అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు

-సీఎంవో, సీఎస్‌, డీజీపీతో చంద్రబాబు భేటీ.. -అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులపై సీఎం దృష్టి.. -అధికారుల పనితీరుపై నివేదికల ఆధారంగా బదిలీలు అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా సీఎంవో, సీఎస్‌, డీజీపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులపై సీఎం దృష్టి పెట్టారు. అధికారుల పనితీరుపై నివేదికల ఆధారంగా బదిలీలు చేస్తున్నట్లు సమాచారం.గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులను పక్కనపెట్టనున్న […]

Read More

స్పా కేంద్రం ముసుగులో యువతులతో వ్యభిచారం

రాజమహేంద్రవరం: స్పా కేంద్రం ముసుగులో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. ఏవీ అప్పారావు రోడ్డులో జిమ్, కేంద్రం నిర్వహిస్తున్నారు. అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం పోలీసులు దాడి చేశారు. ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు.

Read More

మేం ఐదుగురికి డిప్యూటీ సీఎం ఇచ్చాం?

– పవన్ ఒక్కడికే డిప్యూటీ సీఎం పదవా? – వైసీపీ నేత పోతిన మహేశ్ విజయవాడ: కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడుందని వైసీపీనేత పోతిన మహేశ్ ప్రశ్నించారు. మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అగౌరవ పరిచారని అన్నారు. ‘వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, […]

Read More

ఇచ్చిన మాటకు కట్టుబడిన మోదీ

– మెగా డీఎస్సీ పై సంతకం పెట్టడం సంతోషం – బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ కృష్ణ విజయవాడ: ఈ రాష్ట్రంలో జగన్ పాదయాత్ర లో యువతని నమ్మించి గత ఐదు సంవత్సరాలు మోసం చేసారు. ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ ప్రకటిస్తే వైసీపీ నేతలు స్పందన చూస్తే వారి అహం మాటల్లో కనపడుతోంది. అందుకే యువత వారి ఓటుతో వైసీపీ కి తగిన గుణపాఠం […]

Read More

ప్రీతి ఆత్మహత్య కేసు విచారణ 17న

వరంగల్: వరంగల్ కేఎంసీ అనస్తీషియా విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన డా. సైఫ్ ఈ నెల 17న ఉమ్మడి వరంగల్ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో హాజరుకానున్నారు. న్యాయమూర్తి నేర నిర్ధారణ విచారణ చేయనున్నారు. అనంతరం ట్రయల్ తేదీల కోసం కేసు వాయిదా వేస్తారు. గత సంవత్సరం ఫిబ్రవరి 26న ప్రీతి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

Read More

కేజ్రీవాల్ భార్య సునీతకు కోర్టు నోటీసు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టుకు హాజరైనప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని సూచించింది. దీనిపై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ, అమిత్ శర్మలతో కూడిన బెంచ్ ఆదేశాలిచ్చింది. కేజ్రీవాల్ గతంలో రౌస్ అవెన్యూ కోర్టులో చేసిన ప్రసంగం కాసేపటికే సోషల్ మీడియాలో కనిపించింది.

Read More

పోలీసు శాఖ ప్రక్షాళన

– మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి – హోంమంత్రి అనిత రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాల సూచనలు కూడా తీసుకుంటామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యం చేయాలంటేనే భయపడేలా చర్యలుంటాయని ఆమె తెలిపారు.మహిళల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామన్నారు. లేని దిశ […]

Read More

రెండున్నరేళ్లలో ‘అమరావతి’ పూర్తి చేస్తాం

– మంత్రి నారాయణ రాజధాని అమరావతి పరిస్థితి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని వేయనున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఆ నివేదిక రావడానికి 2,3 నెలల సమయం పడుతుందన్నారు. మరో 10 రోజుల్లో పనుల ప్రారంభంపై స్పష్టత వస్తుందని తెలిపారు. అమరావతి నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. భూములిచ్చిన రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read More

నా అనంత ‘ప్యూర్’ ..అంతులేని స్వచ్చ‘ట’

ఈస్ట్ సైడ్ తాడిపత్రి (పెమ్మసాని వారి రాజధాని) వెస్ట్ సైడ్ పెన్నహోబిళం (పెన్న ఒడ్డున సదాశివరాయలు కట్టించిన దేవాలయం) నార్త్ సైడ్ గుత్తి, కసాపురం (తిమ్మరుసు వారిది) సౌత్ సైడ్ పెనుగొండ, లేపాక్షి…(పెనుగొండ – అష్టపదులకు వ్యాఖ్యానం వ్రాసిన ఒంటికన్ను తిర్మలరాయలు, భట్టుమూర్తి వసుచరిత్ర తాలూకు ఘనగిరి, ఇక లేపాక్షి – అచ్యుతరాయల వారి కాలపు కూర్మగిరిపై కట్టిన ఘనమైన దేవాలయం) ఆల్ సైడ్స్ ఘనమైన చరిత్రకు, తెలుగువాళ్ళ సాంస్కృతిక […]

Read More

ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ పూర్తి ప్రక్షాళన

 – ‘స్పందన’ పేరు మార్పు – చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘స్పందన’ వ్యవస్థ ప్రక్షాళనను ప్రభుత్వం చేపట్టింది.’స్పందన’ పేరును శనివారం తొలగించింది. ఇకపై ‘ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాలు’ పేరుతో వినతలను స్వీకరించనున్నారు. ప్రతి సోమవారం ఏపీ కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. స్పందన వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరించగా.. ఫిర్యాదుల స్వీకరణ […]

Read More