శ్రీ స్వామివారి లడ్డూ ప్రసాదం లో ఆవు నెయ్యి పేరిట ఏదో ఆయిలు కలిపేసి సొమ్ము చేసుకున్న ఘటన బయటపడి ; ఇప్పుడు దర్యాఫ్తు కోసమని ఒక పోలీసు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది . అయితే , “పోలీసు దర్యాప్తు ” అంటే ఎలా ఉంటుందో….అనుభవ పూర్వకంగా తెలిసిన వైసీపీ నేతలు , అది వద్దు ….అది వద్దు ….అంటూ సుప్రీం కోర్టుకు పరిగెత్తారు . న్యాయ స్థానాల […]
Read Moreప్రపంచంలో తొలి కృత్రిమ ఉపగ్రహం ‘స్పుత్నిక్-1’
ఇదే రోజు (అక్టోబర్ 4) మొట్టమొదటి సారిగా తొలి కృత్రిమ ఉపగ్రహం ప్రయోగం ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1 ను సోవియట్ యూనియన్ 1957లో సరిగ్గా ఇదే రోజున ప్రయోగించింది. భూమిచుట్టూ పరిభ్రమించిన ఈ శాటిలైట్ ప్రతి గంటకు 29,000కి.మీ ప్రయాణించి, రేడియో సిగ్నల్స్ ను ప్రసారం చేసింది. 22రోజులు నిరంతరాయంగా పని చేసిన తర్వాత అక్టోబర్ 26న బ్యాటరీ అయిపోవడంతో స్పుత్నిక్-1 నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి.1958 జనవరి […]
Read Moreజిల్లాలో రైల్వేల అభివృద్ధికి పెద్దపీట వేయండి
– విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌లో జిల్లా సమస్యలను వివరించిన ఎంపీ – జిల్లాలో రైల్వేల అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలే ధ్యేయంగా మీటింగ్‌లో ప్రస్తావించిన ఎంపీ వేమిరెడ్డి – మౌలిక సదుపాయాల కల్పనతో ప్రయాణికులకు మేలు జరుగుతుంది – బిట్రగుంటలో ఉన్న రైల్వే భూములను సద్వినియోగం చేసుకోవాలి – నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ పనులను వేగవంతం చేయాలి – జీఎం ముందుకు ఆర్‌యూబీ […]
Read Moreసుప్రీంకోర్టు ఆదేశాలతో ‘కల్తీ నెయ్యి కథ’ తేలుతుంది…
– బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజయవాడ, మహానాడు: తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో నాణ్యత ఉందా లేక అపవిత్రమైన పదార్థాలను వినియోగించారా అన్నదానిపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో “నెయ్యి దొంగల” గుట్టు రట్టు అవుతుందన్నారు. తిరుమల శ్రీవారి నైవేద్యానికి భక్తులకు వితరణ చేసే […]
Read Moreపెన్షన్ ఇచ్చి ఆదుకోండి
– కిడ్నీ రోగుల శాంతియుత నిరసన హైదరాబాద్, మహానాడు: ప్రభుత్వం 10 వేలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ కిడ్నీ రోగులు శాంతియుతంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కిడ్నీ పేషేంట్స్ ను పట్టించుకోవడం లేదని, జనవరి లో కిడ్నీ పేషేంట్స్ ఆదుకోవాలని ప్రజా భవన్ లో కలిసి విజ్ఞప్తి చేసిన ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ ఇచ్చి మాకు […]
Read More11నే మద్యం షాపుల కేటాయింపు
– ఎక్సైజ్ శాఖ వెల్లడి అమరావతి, మహానాడు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి లాబీయింగ్ కు తావు లేకుండా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 11న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, అలాగే 12వ తేదీ విజయదశమి నుంచి మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బార్ల లైసెన్స్ […]
Read Moreఐదుగురి సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయండి
– సుప్రీంకోర్టు సూచన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. సిట్లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు ఉండాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది. లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించినదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించింది. సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు […]
Read Moreచిత్ర సీమకు పెద్ద దిక్కు లేదు!
– బహుజన బాలకోటయ్య వ్యాఖ్య హైదరాబాద్, మహానాడు: తెలుగు చిత్ర సీమకు పెద్ద దిక్కు లేదని, అందువల్లనే చిత్ర పరిశ్రమలోని నటులను రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని, వారి వ్యక్తిగత జీవితాలను రోడ్డున పడేస్తున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వర్సెస్ నాగార్జున ఎపిసోడ్ నేపథ్యంలో నాలుగు గోడల మధ్య జరిగే […]
Read Moreవ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా ఏఈ ఇబ్బందిపెడుతున్నారు
– డీఎస్సీ, కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణకు స్టడీ సెంటర్ ఏర్పాటుచేయండి – డబుల్ రిజిస్ట్రేషన్ తో స్థలం కబ్జా – 40వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ లో ప్రజల విన్నపాలు – సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ అమరావతి, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, వారికి అన్ని విధాల అండగా నిలుస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ […]
Read Moreరాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది
– కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంపై హరీశ్ రావు ఆగ్రహం హైదరాబాద్, మహానాడు: రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు భద్రత కరువైంది. భద్రత కల్పించవలసిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఇద్దరు బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని […]
Read More