రేపు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

-రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి -తొలి జాబితా రేపు విడుదల చేసే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రేపు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. తెలంగాణలోని […]

Read More

సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిస్తే తప్పేంటి?

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి -భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే పంథాను కొనసాగించాలి -కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు -బీజేపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన నరేంద్ర మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన కరీంనగర్ లో మీడియాతో […]

Read More

రేవంత్ రెడ్డి మోదీ కి లవ్ లెటర్ రాశారు

– బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైట్ పేపర్ ఆ పేపర్ అని కాషాయ పేపర్ మీద ప్రధాని నరేంద్ర మోదీకి లవ్ లెటర్ రాశారని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు… కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీయే మరోసారి ప్రధాని అవుతారన్నట్లు ముఖ్యమంత్రి మాట్లాడారని… తద్వారా కాంగ్రెస్ గెలవదని చెప్పకనే […]

Read More

టిడిపిలో చేరిన ఖిద్మత్ టీమ్ అధ్యక్షుడు షేక్ షఫీ

-ఆయనతోపాటు మరో 200 కుటుంబాల చేరిక -సాదరంగా ఆహ్వానించిన యువనేత నారాలోకేష్ నవులూరుకు చెందిన ఖిద్మత్ టీమ్ అధ్యక్షుడు షేక్ షఫీ టీడీపీలో చేరారు. యువనేత నారా లోకేష్ సమక్షంలో బుధవారం తన అనుచరులు, మద్ధతుదారులైన 200 మందితో కలిసి షఫీ పార్టీలో చేరారు. మంగళగిరి నియోజకవర్గంలో షేక్ షఫీ అందరికి సుపరిచితమే. నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. ఎన్నో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను, […]

Read More

హస్తినలో పొత్తుల హడావిడి

– రేపు ఢిల్లీకి పవన్ – ఖరారు కాని బాబు పర్యటన – సీట్లపై ముందస్తు కసరత్తు – ఇప్పటికే ఢిల్లీకి పురందేశ్వరి ఎన్డీఏ భేటీలోపే పొత్తు ప్రకటన? – అందరి చూపూ ఢిల్లీ వైపే – బీజేపీ అభ్యర్ధుల ఎంపికలో ఆరెస్సెస్ నేతల జోక్యం – దరఖాస్తు చేసుకోనివారికీ స్థానంపై అసంతృప్తి ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ప్రక్రియ వేదిక ఢిల్లీకి మారింది. బీజేపీకి ఎన్ని సీట్లు […]

Read More

డెత్ సర్టిఫికెట్‌పై సీఎం ఫొటోనా… సిగ్గుచేటు

జయప్రకాశ్ నారాయణ ఫైర్ మాజీ ఐఏఎస్ అధికారి, లోక్‌సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, ఐఏఎస్‌లకు ఇటీవల గ్లామర్‌ను ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార పిచ్చి పతాకస్థాయికి చేరిందని, లేకపోతే మరణ ధ్రువీకరణ పత్రంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో ఏంటని ప్రశ్నించారు. పట్టాదారు పాసుపుస్తకాల్లోనూ, చివరికి సర్వే రాళ్లపైనా సీఎం ఫొటోలు వేస్తున్నారని, ఇంతకంటే దారుణం ఇంకెక్కడ ఉంటుందని ఆవేదన […]

Read More

లోకేశ్ మలివిడత శంఖారావం

రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేశ్ మలివిడత శంఖారావం యాత్ర చేపడతారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. రాయలసీమలో పార్టీ కేడర్ ను సమాయత్తం చేయడానికి గురువారం (ఈ నెల 7) హిందూపురం నుంచి యాత్రకు శ్రీకారం చుడతారని తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశంపై కేడర్ కు యువనేత దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా మన టీడీపీ, బాబు ష్యూరిటీ – […]

Read More

12న వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు ముద్రగడ పద్మనాభంను వైసీపీలోకి ఆహ్వానించారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇక ఈ నెల 12న వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ నెల 12న వైసీపీలో ముద్రగడ పద్మనాభం చేరితే.. పిఠాపురం బరిలో ఉండే ఛాన్స్‌ ఉంది. పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకే […]

Read More

తొలి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశంలో మెుట్టమెుదటి అండర్ వాటర్ మెట్రో రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అత్యంత లోతైన హౌరా మెట్రో స్టేషన్‌ గుండా నీటి అడుగున మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. కోల్‌కతా ఈస్ట్‌ వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద హుగ్లీ నది దిగువన ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిన ఈ అండర్‌ వాటర్ మెట్రో టన్నెల్‌ […]

Read More

నీటి ‘బెంగ’ళూరు

-మా ఇంట్లో బోరు కూడా ఎండిపోయింది -నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి  -డిప్యూటీ సీఎం శివకుమార్ బెంగళూరులో రోజు రోజుకూ నీటి కొరత తీవ్రం అవుతోంది. దీంతో బెంగళూరు నగరవాసులకు కర్ణాటక ప్రభుత్వం.. కీలక సూచనలు చేస్తోంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తోంది. మరోవైపు.. బెంగళూరులోని దాదాపు అన్ని ప్రాంతాలు తగినంత నీటి సరఫరా లేక అవస్థలు పడుతున్నట్లు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే […]

Read More