కౌంటింగ్‌ నేపథ్యంలో విస్తృత తనిఖీలు

సమస్యాత్మక ప్రాంతాలలో డ్రోన్లతో నిఘా మద్యం, ఇతర దుకాణాలను మూసివేయించాలి అధికారులకు ఎస్పీ తుషార్‌ డూండి ఆదేశం గుంటూరు: జిల్లాలో కౌంటింగ్‌ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా లాడ్జి, ప్రైవేటు గెస్ట్‌ హౌస్‌లు, ఇతర రిసార్ట్‌ హోటళ్లు తనిఖీలు నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ తుషార్‌ డూండి ఆదేశించారు. గుంటూరు జిల్లాలో 144 సెక్షన్‌, 30 పోలీసు చట్టం అమలులో ఉందని, గుంటూరు జిల్లా అంతటా ప్రజలు గుంపులు గుంపులు […]

Read More

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులకు కౌంటింగ్ ఏజెంట్ల ఝలక్

– కౌంటింగ్‌కు వైసీపీ ఏజెంట్ల దూరం? – అనారోగ్యం పేరుతో జారుకుంటున్న కౌంటింగ్ ఏజెంట్లు – బంధువులకు బాగోలేదని చెక్కేస్తున్న మరికొందరు – స్విచ్చాఫ్ చేసి జారుకుంటున్న వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు – కూటమి కొత్త ఎమ్మెల్యేలతో ఘర్షణ ఎందుకన్న ముందుచూపే కారణమా? – ఎగ్జిట్‌ఫోల్ ప్రభావంతోనే వైసీపీ ఏజెంట్ల ‘డ్రాపవుట్స్’? – రాయలసీమ, నెల్లూరు, పల్నాడులోనే ‘అస్త్రసన్యాసాలు’ – ఏజెంట్ల షాక్‌తో తల పట్టుకుంటున్న వైసీపీ అభ్యర్ధులు – […]

Read More

గీత దాటితే తాట తీస్తాం

సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై నిఘా నిందితులపై ఐటీ, పీడీ యాక్ట్‌లు ప్రయోగిస్తాం డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా హెచ్చరిక కౌంటింగ్‌ నేపథ్యంలో సూచనలు అమరావతి: సోషల్‌ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా హెచ్చరించారు. కౌంటింగ్‌ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాల్‌ విసురుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిపై […]

Read More

అమెరికాలో తెలుగు యువతి అదృశ్యం

హైదరాబాద్‌:  అమెరికాలో భారతీయ విద్యార్థులు వరుసగా సమస్యల్లో చిక్కుకో వడం కలకలం రేపుతోంది. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో హైదరాబాద్‌కు చెం దిన కందుల నితీశ అనే యువతి అదృశ్యమైంది. మే 28 నుంచి ఆమె కనిపిం చకుండా పోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ప్రజల సాయం కోరారు. ఆమె గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరారు.

Read More

ఎన్టీఆర్‌ ఫౌండేషన్‌కు మన్నవ రూ.2 కోట్ల విరాళం

టీడీపీ అధినేత చంద్రబాబుకు చెక్కు అందజేత అమరావతి : ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అనుబంధ విభాగమైన ఎన్టీఆర్‌ ఫౌండేషన్‌కు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్‌కృష్ణ రూ.2 కోట్లను విరాళంగా అందించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం ఉండవల్లి నివాసంలో కలిసి చెక్కు అందించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఎన్నో సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తోందని, ఎంతోమంది పేద విద్యార్థులను చదివిస్తున్నారన్నారని మోహన్‌కృష్ణ ప్రశంసించారు. అనంతరం మోహన్‌కృష్ణను చంద్రబాబు […]

Read More

ఓట్ల లెక్కింపును విజయవంతంగా నిర్వహించాలి

ఎలాంటి సమస్య ఉన్నా ఆర్వో దృష్టికి తీసుకెళ్లాలి ర్యాండమైజేషన్‌తో టేబుళ్లకు లెక్కింపు సిబ్బంది పల్నాడు జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి లత్కర్‌ నరసరావుపేట: ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సంసిద్ధమవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి లత్కర్‌ ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచించారు. జేఎన్‌టీయూ యూనివర్సి టీలో కౌంటింగ్‌ నేపథ్యంలో సోమవారం నియోజకవర్గాల వారీగా వివిధ ప్రదేశా లలో ఎన్నికల అధికారులు, […]

Read More

కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర ఈసీ నిఘా ఉంచాలి

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఏజెంట్లు కౌంటింగ్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలి ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు చిలకలూరిపేట: అత్యంత ఉత్కంఠభరితంగా మారిన సార్వత్రిక ఎన్నికల ఫలితా లకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రతిక్షణం ఎన్నికల సంఘం పటిష్ఠ నిఘా ఉంచాలని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, నరసరా వుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఇప్పటికీ కొందరు అధి కారులు అధికార వైకాపా బెదిరింపులు, […]

Read More

రెడ్‌జోన్‌గా కౌంటింగ్‌ పరిసరాలు: సీఈవో

అమరావతి:  కౌంటింగ్‌ సెంటర్ల పరిసరాలను రెడ్‌ జోన్‌గా ప్రకటించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా తెలిపారు. ఏపీలో మొత్తంగా 1985 సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా 12 వేల మందిని గుర్తించి బైండోవర్‌ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 1200 ప్రాంతాల్లో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించామని, కౌంటింగ్‌ సెంటర్లపై డ్రోన్ల ద్వారా నిఘా పెట్టామని వివరించారు.

Read More

పల్నాడుపై డేగ కన్ను

ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం నరసరావుపేట జేఎన్‌టీయూలో ఏర్పాట్లు పూర్తి ఉదయం 8 గంటలకు ప్రారంభం విధుల్లో పాల్గొననున్న 700 మంది సిబ్బంది పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు గుంటూరు- కర్నూలు హైవేపై ట్రాఫిక్‌ ఆంక్షలు నరసరావుపేట: ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. నరసరావుపేట జేఎన్‌టీ యూలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. 700 మంది సిబ్బందిని లెక్కింపు కోసం కేటాయించారు. కౌంటింగ్‌ పరిసరాల్లో మూడంచెల భద్రతను […]

Read More

టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

మంగళగిరి: కౌంటింగ్‌ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సందర్శకులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది.

Read More