని, అక్కడ కెమెరాలు ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదని […]
Read Moreహైదరాబాద్ లో కొట్టుకుపోతున్న కూరగాయలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు దంచికొడుతు న్నాయి. వాన ధాటికి ప్రజా జీవనం అస్తవ్యస్తమవు తుంది. అయితే హైదరాబాద్‌లోని ఓ రైతు బజార్లో ఈరోజు ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు కూరగాయల దుకాణాల్లోని ఆకుకూరలు కూరగాయలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇది చూసిన అక్కడి స్థానికులు వాటిని ఏరుకుని సంచిలో వేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Read Moreఇంటి నుంచి బయటకు రావద్దు
– చిరంజీవి విజ్ఞప్తి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండడంతో ప్రజలకు ‘ఎక్స్’లో మెగాస్టార్ చిరంజీవి కీలక విజ్ఞప్తి చేశారు. “మీ కుటుంబసభ్యుడిగా నా మనవి ఒక్కటే… అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలి. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అండగా ఉంటారని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
Read More