చిన్నపిల్లల వైద్యనిపుణుడు కె.వినోద్‌కుమార్ శ్రీకాకుళంలో ముందస్తు జాగ్రత్తలపై శిక్షణ జేసీఐ ఆధ్వర్యంలో కార్యక్రమం శ్రీకాకుళం: ఆకస్మిక గుండెపోట్లతో వేలాది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని, వీటిని కొంతవరకు నియంత్రించుటకు సీపీఆర్ శిక్షణ ఇచ్చేందుకు జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ నడుం బిగించిందని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణు లు కూర్మాన వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గుండెపోటు`ముందస్తు జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కల్పించి సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. […]
Read Moreఇక నుంచి వాట్సాప్ స్టేటస్లో వన్ మినిట్ వీడియో
ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ ‘స్టేటస్ అప్‌డేట్స్-1 మినిట్’ ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు 1-30 సెకన్ల వీడియోలు మాత్రమే స్టేటస్ పెట్టుకునేందుకు వీలుండగా, ఇక నుంచి ఒక నిమిషం వరకు నిడివి గల వీడియోలను స్టేటస్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని, త్వరలోనే మిగతా వారికి అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.
Read Moreబస్సులు, సిబ్బందిపై దాడి చేస్తే చర్యలు
జరిగిన ఘటనలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తిరుమల శ్రీవారి దర్శించుకుని పూజలు తిరుమల, మహానాడు : ఆర్టీసీ బస్సులు, సిబ్బందిపై దాడులు చేస్తే చర్యలు తప్పవని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకు న్నారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని, ఆర్టీసీ కార్మికులు కూడా బాగుండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. […]
Read Moreఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ కీలక ఒప్పందం
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఏర్పాటుకానున్న చోట 1,500 ఎకరాల్లో ‘స్పేస్ పార్క్’ నిర్మాణం కానుంది. ఇందుకోసం ఇస్రోతో తమిళనాడు ప్రభుత్వ నిర్వహణలోని ‘టిడ్కో’ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ప్రస్తుతం భారత్‌లో నెల్లూరు జిల్లా శ్రీహరికోట వద్ద బంగాళాఖాతం తీరంలో మాత్రమే రాకెట్ ప్రయోగ కేంద్రం అందుబాటులో ఉంది.
Read Moreబీఆర్‌ఎస్ ఎమ్మెల్సీని ఎందుకు అరెస్టు చేయలేదు?
డీజీపీని కలిసి నిలదీసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ హైదరాబాద్, మహానాడు : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు శనివారం డీజీపీని కలిసి నిలదీశారు. తక్షణమే అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. డబ్బుల రవాణా కోసం ఎస్సై సారా సాయికిరణ్‌ను వెంకటరామిరెడ్డి నియ మించినట్లు మార్చి 29న […]
Read Moreమాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఇంటిలిజెన్స్ సీతారామాంజనేయులు, ఐజి కొల్లి రఘురామరెడ్డి ఫోన్ కాల్ డేటా పరిశీలించాలి
• టీడీపీ పార్టీ అధికారంలోకి రాకుండా పోలీసు అధికారులు రాజేంద్రనాథ్ రెడ్డి, సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ పన్నిన కుట్రను కూడా సిట్ వెలికి తీయాలి • మాచర్లలో పోలింగ్ సందర్భంలో అరాచకం సృష్టించి రక్తపాతానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పిన్నెళ్లి అతని తమ్ముడు వెంకట రామిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి • టీడీపీ నేత నానిపై హత్యాయత్నానికి కారకుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి […]
Read Moreఆస్తి కోసం తల్లి, ఇద్దరు కూతుళ్ల హతం
ఖమ్మం జిల్లాలో గోపాలపేటలో దారుణం ఖమ్మం, మహానాడు : ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య చేసిన కసాయి ఉదంతం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు తన పేరుపై ఆస్తి రాసివ్వడం లేదని కోపం పెంచుకున్నాడు. తల్లి పిచ్చమ్మ(60)ను గొంతు నులిమి చంపాడు. అనంతరం ఇద్దరు కుమార్తెలు నీరజ(10), రaాన్సీ(6)లను చంపి పరారయ్యాడు. పొలం తన పేరుపై రాయా […]
Read Moreజూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అనుమతి ఏర్పాట్లు చేసుకుంటున్న నిర్వాహకులు హైదరాబాద్ : ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన పంపిణీదారు బత్తిన కుటుంబం కీలక ప్రకట న చేసింది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం ఇచ్చేందుకు ఈ ఏడాది కూడా జూన్ 8 నుంచి ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించా రు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని […]
Read Moreఅంబేద్కర్ కి మోదీ పూజలు
ప్రధాని మోదీ అంబేద్కర్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ముంబైలోని చైతన్య భూమికి వెళ్లి పుష్పాలు సమర్పించి నమస్కరించారు. తాను ఆ ప్రదేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎప్పటికీ అలాగే ఉంటాయని పేర్కొన్నారు.
Read Moreఅప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రారంభం
సింహాచలం అప్పన్న దేవాలయంలో రెండు ఎలక్ట్రిక్ బస్సులను ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తితో కలిసి ప్రారంభించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.కోటి 65 లక్షలని, రెండున్నర గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందన్నారు. భక్తుల సౌకర్యార్ధం కాలుష్యాన్ని తగ్గించేందుకు రెండు బస్సులను కొనుగోలు చేసి భక్తులకు అందుబాటులో ఉంచామని అశోక్ గజపతిరాజు తెలిపారు.
Read More