అమరావతి: “అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండో సారి ఘనవిజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయం అమెరికా-భారత్ సంబంధాలలో కొత్త శకానికి నాందిగా నిలుస్తుంది. అన్ స్టాపబుల్ గా విజయం సాధించిన విధంగా భారత్-అమెరికా ల మధ్య కూడా అన్ స్టాపబుల్ గా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని, అభివృద్ధిలో పరస్పర సహకారం అందించాలని కోరుతున్నాను. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల […]
Read Moreటీటీడీలో ముస్లింలకు స్థానం కల్పించాలి
– రాష్ట్ర అహలేసున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రాజా డిమాండ్ కొండపల్లి, మహానాడు: తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలిలో ముస్లిం మైనార్టీలకు స్థానం కల్పించాలని ప్రధానమంత్రి దీనిపై స్పందించాలని రాష్ట్ర అహలేసున్నత్ జమాత్ కో కన్వీనర్ అల్తాఫ్ రాజా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఏమన్నారంటే.. వక్ఫ్ బోర్డు లో హిందువులకు అవకాశం ఉన్నపుడు టీటీడీ లో […]
Read Moreకులగణన సర్వేతో బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు!
– బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆరోపణ హైదరాబాద్, మహానాడు: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను వెన్నుపోటు పొడిచేందుకే కుల గణన సర్వే పేరిట.. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేపడుతోందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ప్రయోజనాలను రద్దు చేయడానికి… వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను రద్దు చేయడానికే […]
Read Moreకక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు
– ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు, మహానాడు: ఎక్కడా రాజకీయ వివాదాలకు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సామాన్యులకు అందే విధంగా కృషి చేయాలని స్థానిక నేతలకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 30 డివిజన్ నక్కా గోపాల్ నగర్ లో 35 లక్షల రూపాయ ల వ్యయంతో రోడ్లు, పైప్ లైన్ నిర్మాణానికి బుధవారం […]
Read Moreమంత్రి లోకేష్ కు సహచర మంత్రుల అభినందనలు
అమరావతి, మహానాడు: అమెరికాలో వారం రోజులపాటు పెట్టుబడుల జైత్రయాత్రను విజయవంతంగా పూర్తిచేసి అమరావతి విచ్చేసిన మంత్రి లోకేష్ ను సహచర మంత్రులు బుధవారం ఉండవల్లి నివాసంలో కలిసి అభినందించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా, పరిశ్రమదారుల్లో నమ్మకం కలిగించడానికి మీరు పడుతున్న కష్టం తమకందరికీ ఆదర్శమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టడంలో గేమ్ చేంజర్ కాగలవని వారు కొనియాడారు.
Read Moreఅర్చకులకు చెల్లించే కనీస వేతనం పెంపు
– సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం – దేవాదాయ శాఖ మంత్రి ఆనం వెల్లడి అమరావతి, మహానాడు: రాష్ట్రంలో రూ. 50 వేలు పైబడిన ఆదాయం ఉన్న దేవాలయాల్లో అర్చకులకు చెల్లించే కనీస వేతనం రూ.15,000 లకు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెంపువలన లబ్ధిపొందే అర్చకులు 1,683 మంది వుంటారన్నారు. కనీస వేతనం నెలకు […]
Read Moreహోం మంత్రి, డీజీపీ దృష్టికి అనంతపురం సమస్యలు
– ఇరువురిని ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి అనంతపురం, మహానాడు: ఇక్కడి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన డిఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు మంగళవారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ లు […]
Read Moreగ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయండి
– నిరుద్యోగ జేఏసీ అమరావతి, మహానాడు: జనవరి అయిదోతేదీ నుండి నిర్వహిస్తున్న గ్రూప్ – 2 ప్రధాన పరీక్షలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని, గ్రూప్- 1 మెయిన్స్ కి 1:100 రేషియో లో తీయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ ఏపీపీఎస్‌సీ చైర్మన్ అనురాధకు విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ హయాంలో నియమించిన బోర్డు సభ్యులను ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఇతర కీలక నిర్ణయాల్లో […]
Read Moreశాంతిభద్రతలపై కట్టుకథలతో జగన్ తప్పుడు ప్రచారం
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శ వినుకొండ, మహానాడు: రాష్ట్రంలో శాంతిభద్రతలపై కావాలనే కట్టుకథలతో జగన్, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఇదే పనిగా పెట్టుకుని మరీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి అయిదేళ్ల అరాచకాల రెడ్డి రక్తపుమడుగులో కూరుకుపోయిన జగన్మోహన్ ధర్మపన్నాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించి పదేపదే […]
Read Moreసభ్యత్వ నమోదులో సరికొత్త రికార్డు సృష్టించాలి
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సభ్యత్వ నమోదును ఎక్కువగా చేసి, సరికొత్త రికార్డ్ సృష్టించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంగళవారం డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్, కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రతి డివిజన్ లో 2000 లకు పైగా సభ్యత్వాలు చేయాలన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఒటర్లను నియోజకవర్గంలో అధికంగా చేర్చి, ముఖ్యమంత్రి […]
Read More