తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేశవరావు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహా దారుగా కె. కేశవరావు ఈరోజు నియమితుల య్యారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల కేకే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అనంత‌రం ఆయ‌న తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో కెకె ను స‌ల‌హాదారుగా రేవంత్ ప్ర‌భుత్వం నియ‌మించింది.

Read More

మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే సౌమ్య

అమరావతి , మహానాడు : 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయదుంధుభి మోగించిన తరుణంలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ పట్టణం పల్లగిరిలో వేంచేసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో తంగిరాల సౌమ్య బృందం 202 కొబ్బరికాయలను కొట్టారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే తంరిగాల సౌమ్య అత్యధిక భారీ మెజారిటీ గెలిచిన సందర్భంగా మొక్కులు […]

Read More

ఇకపై నేరుగా విద్యార్థులకే కాస్మొటిక్స్

అమరావతి , మహానాడు : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను (పేస్ట్, బ్రష్, షాంపూ వగైరా) నేరుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అయ్యే మొత్తాన్ని గత ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో జమ చేసే విధానం తెచ్చినా సరిగా అమలు కాలేదు. దాదాపు రూ.10 కోట్ల బకాయిలున్నట్లు తేల్చింది. దీంతో ఇకపై వస్తువుల్ని విద్యార్థులకే  నేరుగా ఇవ్వాలని నిర్ణయించింది. 548 పాఠశాలల్లో 1.25 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

Read More

బస్తీ దవాఖానలో మంత్రి సీతక్క

హైదరాబాద్, మహానాడు : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క ప్రజాభవన్ లోని బేగంపేట బస్తీ దవాఖానలో హెల్త్ చెకప్ చేయించుకున్నారు. తదనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ…  వర్షాకాలంలో ఆరోగ్య విషయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించి వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు, అలాగే ఆరోగ్యమే-మహాభాగ్యం ప్రజలు ఆరోగ్యంగా ఉంటే దేశం సౌభాగ్యంగా ఉంటుందన్నారు. ప్రజలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. హెల్త్ చెకప్ చేసిన బస్తీ దవాఖాన సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Read More

మొక్కు తీర్చుకున్న కార్యకర్తలు

కాకినాడ, మహానాడు : సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పంతం నానాజీ విజయం సాధించాలని పాత గైగోలుపాడు టీడీపీ కూటమి కార్యకర్తలు పాదయాత్ర చేస్తామని మొక్కుకున్నారు. మొక్కుకున్నట్టుగానే వారు గెలుపొందడంతో కాకినాడ రూరల్ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఆధ్వర్యంలో శనివారం పాదయాత్రగా అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి బయల్దేరి మొక్కును తీర్చుకున్నారు.

Read More

ఉండవల్లిలో రంగా విగ్రహ ఏర్పాటు 

* అమరావతిలో రంగా పేరిట స్మృతి వనం * మంత్రి నారా లోకేష్ కు విన్నవించిన కాపు జాగృతి నాయకులు మంగళగిరి, మహానాడు : ఉండవల్లిలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని పునర్నిర్మించాలని, రాజధాని అమరావతిలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి రంగా పేరిట స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని కాపు జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్ధన్, గుంటూరు జిల్లా ప్రధాన  కార్యదర్శి జొన్న […]

Read More

రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించొద్దు

–రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ -మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి బీఅర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా దేశ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ అధినేత రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…రాహుల్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని చెప్పిందేంటి […]

Read More

‘డార్లింగ్’ కంప్లీట్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్ టైనర్ : ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత చైతన్య రెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా […]

Read More

ఆవేశపడకు బొత్సా…

–బొత్సకు కౌంటర్ -టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పలమనేరు, మహానాడు :హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైన నేపథ్యంలో వైసీపీ నేత బొత్స చేసిన వ్యాఖ్యలను పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఖండించారు. ఈ సందర్బంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ..అక్కడ ఉంది జగన్ కాదు, చంద్రబాబు… మీ జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా, అప్పనంగా ఏపి భవనాలు అప్పగించింది మర్చిపోలేదు. ఢిల్లీలో ఏపీ భవన్ ఇచ్చేస్తాం […]

Read More

ఇద్దరు సీఎంల భేటీలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించాలి – టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్

ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సమావేశమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై వారు చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను సైతం పరిష్కరించేలా చర్చ జరగాలని కోరారు టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు […]

Read More