ప్రజల మధ్యకు గళ్ళా మాధవి 

గుంటూరు, మహానాడు :  గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి  తన నియోజక వర్గంలోని ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు డివిజన్ పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 6.00 గంటలకే 18వ డివిజన్ లోని రామనామ క్షేత్రం, శ్రీనివాసరావు పేట,వెంగళ్ శెట్టి వారి వీధి, అడపా బజార్, మొహిద్దీన్ పాలెం, వడ్డే గూడెం వంటి ప్రాంతాలలో పర్యటించారు. ఆమె స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ, డివిజన్ లోని ప్రధాన వీధులతో పాటు, సందులలో […]

Read More

డీకే శివకుమార్ తో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల భేటీ

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు. బెంగళూరులోని ఆయన నివాసానికి చేరుకున్న షర్మిల ఈ నెల 8న తన తండ్రి, ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. షర్మిల ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి […]

Read More

సమస్యల పరిష్కారానికి యువనేత భరోసా

“ప్రజాదర్బార్”కు భారీగా తరలివస్తున్న ప్రజలు అమరావతి: కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు “ప్రజాదర్బార్” కు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు. నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను […]

Read More

అది పీఠం కాదు.. భూముల శఠగోపం

-స్వరూపా భూకేటాయింపు రద్దు చేయాల్సిందే -స్వరూపానందకు ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాలి -శారదాపీఠం ఆస్తులపై సీబీఐ,ఈడీ లతో విచారణ జరపాలి -శారదాపీఠాన్ని రద్దు చేయాలి -ఏపీ సాధుపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి -శ్రీనివాసానంద,జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ – భీమునికొండ భూములు పరిశీలించిన శ్రీనివాసానంద స్వామి బృందం విశాఖపట్నం: శారదాపీఠం పేరిట నకిలీ పీఠం పెట్టి వేల కోట్లు దోపిడీ చేసి గత వైసీపీ ప్రభుత్వం […]

Read More

తాళ్లూరు లిఫ్ట్ మరమ్మతులు పూర్తిస్థాయిలో చేయండి

జగ్గంపేట నియోజకవర్గం, నీటిపారుదల, రోడ్లు, ఏలేరు ఆధునీకరణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ, జగ్గంపేట జులై 2: కాకినాడ కలెక్టరేట్ లో కాకినాడ జిల్లా శాసనసభ్యులు ఉన్నతస్థాయి అధికారులతో జిల్లాలో సమస్యలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నియోజవర్గంలో ఇరిగేషన్ సమస్యల పైన, ముఖ్యంగా తాళ్లూరు లిఫ్ట్ మరమ్మతులు పూర్తిస్థాయిలో చేసి […]

Read More

పోలంపల్లి మునేరు డ్యామ్ కు నిధులు మంజూరు చేయండి

– ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని కలిసిన శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , మాజీ ఎమ్మెల్సీ టి.డి జనార్దన్ వెంటనే స్పందించి ఎన్టీఆర్ జిల కలెక్టర్‌కు ఫోన్ అమరావతి : జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, పోలంపల్లి గ్రామ పరిధిలో సాగునీరు సరఫరా నిమిత్తం మునేరు పై సుమారు 100 సంవత్సరాలు క్రితం నిర్వహించబడిన పోలంపల్లి డ్యాం మరమ్మత్తుల నిమిత్తం నిధులు మంజూరు కొరకు ఈరోజు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం […]

Read More

పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు

-రైతులు, ప్రజలు అపార్థం చేసుకోవద్దు -బకాయిలిస్తేనే పనులు చేస్తామంటున్నారు -జగన్ ఖజానాను ఆరకంగా ఖాళీ చేశాడు -ఉభయగోదావరి జిల్లాలోనే ధాన్యానికి 9050 కోట్ల రూపాయల బకాయి -లోకేష్ సమయం ఇచ్చినప్పుడు పాఠశాలల గురించి వివరిస్తా -పోలవరం, అమరావతి పూర్తి చేయగలిగితే రాష్ట్రం ఊహించిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి -తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ కావాలని చంద్రబాబు నిర్ణయించడం అభినందనీయం -తెలంగాణ నుంచి రావలసిన బకాయి నిధులు వస్తే ఎంతో ఉపయోగకరం -రాష్ట్రానికి […]

Read More

ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడండి

– ప్రజలకు ఇబ్బంది లేని విధంగా నూతన ఇసుక పాలసీ -నిత్యావసర ధరల భారం తగ్గించాలి -జనం ఇబ్బందులు తొలగించే విషయంలో తక్షణ చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి -నూతన ఇసుక విధానం, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు త్వరలో ప్రత్యేక ప్రణాళిక -రోడ్ల మరమ్మతుల ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాలి -పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలి..అధికారులు వేగంగా పని చేయాలి -సమీక్షలో సీఎం నారా చంద్రబాబు నాయుడు – […]

Read More

అరుదైన సేల్స్ రికార్డ్

– అమ్మకాల్లో దేశీయ దిగ్గజం హవా మహీంద్రా స్కార్పియో, స్కార్పియో ఎన్ రెండూ అమ్మకాలలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేశాయి.2003 నుంచి 2024 వరకు ఈ రెండు కార్లు ఏకంగా 10,42,403 యూనిట్ల అమ్మకాలను కైవసం చేసుకున్నాయి. అత్యధికంగా FY2024లో నమోదయ్యాయి. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ 1,41,462 యూనిట్ల స్కార్పియో కార్లను విక్రయించింది.

Read More

జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి

– ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు న్యూ ఢిల్లీ: ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు టోల్ ఫీజు మినహాయింపు అమలు జరిగితే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్ధతతో పనిచేసేందుకు […]

Read More