ఇద్దరు చిన్నారుల దుర్మరణం 40 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళుతుండగా ఘటన కర్నూలు, మహానాడు : కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా 40 మందికి పైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో కొందరు చిక్కుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఆదోనికి […]
Read Moreఎన్‌ఆర్‌ఐ జనసైనికుల చేయూత
అగ్నిప్రమాద బాధితులకు రూ.లక్ష సాయం జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ప్రశంసలు అవనిగడ్డ: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల నామినేషన్‌లో కాల్చిన బాణసంచా వల్ల యాసం వెంకటేశ్వరరావు గృహం పూర్తిగా కాలిపోయి ఆ కుటుంబం నిలువ నీడలేకుండా పోయింది. దీంతో ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు స్పందించి లక్ష రూపాయల చెక్కును పంపగా గురువారం అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ జనసేన ప్రతినిధులు పద్యాల […]
Read More87 మందికి పాజిటివ్
– బెంగుళూరులో డ్రగ్స్ పార్టీ – సినీ సెలబ్రెటీల హల్‌చల్ – మాకు సంబంధం లేదంటూ వీడియోలు వైరల్ – పోలీసుల దర్యాప్తులో పాజిటివ్ కేసులు బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలో పాల్గొన్న మొత్తం 109 మంది శాంపిల్స్ సేకరించి బ్లడ్ టెస్ట్ చేస్తే డ్రగ్స్ టెస్టులో 87 మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో తెలుగు నటి హేమ, వాసు, అరుణ్, మరో […]
Read Moreకొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న హరీష్ రావు
జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రఖ్యా త పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, తదితరులు ఉన్నారు.
Read Moreమహిళలకు బడుల బాధ్యతలు
-ఇక నుండి ప్రతి బడి- అమ్మ ఒడి -ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు -ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడిలా ఉండేలా…ప్రభుత్వ పాఠశాలల ఆలనా పాలన కోసం సర్కారు సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల బాగోగులను పట్టించుకునే బాధ్యతను అక్కడి స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించాలని […]
Read Moreబాణసంచా విక్రయాలపై నిషేధం
– ఈసీ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఏపీలో ర్యాలీలు, ఉరేగింపులకు అనుమతులు రద్దు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Read Moreమమతకు హైకోర్టు మొట్టికాయ.. ఎందుకంటే… ?
(రఘువంశీ) కలకత్తా హైకోర్టు నిన్న ఒక తీవ్రమైన తీర్పు ఇచ్చింది. ఏ తరగతినైనా OBCగా వర్గీకరించే రాష్ట్ర అధికారాన్ని నియంత్రించే 2012 స్కీమ్‌లో “శాసన విధానం” పూర్తిగా లేకపోవడాన్ని బెంచ్ ఎత్తి చూపించి, బెంగాల్ ప్రభుత్వం 2010 నుండి ఇప్పటివరకు ఇచ్చిన సుమారు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు అన్నిటినీ రద్దు చేసింది. అయితే, ఈ సర్టిఫికెట్లు ఆధారంగా ఇప్పటికే ఉద్యోగం పొంది ఉద్యోగాల్లో ఉన్నవారు అలాగే సెలెక్ట్ అయ్యి […]
Read Moreడ్రగ్స్ కేసులో హేమకు పాజిటివ్
ఇటీవలె టాలీవుడ్‌లో డ్రగ్స్ హంగామా బాగా ఎక్కువయిపోయింది. రీసెంట్‌గా జరిగిన బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నవారిలో టాలీవుడ్ కి చెందినవారు అనేకమంది ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు, ఫోటోలను పోలీసులు విడుదల చేసింది. అయితే తాను ఆ రేవ్ పార్టీకి వెళ్లలేదని ..హైదరాబాద్ లోనే ఉన్నానంటూ బుకాయించి మరీ వీడియో రిలీజ్ చేసింది మహానటి హేమ. ఆరోజు బర్త్ డే పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన […]
Read Moreహైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు
నాలుగు బూత్‌లలో రీపోలింగ్‌కు పిటిషన్ సత్తెనపల్లి, మహానాడు: నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. నియోజకవర్గంలోని 236, 237, 253, 254 బూత్‌లలో రీ పోలింగ్ నిర్వహించాలని పిటిషన్‌లో కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు మరో ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది.
Read Moreఛలో మాచర్లకు అనుమతి లేదు: ఎస్పీ
నరసరావుపేట, మహానాడు: తెలుగుదేశం పార్టీ గురువారం తలపెట్టిన ఛలో మాచర్ల కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్ తెలిపారు. జిల్లాలో కౌంటింగ్ నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున టీడీపీ రాష్ట్ర నాయకు లు, కార్యకర్తలు, ప్రజలు ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ర్యాలీగా వెళ్లడం చేయకూడదని హెచ్చరించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read More