హరిత పోస్టింగ్‌ రద్దు!

అమరావతి, మహానాడు: అనంతపురం జేసీగా డి.హరితకు ఇచ్చిన పోస్టింగ్ ను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఆమెకు పోస్టింగ్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా హరితను ఆదేశిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మంత్రులు అందుబాటులో ఉంటారు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం పార్టీ కేంద్ర కార్యాయలంలో ప్రజల నుంచి ప్రతీ రోజు రాష్ట్ర మంత్రులు, జాతీయ నాయకులు అర్జీలు స్వీకరిస్తారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నాయకులు అందుబాటులో ఉంటారు. ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎన్టీఆర్ భవన్ పర్యటన వివరాలు : 16.08.2024 : టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ 17.08.2024 […]

Read More

ప్రజా భాగస్వామ్యంతోనే సమ్మిళత భారత్

– డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు, మహానాడు: భారతదేశంలో కుల, మత, వర్గ ప్రాంతాలకతీతంగా ప్రజా సమూహాలన్నింటిని భాగస్వామ్యులను చేసి నిర్మాణాత్మక కృషి చేస్తేనే సమ్మిళత భారత్ వికసిస్తుందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో బుధవారం స్వతంత్ర భారత్ ప్రగతి – అవరోధాలు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి […]

Read More

జెండా ఎగరవేసి దేశ సమగ్రతను చాటాలి

హర్ ఘర్ తరంగా 3.0 లో భాగంగా ప్రతీ పౌరుడు తమ ఇంటి వద్ద జాతీయ జెండా ఎగరవేసి దేశ సమగ్రతను చాటాలని పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అధికారులు భాష్యం ప్రవీణ్ కి జాతీయ జెండాని బహూకరించారు.

Read More

హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

-స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులకు నివాళులర్పించాలి -జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగువారు కావడం గర్వకారణం -ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని రేపు 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం -గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి: హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇంటింటా జాతీయ జెండా ఎగరాలి. రేపు 78వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 2047 నాటికి వందేళ్ల ఉత్సవాలను జరుపుకుంటాం. […]

Read More

ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోండి

నకిలీ డ్వాక్రా గ్రూపులతో అక్రమంగా రుణాలు పొందారు 26వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విజ్ఞప్తులు సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ అమరావతిః ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న “ప్రజాదర్బార్” కు వచ్చే విన్నపాలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి కృషిచేయాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సిబ్బందిని ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో 26వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరి […]

Read More

శవరాజకీయం వైసీపీ నైజం..

– టీడీపీ నేత శ్రీను హత్యను ఖండిస్తున్నాను – నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం – శ్రీను కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుంది – బీసీ జనార్ధన్ రెడ్డి అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలకు పెట్టింది పేరు. అధికారం కోల్పోయిన తర్వాత హత్యారాజకీయాలతో తమ పార్టీని నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కర్నూలుజిల్లా, పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు శ్రీనును వైసీపీ నాయకులు […]

Read More

అన్నగారి కల నిజం చేసిన అల్లుడుగారు

– పేదవాడి అన్నం గిన్నె… ‘అన్న’ క్యాంటీన్‌! ప్రజలే దేవుళ్లు- సమాజమే దేవాలయం. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే తెలుగుదేశం పార్టీ విధానం. ఈ ప్రసంగాలే.. నాడు తెలుగుదేశం పార్టీని పేదవాడు తన గుండెల్లో పెట్టుకునేందుకు కారణమయింది. ఈ ప్రసంగాలే దశాబ్దాల కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో కూల్చివేసింది. కిలో రెండురూపాయల బియ్యంతో పేదవాడి ఆకలితీర్చిన విప్లవవాది నందమూరి తారకరామారావు. దేశంలో అప్పుడు అదే తొలి సంక్షేమ విప్లవం. ఇప్పుడు ఆయన బాటలో ఏపీ […]

Read More

నవ్విపోదురుగాక!

-వైసీపీ టీమ్ కు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య చురక విజయవాడ : అంబేద్కర్ విగ్రహాం వద్ద ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే తాటికాయంత అక్షరాల పేరును తొలగించిన సంఘటనపై వైకాపా నాయకుల బృందం ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళటం నవ్విపోదురుగాక! నాకేటి సిగ్గు …. అన్నట్లుగా ఉందని, ఇలాంటి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే చర్యల పట్ల దళిత సమాజం […]

Read More

స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం

-భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుదాం -హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారభించిన బీసీ సంక్షేమ,చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ పెనుకొండ: శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణ కేంద్రంలో గాంధీ విగ్రహం నుండి హర్ఘర్ తిరంగ సందర్భంగా జాతీయ జెండా ను ఊపి ర్యాలీ ని ప్రారంభించి అంబేద్కర్ సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకొని మానవహారం చేశారు. అనంతరం మంత్రి సవితమ్మ మాట్లాడుతూ […]

Read More