దర్శిలో త్వరలో అన్న క్యాంటీన్

– వైసీపీ పాలనలో అన్నీ విధ్వంసాలే.. – సంక్షేమం, అభివృద్ధి కూటమితోనే సాధ్యం – టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పూరిమెట్ల, మహానాడు: ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని, తిరిగి రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించేందుకు సమిష్టి కృషి అవసరమని, ఇది ఎన్డీయే పాలనలోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా ముండ్లమూరు […]

Read More

స్వర్ణాంధ్ర @ 2047 విజన్ లక్ష్యాలతో 20 సూత్రాలు అమలు

– చైర్మన్ గా లంకా దినకర్ బాధ్యతల స్వీకరణ అమరావతి, మహానాడు: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047 అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయనున్నట్టు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత లంకా దినకర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమం […]

Read More

‘సోషల్’ సమరానికి వైసీపీ సిద్ధం!

(వాసు) వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. ప‌క్కా వ్యూహంతోనే అడుగులు ముందుకు వేస్తున్నారు. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు సోస‌ల్ మీడియా విష‌యంలోనూ ఆయ‌న చాలాదూకుడుగా ఉండాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టి వ‌రకు ఎన్నిక‌లు అయిపోయి.. నాలుగు మాసాలు గ‌డిచాయి. ఈ కాలంలో పార్టీ నేత‌లు ఎలా ఉన్నా.. ఇప్ప‌టి నుంచి మాత్రం ప‌క్కాగా ఉండాల‌ని జ‌గ‌న్ సూచించారు. జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే.. ఎప్పుడైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌న్నారు. అయితే.. మ‌రీ […]

Read More

ఎలిమెంటరీ స్కూలును సందర్శించిన మంత్రి లోకేష్

– నెహ్రూబజార్ ప్రాంతీయ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ విశాఖపట్నం, మహానాడు: విశాఖపట్నం నెహ్రూ బజార్ మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలను రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ బాలల గదిని సందర్శించిన లోకేష్… కొద్దిసేపు వారితో సరదాగా గడిపారు. ఏబీసీడీలు, రైమ్స్ వచ్చా అని అడగ్గా… వారు ఆడుతూ పాడుతూ సమాధానాలు ఇచ్చారు. గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై టీచర్లను […]

Read More

విశాఖలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్

– 45వ రోజు ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించి, అర్జీల స్వీకరణ విశాఖపట్నం, మహానాడు: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన రెండో రోజు విశాఖ పర్యటనలో భాగంగా ముందుగా శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జిల్లా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. 45వ రోజు ప్రజాదర్బార్ కు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై స్వయంగా మంత్రిని కలిసి విన్నవించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా […]

Read More

లోకాయుక్తగా జస్టిస్ ఆకుల శేషసాయి?

– సీఎం చంద్రబాబు ఆమోదముద్ర – గవర్నర్ వద్దకు ఫైలు – ప్రస్తుతానికి కర్నూలులోనే లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాలు – హైకోర్టులో ే సు తర్వాత అమరావతికి తరలింపు? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ లోకాయుక్తగా జస్టిస్ ఆకుల శేషసాయి నియమానికి రంగం సిద్ధమయింది. ఆ మేరకు ఆయన పేరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిఫారసు చేసి, ఫైలును గవర్నర్ ఆమోదముద్ర కోసం రాజ్‌భవన్‌కు పంపినట్లు తెలుస్తోంది. గతంలో జస్టిస్ శేషసాయి […]

Read More

రెడ్ బుక్ పేరు చెబితే జగన్ కు భయమెందుకు?

– క్యాలండర్ ప్రకారమే సూపర్ – 6 పథకాల అమలు – జగన్ లా కల్లబొల్లి కబుర్లు చెప్పం, చెప్పింది చేస్తాం – అసత్యవార్తలు రాస్తే చట్టప్రకారం చర్యలు – ఎంఆర్ పి ధరలకే మద్యం విక్రయించేలా పకడ్బందీ చర్యలు – విశాఖపట్నంలో రీజనల్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు – విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం, మహానాడు: రెడ్‌ బుక్కు చూస్తే జగన్ ఎందుకు భయపడుతున్నారు? […]

Read More

స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు : లోకేశ్

అమరావతి, మహానాడు: సమస్యల వలయాలుగా మారిన స్కూళ్ల నిర్వహణ కోసం రూ.100 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024-25 సంవత్సరానికి 855 పీఎంశ్రీ స్కూళ్లకు రూ. 8.63 కోట్లు, కేజీబీవీలకు రూ.35.16 కోట్లు, మండల రిసోర్స్ కేంద్రాలకు రూ.8.82 కోట్లు, మిగతా స్కూళ్లకు రూ. 51.90 కోట్లు మంజూరు చేశారు. సుద్దముక్కలు, డస్టర్స్, చార్టులు, విద్యా సామగ్రి, రిజిస్టర్లు, రికార్డులు, క్రీడా సామాగ్రి, ఇంటర్నెట్, మంచినీటి కోసం […]

Read More

మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత!

హైదరాబాద్, మహానాడు: మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి చిరుత కదలికలు కనిపించాయి. ఈ మేరకు పలువురు యువకులు దానిని వీడియో తీశారు. అనంతరం మెట్రో అధికారులు, పోలీసులకు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన పోలీసులు మియాపూర్ పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎవరికైనా అది కంటపడితే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. […]

Read More

పూజారిలే విధ్వంసకారులు!

– గుడి ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు రాయచోటి: అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువులో 14న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. గుడి పూజారి విద్యాసాగర్, మరొక గుడి పూజారి హరినాథ్ ఇరువురు మధ్య జరిగిన ఆధిపత్యం పోరులో ఆంజనేయ స్వామి గుడిని ధ్వంసం చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి కారు, పేలుడు […]

Read More