ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి తనయుడు రాజారెడ్డి వివాహ రిసెప్షన్‌కు అన్నయ్య కమ్ మేనమామ, ఏపీ సీఎం జగన్ డుమ్మా కొట్టారు. రాజస్థాన్‌లో జరిగిన మేనల్లుడి పెళ్లికి గైర్హాజరైన జగన్ అన్న, హైదరాబాద్‌లోనే జరిగిన పెళ్లి రిసెప్షన్‌కయినా వస్తారని వైఎస్ బంధువులు ఆశించారట. ఎందుకంటే పెళ్లిరోజు ఆయన అనంతపురంలో పార్టీ కార్యక్రమం పెట్టుకున్నందున రాలేకపోయారని, రిసెప్షన్‌కు ఖాయంగా వస్తారని బంధువర్గాలు అనుకున్నారట. కుటుంబాల్లో ఎన్ని పొరపొచ్చాలున్నప్పటికీ, శుభకార్యాలకు హాజరుకావడం సంప్రదాయం కాబట్టి.. […]
Read Moreమా ప్రయత్నం అంతా.. తెలంగాణ ప్రజల మంచి కోసమే
– ఆర్.ఎస్.ప్రవీణ్ ట్వీట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవాబు ఆర్.ఎస్.ప్రవీణ్ గారూ, మన తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యని ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే మీ ప్రయత్నానికి నా ధన్యవాదాలు. గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఎంత దగాపడిందో, వారి భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనందరం చూసాం. ఆ దశాబ్ద కాల విషాదాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలని, ఎలాంటి పొరపాట్లకు […]
Read Moreఆలోచన ఓ చైతన్యం
ఆలోచన భావ సంద్రాన్ని మెదడు కవ్వంతో మథించగా పుడుతుంది ఆలోచన ఆలోచన ఓ చైతన్యం ఒక ప్రయాణం ఒకప్రబోధం ఒకముందడుగు కార్యాచరణకు మెట్టు ఆలోచన అంటే జీవన చర్యల అభ్యుదయం ఆలోచన అంటే ప్రగతి ఆలోచన అంటే బుద్ధి పోరాటం మూగ చీకట్లను పారదోలే విద్యుత్తు నిరాసక్తతనుఆసక్తిగా మార్చే ప్రయోగం ఆలోచన ప్రపంచగమనానికి రహదారి – వల్లభాపురం జనార్ధన 9440163687
Read Moreకన్నాకు అభినందనల వెల్లువ
– టీడీపీ-జనసేన నేతల అభినందనలు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధిగా ఖరారైన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ-జనసేన నాయకులు అభినందించారు. గుంటూరు, సత్తెనపల్లి, పెదకూరపాడు, పత్తిపాడు, నర్సరావుపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు కన్నాను అభినందనలో ముంచెత్తారు. ఆయన విజయానికి శాయశక్తులా పనిచేస్తామని, కన్నా గెలవడం సత్తెనపల్లికి అవసరం అని టీడీపీ బీసీ నేత తాళ్ల వెంకటేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. కన్నాను గెలిపిస్తే సత్తెనపల్లి లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని […]
Read Moreచెప్పేవి నవరత్నాలు.. చేసేవి నవమోసాలు
– దొంగల ముఠా నాయకుడు జగన్ – జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటే, ఎమ్మెల్యేలు గ్రామాలను కబళిస్తున్నారు – పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కొత్తబోధన గ్రామం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా – కొత్తబోధన గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా కన్నా గ్రామంలోని ప్రతి ఇంటికి […]
Read Moreఎస్సీలకు టీడీపీ అగ్ర తాంబూలం
– ఎస్సీలైన మాల, మాదిగలకు 20 సీట్లు -తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా సంచలనం రేపుతోంది. తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తొలి జాబితాలో ఎస్సీ వర్గానికి సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. మొదటి జాబితాలోనే 20 సీట్లు ఎస్సీలైన మాల, మాదిగలకు కేటాయించడం చరిత్రాత్మకం. ఇది ప్రతీ దళితుడు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. తెలుగుదేశం […]
Read Moreవైసీపీ ఇన్చార్జిలకు జగన్ ఝలక్
– వైసీపీలో సుబ్బారెడ్డి బాంబు – ఇప్పటివరకు 7 జాబితాలో ప్రకటించిన వారు సమన్వయకర్తలే – వాళ్లు అభ్యర్థులు కారని స్పష్టం – అద్దంకి సిద్ధం సభకు జనం తరలింపుపై ఇన్చార్జిల నిరాసక్తత – ఇప్పటిదాకా పెట్టిన ఖర్చుల సంగతేమిటన్న ప్రశ్నలు మేదరమెట్లలో ఆఖరి సిద్ధం సభలో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడించిన సుబ్బారెడ్డి వైసీపీ ఇన్చార్జిల […]
Read Moreరాజధానికి కులం ఎక్కడ, మతం ఏమిటి?
గుణం లేనివాడు కులం మరకవేస్తాడు మానవత్వం లేనివాడు మతం కెలుకుతాడు మనస్సు పదిలం లేనివాడు ప్రాంతం పగ రగిలిస్తాడు (డా. ఎం.సీ.దాస్ సౌజన్యంతో) వారు ముఖపరిచయం కూడా లేనివారు. సాయంత్రం షో సినిమాకి వచ్చారు. సినిమా సగంలో భావోద్వేగంతో రాజధాని ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన రైతులకు సంతాపసూచకంగా నిలబడ్డారు “రాజధాని ఫైల్స్” సినిమా ఇంటర్వెల్ లో. ఎక్కడా కూడబలుక్కోకుండా, వారు ముక్తకంఠంతో చేసిన “జై అమరావతి” నినాదాలతో, సినిమా హాలు […]
Read Moreటీడీపీకి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మద్దతు
– తిరస్కార పత్రం జగ్గూభాయ్ రిపోర్ట్ కార్డ్ 2019-2024 కరపత్రం ఆవిష్కరణ – చంద్రబాబును కలిసిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు ఉండవల్లి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకే తమ సంపూర్ణ మద్ధతని మైనారిటీ హక్కుకల పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. ముస్లింలపై దమనకాండను సాగించిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్తామన్నారు. ఉండవల్లిలో శనివారం చంద్రబాబును కలిసి ‘తిరస్కార పత్రం జగ్గూభాయ్ రిపోర్ట్ కార్డ్ […]
Read Moreజగన్ రెడ్డి, ఎన్నికల తర్వాత జైలుకెళ్లడం ఖాయం
– టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనతో తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం – వైసీపీనేతల ప్యాంట్లు తడుస్తున్నాయి – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు టీడీపీ-జనసేన పార్టీల అధినేతల ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటనతో ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ కిందే భూకంపం వచ్చిందని, రాష్ట్రంలో ఎండలు పెరిగినప్పటికీ తాడేపల్లి కొంపలో మాత్రం ఎన్ని ఎయిర్ కూలర్లు వేసినా, అక్కడున్న నాయకుల కు చెమటలు ఆగడంలేదని, […]
Read More