అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఐదుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు చిరస్మరణీయ సేవలు అందించారని, నిరాడంబర ప్రజా సేవకుడిని పార్టీ కోల్పోయింది… వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
Read Moreబ్రూక్స్‌విక్ క్రాసింగ్ లో ఘనంగా దీపావళి
– ఆకట్టుకున్న చిన్నారుల సాంస్క్రృతిక ప్రదర్శనలు వాషింగ్టన్ డీసీ: బ్రూక్స్‌విక్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా పెద్దఎత్తున దీపాలు వెలిగించి ఆ ప్రాంతమంతా దీపకాంతులు వెదజల్లేలా అలంకరించారు. ముఖ్యంగా మహిళలు నూతన వస్త్రాలు ధరించి కాలుష్య రహితమైన దీపావళి టపాసులు కాలుస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు బాగా ఆకట్టుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పండుగలను తలపించేలా అమెరికాలో దీపావళి […]
Read Moreనిరాడంబరుడు రెడ్డి సత్యనారాయణ మృతి బాధాకరం
– సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. అయిదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ మృతి తీవ్ర విచారం కలిగించిందన్నారు. మంత్రిగా పనిచేసి […]
Read Moreఏపీది దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానాం!
– క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, మహానాడు: దేశంలోనే అత్యుత్తమ క్రీడా విధానాన్ని రూపొందించామని, క్రీడా సంఘాల తోడ్పాటుతో ఇటువంటి క్రీడా పోటీలు జరగడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇండోర్ స్టేడియాలు నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, అమరావతిలో దేశంలోని అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందడుగు వేస్తున్నారని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి […]
Read More‘కూటమి’ లో కుమ్ములాటల్లేవు
– చిన్న భేదాభిప్రాయాలు మాత్రమే… – కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోతాయ్ కాకినాడ, మహానాడు: కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గా బాధ్యతలు ఇచ్చిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు. .. మొదటిసారి జిల్లాలో కూటమిలోని మూడు పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన ఇక్కడ మీడియాతో ఏమన్నారంటే.. ఏ పార్టీలో అయినా చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. అలాంటిది మూడు పార్టీలు […]
Read Moreటీడీపీలోకి కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సుధీర్
అమరావతి, మహానాడు: కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ తెలుగుదేశం పార్టీ(టీడీపీ)లో చేరారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. పార్టీ కండువా కప్పి సుధీర్ ను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ అన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని […]
Read Moreశ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల
తిరుమల, మహానాడు: తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అధికారులు మంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసేందుకు అభిమానులు, జనసేన నాయకులు భారీగా తరలివచ్చారు. ఆయనతో సెల్పీలు దిగేందుకు అభిమానులు పోటిపడ్డారు.
Read Moreశబరిమల యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి
కేరళ: గత ఏడాది శబరిమల యాత్రా సీజన్‌లో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేసినట్టు కేరళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వాసవన్ తెలిపారు. ఈసారి 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ ఏడాది శబరిమల యాత్రా సీజన్ లో 13,600 మంది పోలీసులు, 2,500 ఫైర్, రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు […]
Read Moreఅలిగిన ఎంపీ వేమిరెడ్డి!
నెల్లూరు, మహానాడు: జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం జరిగింది. రివ్యూ మీటింగ్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష మంత్రులకు స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా బొకేలు సమర్పించి వేమిరెడ్డి పేరును విస్మరించడంతో ఆయన వేదికపై నుంచి అలిగి వెళ్లిపోయారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వేదికపై నుంచి కిందకు వెళ్లి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని […]
Read Moreగుంతలు లేని రోడ్లే లక్ష్యం!
– మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు, మహానాడు: ప్రజలు తమకు అందించిన అఖండ విజయాన్ని బాధ్యతగా స్వీకరించి పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఆదివారం చాట్రాయి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో రూ.25 లక్షలు, చనుబండ గ్రామంలో రూ.50 లక్షలతో […]
Read More