జాస్తి వీరాంజనేయులు వినతి ఢిల్లీ, మహానాడు : అమరావతి రాజధానిలో నూతన విమానాశ్రయాన్ని మంజూరు చేయాలని అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయంలో లేఖ అందజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కలిసి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం భూమి […]
Read Moreచంద్రబాబు ఆలోచనలను వైఎస్ అమలు చేశారు
– సీఎం రేవంత్ హైదరాబాద్: వైఎస్ – చంద్రబాబుకు రాజకీయపరంగా భిన్నాభిప్రాయాలుండేవని, అయినా చంద్రబాబు హైదరాబాద్ కోసం చేసిన ఆలోచనలను వైఎస్ విస్తరించి అమలు చేశారని సీఎం రేవంత్ అన్నారు. “హైదరాబాద్ కోసం మణిహారంలాంటి ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ నిర్మిస్తే దాన్ని తాకట్టుపెట్టి, పారిపోయిన సన్నాసులు ‘కాంగ్రెస్ ఏం చేసిందని’ ప్రశ్నిస్తారా?” అని అసెంబ్లీలో రేవంత్ బీఆర్‌ఎస్ పై మండిపడ్డారు
Read Moreరాజాం విద్యార్థికి రూ.40 లక్షల ప్యాకేజ్ తో ఉద్యోగం
రాజాం : రాజాంలోని జీఎంఆర్ ఐటీ కళాశాలకు చెందిన విద్యార్థి నిర్మల ప్రియ పారిస్లోని గ్రూప్ ADP అంతర్జాతీయసంస్థలో 40 లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. నిర్మల ప్రియ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామం వాసి. ఆమె తండ్రి వెంకట రావు ఓ సాధారణ క్యాటరింగ్ వ్యాపారి. సైబర్ సెక్యూరిటీ కోర్స్ ని పూర్తి చేయడం ద్వారా ఈ కొలువును సాధించగలిగానని ఆమె […]
Read Moreహైదరాబాద్‌లో ఇక అర్ధరాత్రి వరకూ షాపులు
ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త హైదరాబాద్ లో రాత్రివేళలో హోటళ్ల సమయంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్ధరాత్రి 1 గంట వరకు, మద్యం షాపులు తప్ప మిగతా ఏ వ్యాపారమైనా నడిపించుకోవచ్చని తెలిపారు. వైన్ షాపులకు ఈ అవకాశం ఇస్తే విచ్చలవిడిగా తాగే అవకాశం ఉందని, అందుకే దాన్ని మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రా. 11 గంటలకే రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయడంతో ఇబ్బంది అవుతోందని పలువురు […]
Read Moreఅభివృద్ధి పనులపై సమీక్ష
నెల్లూరు, మహానాడు : నెల్లూరు ఆర్ అండ్ బీఅతిథి గృహంలో శుక్రవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్.డబ్ల్యూ.ఎస్, ఇరిగేషన్ అధికారులతో కలిసి అదానీ కృష్ణపట్నం పోర్టుతో పాటు పామాయిల్ ఫ్యాక్టరీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి పోర్టు, పామాయిల్ ఫ్యాక్టరీలకు గతంలో జరిగిన నీటి కేటాయింపులపై చర్చించారు. పరిశ్రమలకు అవసరమైన నీటిని తరలించేందుకు చేపట్టాల్సిన పైపులైను నిర్మాణంపై సమీక్షించారు. అనంతరం ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులతో ప్రత్యేకంగా […]
Read Moreవెనుకబడిన జిల్లాల్లో ప్రకాశాన్ని చేర్చడంపై హర్షం
దర్శి, మహానాడు : దర్శి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాని చేర్చటం, అవసరమైన నిధులను మంజూరుకు కృషిచేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలతో కలిసి ఢిల్లీ వెళ్లి నియోజకవర్గంలోని సమస్యలను వివరించారు. ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల జాబితాలో […]
Read More2015లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే సీఆర్డీయే పరిధి
– సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : 2015లో ఇచ్చిన జీవో నెంబర్ 207 ప్రకారం 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే సీఆర్డీయే ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో గుర్తించిన విస్తీర్ణం ప్రకారమే సీఆర్డీఏ పరిధి కొనసాగుతుందని పేర్కొన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 12 అంశాలపై సీఎం చర్చించారు. గతంలో […]
Read Moreమిస్ యూనివర్స్-ఇండియాకు అర్హత సాధించిన కుప్పం యువతికి సీఎం అభినందన
అమరావతి : మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుండి అర్హత సాధించిన చందన జయరాం అనే యువతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం సచివాలయంలో కలిశారు. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, ఎం.కె.పురంనకు చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుండి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుండి చందనా పాల్గొనున్నారు. కుప్పం నుంచి […]
Read Moreమౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు : పట్టణంలో ప్రజల మౌలిక సదుపాయల కల్పనే ప్రథమ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నానని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఉదయం 22 వ వార్డు పరిధిలో హీరో హోండా షోరూం ఎదురుగా మంచినీటి పైపు లైన్ లీకేజీ పనులను, రిజిస్టర్ ఆఫీసు ముందు ఉన్న సులభ కాంప్లెక్స్‌ను సందర్శించారు. సులభ కాంప్లెక్స్ ద్వారా వచ్చే వ్యర్థాలను మురుగు నీటి కాల్వలోకి పెట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను […]
Read Moreదానం నాగేందర్ వీధి రౌడీ
– మాతృమూర్తులను కించపరిచేలా మాట్లాడిన దానంపై స్పీకర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి – మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే దానం నాగేందర్ నిండు శాసనసభలో వీధి రౌడీలా వ్యవహరించిన తీరు జుగుప్సాకరమని మాజి మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయ అవగాహన లేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారనీ,సభా మర్యాదలను, సభా గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మంట గలిపిందనీ […]
Read More