హత్రాస్ ఘటనలో 120 మంది దుర్మరణం ఉత్తరప్రదేశ్, మహానాడు : ఉత్తర ప్రదేశ్ హత్రాస్ జిల్లా లోని రతిభాన్పూర్‌లో నిర్వహించిన శివారాధనలో తొక్కిసలాట జరిగి ఇప్పటి వరకూ 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 28 మందికి పైగా గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం హత్రాస్ కు చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న […]
Read Moreస్కూటీపై ఎమ్మెల్యే సిటీ టూర్
గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి తన నియోజక వర్గంలోని ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు డివిజన్ పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 6.00 గంటలకే 18వ డివిజన్ లోని రామనామ క్షేత్రం, శ్రీనివాసరావు పేట,వెంగళ్ శెట్టి వారి వీధి, అడపా బజార్, మొహిద్దీన్ పాలెం, వడ్డే గూడెం వంటి ప్రాంతాలలో పర్యటించారు. ఆమె స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ, డివిజన్ లోని […]
Read Moreజగన్ ఎస్టేట్ గా తిరుమల
* బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి విజయవాడ, మహానాడు : జగన్ ఎస్టేట్ గా తిరుమలను మార్చారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. విజయవాడలోని బీజేపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తిరుమల జగన్ ఎస్టేట్ గా మారిందని, ఎస్టేట్ మేనేజర్ గా ధర్మారెడ్డి వ్యవహరించారని ఆరోపించారు. […]
Read Moreబాబుకు ఇప్పట్లో ప్రత్యామ్నాయం లేదు… కానీ!
“వైసీపీ కి వై నాట్ 175?” అంటూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పదవి లో ఉన్న వై. ఎస్. జగన్మోహనరెడ్డి పాడిన పాట – జనం దృష్టిని విశేషం గా ఆకర్షించింది. “అవును. టీడీపీ కూటమి కి వై నాట్ 175?” అని ఓటర్లు అనుకున్నారు. 164 ఇచ్చారు. పులివెందుల మినహా మిగిలిన 10 కూడా ఇద్దామని అనుకున్నారు. చంద్రబాబే వారి మనసులోని ఉద్దేశాన్నిసరిగ్గా కనిపెట్టలేక పోయారు. దాంతో, ఓ […]
Read Moreతెలంగాణను నాశనం చేసింది మీరే!
కేటీఆర్ నీతి వాక్యాలు అప్పుడేమయ్యాయి? తెలంగాణ హుందాతనాన్ని నాశనం చేశారు కేటీఆర్ మాటలు చిత్రంగా ఉన్నాయంటూ ఎద్దేవా తెలుగుదేశం జెండా పండుగ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ధ్వజం ఫరూక్ నగర్: స్వార్థ రాజకీయాల లబ్ధికోసం తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేసి నేడు నీతి వాక్యాలు వల్లిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ను చూస్తే చిత్రంగా ఉందని టిడిపి పొలిట్ బ్యూరో […]
Read Moreన్యాయపరమైన వివాదాలు లేకుండా మెగా డిఎస్సీ
పాఠశాలల్లో అకడమిక్ కేలండర్ రూపకల్పనకు ఆదేశం టెట్, మెగా డీఎస్సీపై సమీక్షలో విద్య, ఐటి మంత్రి లోకేష్ అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా డిఎస్సీని ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ మంగళవారం సమీక్ష […]
Read Moreపకడ్బందీగా స్కిల్ సెన్సెస్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
యువత ఉపాధి కల్పనకు పెద్దపీట స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష అమరావతి : రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం స్కిల్ […]
Read Moreనాదెండ్ల భాస్కర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు
జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తెనాలి, మహానాడు : జనసేన పార్టీ నాయకులు, తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ తండ్రి, ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాథ్, ముమ్మలనేని సతీష్ బాబు, […]
Read Moreప్రధాని మోదీ తో జనసేన ఎంపీల సమావేశం
– రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులకు సహకరించాలని వినతి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ని జనసేన పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో సోమవారం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలు ఆంధ్రప్రదేశ్ కు ఉండాలని, రాష్ట్ర అభివృద్ధిని ముందుండి నడిపించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు, రాష్ట్ర విభజన అంశాలు, కేంద్ర నుంచి రావాల్సిన గ్రాంట్లు అంశాలను నరేంద్ర మోదీ […]
Read Moreదటీజ్ పవన్ కల్యాణ్
– పవన్ చెప్పారు.. పోలీసులు పాటించారు! – తొమ్మిది నెలల క్రితం యువతి మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు * ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కదిలిన యంత్రాంగం * భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె అదృశ్యంపై పవన్ కళ్యాణ్ కి ఫిర్యాదు చేసిన వెంటనే ప్రత్యేక దృష్టి విజయవాడ: మనసు ఉంటే మార్గం ఉంటుందంటారు… చేయాలన్న తపన ఉంటే చేవ కలిగిన వారికి కొదవ లేదంటారు […]
Read More