-తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ -ఘనంగా ఫిరంగిపురం కార్మెల్ మాత ఉత్సవాలు ఫిరంగిపురం, మహానాడు: ఫిరంగిపురంలో కార్మెల్ మాత ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మెల్ మాత విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కార్మెల్ మాత దీవెనలు ప్రతి కుటుంబంపై ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఫాదర్ ఫాతిమా మర్రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Read Moreసీఎం, ఎమ్మెల్యే గెలుపు నేపథ్యంలో పాదయాత్ర
వినుకొండ, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, వినుకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా జీవీ ఆంజనేయులు భారీ మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో స్థానిక 11వ వార్డు రైలుపేట నుంచి మదమంచి పాడు ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా కూటమి నాయకులు మునయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావులు జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో […]
Read Moreఆస్ట్రేలియాలో ఘనంగా టీడీపీ గెలుపు సంబరాలు
ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో టీడీపీ గెలుపు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సినీ నటుడు శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నారై టీడీపీ తరుఫున ప్రకటించిన లక్ష ఉద్యోగ అవకాశాలను అమలుపరచాలి కోరారు. అలాగే వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కోట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. దాదాపు 1100 మంది […]
Read Moreప్రకాశం జిల్లా కలెక్టర్ ను కలిసిన గొట్టిపాటి లక్ష్మి
తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాని మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు భేటీ అయ్యారు. దర్శి నియోజకవర్గంలోని సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో కూటమి ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు పథకాలు ప్రజలు […]
Read Moreసాగర్ కుడికాలువకు 4 టీఎంసీలు
గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా నాలుగు టీఎంసీల విడుదలకు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. ఈ నెల 17వ తేదీ నుంచి రోజుకు 5,500క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని బోర్డుకు సిఫార్ఫు చేసింది. హైదరాబాద్లోని కృష్ణాబోర్డు కార్యాలయంలో త్రిసభ్యకమిటీ సమావేశమైంది. సాగర్ కుడికాలువకు నాలుగు టీఎంసీలు విడుదల చేసేందుకు సానుకూలంగా స్పందించారు
Read Moreఅమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి మన తెలుగింటి అల్లుడే!
-ఎవరీ ‘ఉషా చిలుకూరి’? ఆమెరికన్ గ్రాండ్డ్ ఓల్డ్ పార్టీ- రిపబ్లికన్స్ గెలిస్తే అగ్రరాజ్య అమెరికాకి ఓ తెలుగింటమ్మాయి సెకండ్ లేడీగా నిలుస్తారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ ను ఆ పార్టీ సోమవారం సాయంత్రం ఎంపిక చేస్తే , ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా ఒహాయో రిపబ్లికన్ సెనేటరు, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ను ఎంచుకున్నారు. 39 ఏళ్ల జేడీ […]
Read Moreవిజయ‘విలాపం’!
(మార్తి సుబ్రహ్మణ్యం) తనదాకా వస్తేగానీ తెలియదని పెద్దలు చెబుతుంటారు. ఒకప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి టీడీపీ, దాని అధినేత చంద్రబాబునాయుడు, తనయుడు లోకేష్, రఘురామకృష్ణంరాజు, బాలకృష్ణ, రామోజీరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, అయ్యన్నపాత్రుడు అండ్ అదర్స్‌పై ట్విట్టర్‌లో చెలరేగి.. వారిని బండబూతులు తిట్టిన వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి.. తనను లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు మీడియా చేస్తున్న విమర్శలు-ఆరోపణలపై విలపిస్తుంటే, పెద్దలు చెప్పిన సామెత గుర్తుకురాక తప్పదు. అయితే అప్పట్లో […]
Read Moreజౌళి పరిశ్రమకు బకాయిల విడుదలకు కృషి
పరిశ్రమ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారం రాష్ట్రంలోని అన్ని వ్యవస్ధలను బ్రస్టు పట్టించిన జగన్ మోహన్ రెడ్డి అమరావతి, మహానాడు: జౌళి పరిశ్రమకు గత ప్రభుత్వం నుండి రావలసిన బకాయిల విడుదల చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత హామీ ఇచ్చారు. కల్తీ కాటన్ […]
Read Moreరుణ మాఫీ మిగతా వారికి కూడా వర్తింపు
మంత్రి తుమ్మల హైదరాబాద్, మహానాడు: ప్రభుత్వం దగ్గర అందరి వివరాలు ఉన్నాయి. కుటుంబ నిర్ధారణ కాగానే రుణ మాఫీ మిగతా వారికి కూడా వర్తింపు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే, ఏక కాలంలో 2లక్షల రుణమాఫీ హర్షించాల్సిన విషయమన్నారు. రుణమాఫీ 2018 లో అవలంబించిన విధానాలే 2024 లో కుడా అమలు చేస్తామన్నారు. అప్పుడు 2018 […]
Read Moreఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు
అమరావతి, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ. 2 లక్షల వరకు విలువ చేసే వైద్యసేవలు అందుతాయని, ఇలా సంవత్సర కాలంలో […]
Read More