టీడీపీతో పోలీసులు, ఎన్నికల కమిషన్‌ కుమ్మక్కు

రూరల్‌ సీఐ డబ్బు తీసుకుని వారికి పనిచేశాడు దమ్మాలపాడులో రీ పోలింగ్‌ జరిపించాల్సిందే సత్తెనపల్లిలో భారీ మెజార్టీతో గెలవబోతున్నా వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు సత్తెనపల్లి, మహానాడు : పల్నాడు ప్రాంతంలో టీడీపీతో ఎన్నికల కమిషన్‌, పోలీసులు కుమ్మక్కయ్యారని సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పోలింగ్‌ జరిగింది. సంక్షేమ పాలన […]

Read More

కారంపూడిలో టీడీపీ కార్యాలయం ధ్వంసం

కారంపూడి, మహానాడు : పోలింగ్‌ నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి పట్టణం, కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామాల్లో తెలుగుదేశం, వైసీపీ శ్రేణులు పరస్పర దాడులకు దిగాయి. దీంతో మండలంలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. వాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

Read More

కార్యకర్తల తెగువ అభినందనీయం

అండగా నిలిచిన ఓటర్లకు కృతజ్ఞతలు దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : వైసీపీ దాడులకు ఎదురొడ్డి నిలబడి పార్టీ శ్రేణులు, ఓటర్లు ఓటేసి అండగా నిలవడం మరిచిపోలేనని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కొనియాడారు. మంగళవారం కూట మి నాయకులు, కార్యకర్తలు ఆమెను కలిసి అభినందించారు. అనంతరం లక్ష్మి మాట్లాడు తూ కూటమి కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో […]

Read More

కవితకు మరోసారి బిగ్‌ షాక్‌

కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు ఢిల్లీ: లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం ఈడీ అధికారులు వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. ఎనిమిది వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. దాంతో కోర్టు జ్యుడీషి యల్‌ కస్టడీని మరోసారి ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పు చెప్పింది. ఇప్పటికే సీబీఐ కేసులో ఆమెకు కోర్టు ఈ నెల […]

Read More

కాంగ్రెస్‌కు 12 నుంచి 14 స్థానాలు

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క భూపాలపల్లి, మహానాడు : భూపాలపల్లి జిల్లా మంథని మండలంలో మంత్రి దుద్దిళ్ల స్వగ్రామమైన ధన్వాడలో వివిధ దేవాలయాల వార్షికోత్సవాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్‌ గెలుచుకోబోతోందని తెలిపారు. సమావే శంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మంచిర్యాల […]

Read More

రాష్ట్రానికి మోదీ గ్యారంటీతో ప్రజల్లో చైతన్యం

` పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులే ధ్యేయం – బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర గుంటూరు, మహానాడు : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ గ్యారంటీ అని ప్రజలు విశ్వసించినందు వల్లే ఓటింగ్‌కు పెద్దఎత్తున తరలివచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్‌ అన్నారు. గుంటూరులో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు అవుతారని అన్నారు. […]

Read More

కెనడాలో పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు

ఒక్క చోట చేరి సంబూరాలు చేసుకున్న తెలంగాణ ప్రవాసులు. అభినందనల సందేశం పంపిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు కెనడా ప్రముఖ నగరం టోరంటోలో తెలంగాణ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ యేడాది జూన్ తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లు నిండుతున్న సందర్భంగా కెనడాలో స్థిరపడిన ప్రవాసులు తెలంగాణ నైట్ పేరుతో ఉత్సవాలను నిర్వహించారు. టోరంటో, మిసిసాగ ఈ వేడుకలకు వేదిక అయింది. తెలంగాణ డెవలప్ మెంట్ […]

Read More

పల్నాడులో హింసను ఖండించిన టీడీపీ అభ్యర్థులు

కలెక్టర్‌, ఎస్పీ ఉన్నా దాడులు ఆగలేదు ముందుగానే రాళ్ల కుప్పలు, కర్రలు తెచ్చారు అటువంటి చోట రీ పోలింగ్‌ నిర్వహించాలి మాచర్లలో పిన్నెల్లి తమ్ముడి అరాచకాలు నరసరావుపేటలో అభ్యర్థులపై దాడి హేయం పోలింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు కుట్ర పన్నారు నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లాలో వైసీపీ శ్రేణుల దాడులు, అరాచకాలపై పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థులు ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలోనే ఎక్కువగా హింసాత్మక ఘటనలు జరిగాయని, పోలీసులు, అధికారులు ప్రేక్షకపాత్ర […]

Read More

అందుకే.. మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్!

బట్టల షాప్ ప్రారంభానికి సినీనటి…జనాలను అదుపు చేయలేకపోయిన పోలీసులు…ట్రాఫిక్ జామ్. విదేశీ ఐకియా / లులు షాప్స్ ప్రారంభం…జనాలను అదుపు చేయలేక పోయిన సెక్యూరిటీ సిబ్బంది… తొక్కిసలాట. సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ఎక్కడ చూసినా జన సంద్రమే! కోటి దీపాల ఆరాధన కార్యక్రమం…. లక్ష మందికి పైగా వారం రోజులు సమయం కేటాయించి తప్పకుండా హాజరు. పెద్దాయనకు ఉత్సవాలు….లక్షలాది మంది వారం పది రోజులు క్రమం తప్పకుండా హాజరు, […]

Read More

జూన్‌ 4 తర్వాత యరపతినేని మార్క్‌ రాజకీయం

కాసు మహేష్‌రెడ్డికి బుద్ధి చెప్పడం తథ్యం పెట్రోల్‌ బాంబులు, నాటు బాంబులతో తెగబడ్డారు గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు తంగెడలో బాధిత కుటుంబాలకు పరామర్శ, ఆర్థికసాయం గురజాల, మహానాడు : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో పోలింగ్‌ సందర్భంగా సోమవారం జరిగిన విధ్వంసకరమైన ఘటనకు సంబంధించి గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు మంగళవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ […]

Read More