అమరావతికి అప్పుగా రూ.15 వేల కోట్లు

నామమాత్రపు వడ్డీకే! కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లను వరల్డ్ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తామని చెప్పింది. ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణంపై వడ్డీ నామమాత్రంగా ఉంటుంది. రుణం చెల్లింపుకు ఇచ్చే గడువు కూడా ఎక్కువగా ఉంటుంది. సీఎం చంద్రబాబు చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల్ని అప్పు రూపంలో ఇస్తున్నా.. వాటిని తీర్చాల్సింది 30 ఏళ్ల తర్వాతే కాబట్టి అది భారం కాదు. ఆ రుణాలకు హామీ […]

Read More

ఎంతమంది పిల్లలున్నా ‘తల్లికి వందనం’ ఇస్తాం

– మంత్రి లోకేష్ అమరావతి : ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.  ‘మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే మా లక్ష్యం. అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి రూ.15,000 ఇస్తాం.అందులో సందేహం లేదు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకూ ఈ పథకం వర్తిస్తుంది’ అని శాసనమండలి లో వెల్లడించారు.

Read More

క్యాన్సర్ రోగులకు శుభవార్త

-తగ్గనున్న మూడు ఔషధ ధరలు క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగించే మూడు కీలకమైన ఔషధాలు ట్రాస్టుజుమాబ్‌ డెరాక్స్‌టెకన్‌, ఓసిమార్టినిబ్‌, డుర్వాలుమాబ్‌ పై కస్టమ్స్‌ డ్యూటీని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. వీటిపై గతంలో కస్టమ్స్‌ సుంకం 10 శాతంగా ఉండగా, తాజాగా దాన్ని సున్నాకు స్థిరీకరించారు. అలాగే మెడికల్‌ ఎక్స్‌-రే యంత్రాల్లో వినియోగించే ఎక్స్‌రే ట్యూబ్లు, ఫ్లాట్‌ ప్యానల్‌ డిటెక్టర్లపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని కుదించారు.

Read More

నేపాల్లో కుప్పకూలిన విమానం

18 మంది మృతి నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది మరణించారు. ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా ‘శౌర్య ఎయిర్లైన్స్’కు చెందిన కమర్షియల్ విమానం స్కిడ్ అయి, ఫెన్సింగ్ను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగి ఫ్లైట్ పూర్తిగా దగ్ధమైంది. అందులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు.  హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్స్ సహయక చర్యలు చేపట్టాయి. తీవ్రగాయాలపాలైన పైలట్ ను ఆస్పత్రికి తరలించారు. […]

Read More

కుప్పం నియోజకవర్గ టీడీపీ నాయకులతో భువనేశ్వరి భేటి

కుప్పం నియోజకవర్గ టీడీపీ నాయకులతో నారా భువనేశ్వరి నేడు భేటి అయ్యారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి వారి విన్నపాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకుపార్టీ అన్ని వేళలా అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుప్పం నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ… వైసీపీ నాయకులు ఓటర్లను అనేక ప్రలోభాలకు గురిచేసినా మేం కష్టపడి ప్రతి ఓటును జాగ్రత్తగా కాపాడగలిగాం. 2024 ఎన్నికల్లో వైసీపీ నేతలతో కాదు […]

Read More

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం, 1,83,686 క్యూసెక్కుల వేగంతో నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. అయితే, ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు. దీంతో, జలాశయం నీటి మట్టం 846.00 అడుగులకు చేరుకుంది. ఇన్‌ఫ్లో: 1,83,686 క్యూసెక్కులు (ప్రస్తుతం నీరు వచ్చి చేరుతోంది) ఔట్‌ఫ్లో: 0 క్యూసెక్కులు (నీరు విడుదల చేయడం లేదు) పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు ప్రస్తుత నీటి […]

Read More

దటీజ్… నాయుడు!

-పొత్తుతో రాష్ట్రానికి ‘విత్త’నం -బడ్జెట్‌పై పొత్తు ప్రభావం -ఏపీని చూసి కుళ్లుకుంటున్న ఇతర రాష్ట్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యూహం మామూలుగా ఉండదు. సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కునే నైజం ఆయనది. గత ఎన్నికల ముందు రాష్ట్రంలో కనీసబలం లేని బీజేపీతో పొత్తు వల్ల నష్టమని చాలామంది టీడీపీ సీనియర్లు వాదించారు. ఆ పార్టీతో కలిస్తే మునిగిపోతామని చంద్రబాబుకు సలహాలిచ్చే చాలామంది మేధావులు హెచ్చరించారు. […]

Read More

గురువు స్థానం… గ్రేట్!

ఒకప్పుడు హెడ్ మాస్టర్లకి రాజులు ఇచ్చిన గౌరవం ఇలా ఉండేది… ఇంగ్లాండ్ కి రాజైన రెండవ చార్లెస్ కొడుకు రాజధానికి కాస్త దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతున్నాడు. ఆ పాఠశాల హెడ్మాస్టర్ పేరు బస్బీ. ఒక రోజు ఆయనకి రాజుగారి నుండి ఒక ఉత్తరం వచ్చింది. తన కుమారుడు ఎలా చదువుతున్నాడో తనిఖీ చేయడానికి ఒకసారి పాఠశాలని సందర్శిస్తానని ఆ ఉత్తరం సారాంశం.. హెడ్ మాస్టర్ తిరుగు టపాలో రాజు గారిని రావద్దని […]

Read More

మాటలు ఘనం – నిధులు స్వల్పం

ఆశించిన స్థాయిలో నిధులేవి? కేంద్ర బడ్జెట్‌పై సీపీఐ (ఎం) ధ్వజం  విజయవాడ, మహానాడు :  కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించింది. మాటలు ఘనం నిధులు నిల్‌ అన్నట్లుగా బడ్జెట్‌ ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎన్నికలనంతరం ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని, భారీగా నిధులు వస్తాయని, విభజన చట్టంలోని అన్ని అంశాలు […]

Read More

ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యం 

వరుస విద్యుత్ ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం అమరావతి, మహానాడు :  రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస విద్యుత్ ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల ముందస్తు నివారణ చర్యల్లో  భాగంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిoచాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. చనిపోయిన వారికి  రూ.5లక్షల పరిహారం ఇవ్వటం ముఖ్యం కాదని, ప్రమాదాలు జరగకుండా చూసి ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని తెలిపారు. విధుల్లో విద్యుత్ […]

Read More