-పథకాలకు పేర్లు మార్చిన బాబు సర్కారు -ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం -ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లపై దృష్టి సారించింది. వివిధ పథకాలకు పేర్లు మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ఇకపై ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్’ గా పిలుస్తారు.జగనన్న విదేశీ […]
Read Moreపోలవరం నాకర్థం కాలేదు: మాజీ మంత్రి అంబటి
పోలవరం ప్రాజెక్టుపై జలవనరులశాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘పోలవరం చాలా కఠినమైన టాపిక్. అంత తేలిగ్గా అర్థం కాదు.అర్థం కాదని గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే.. నాకర్థం కాలేదు కాబట్టి. నేను ఎన్నోసార్లు పర్యటించిన తర్వాత పోలవరం ఇప్పుడు పూర్తయ్యేది కాదని చెప్పాను.ఇప్పుడు అదే మాట చంద్రబాబు చెబుతున్నారు’ అని రాంబాబు వ్యాఖ్యానించారు.
Read Moreప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నాన్ని ఇకనైనా జగన్మోహన్ రెడ్డి మానుకోవాలి
-జగన్ జనం తింగరోళ్లేమి కాదు.. రిషికొండ గుట్టు నేను ఎప్పుడో విప్పా -ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ప్రజలను మభ్య పెట్టాలనే ప్రయత్నాలను మానుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. గత రెండు రోజులుగా విశాఖపట్నంలో ప్రజాధనంతో జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్యాలెస్ గురించే చర్చ జరుగుతోందన్నారు. ఒక గొప్ప కట్టడం కోసమే కట్టాము తప్ప… వ్యక్తిగత అవసరాల కోసం కాదని వైకాపా నాయకత్వం వివరణ ఇవ్వడం హాస్యాస్పదంగా […]
Read Moreఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జూలై 2 – నామినేషన్ దాఖలు.. జూలై 3 – నామినేషన్ పరిశీలన.. జూలై 5 – నామినేషన్ ఉపసంహరణ.. జూలై 12న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు.. సి. రామచంద్రయ్య పై అనర్హత వేటు పడడంతో, మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేయటంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు.
Read Moreనిండిన ‘తుంగ’
ఈ ఏడాది భారీ వర్షాల ప్రభావంతో తుంగ జలాశయం నిండి రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. తుంగ జలాశయం గరిష్ట నీటి మట్టం 588.24 మీటర్లుగా ఉంది. జలాశయానికి 1765 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. నదికి 1700 క్యూసెక్కులు నీరు వస్తోంది. గత యేడాది కన్నా ఈసారి తుంగభద్రకు త్వరలో భారీగా నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Moreసిద్దమవుతున్న ఇస్రో మంగళయాన్-2 మిషన్
-అంగారక గ్రహం పైకి మరో ప్రయోగం ( వెంకట్) సూర్యుడు, చంద్రుడిపై తర్వాత అంగారక గ్రహం యెక్క రహాస్యాలను అన్వేషించ నున్నారు. అంగారకుడిపై మరో ప్రయోగానికి సిద్దమైంది ఇస్రో. మంగళయాన్-1 చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంగారక గ్రహం పైకి మరో ప్రతిష్టాత్మకమై ప్రయోగానికి సిద్దమైంది.. మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ యొక్క సక్సెస్ తర్వాత, రెండవ ఎడిషన్ మార్టిన్ ఉపరితలంపై రోవర్ […]
Read Moreభారత్‌కు గూగుల్ ఏఐ జెమిని యాప్
గూగుల్ ఏఐ జెమిని మొబైల్ యాప్ భారత్‌లో అందుబాటు లోకి వచ్చింది.. తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ భాషల్లోనూ ఈ యాప్ సేవలందిస్తుందని గూగుల్ పేర్కొంది. రానున్న రోజుల్లో సరికొత్త ఫీచర్లను జోడించనున్నాం అని ఆల్ఫా బెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Read Moreరైల్వే శాఖ శుభవార్త
ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త వినిపించింది.. రాష్ట్రం లోని గూడూరు-రేణిగుంట మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ రైల్వే లైన్ నిర్మించ బోతున్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 83.17 కిలో మీటర్ల దూరం ఉంది. నిర్మాణంలో భాగంగా 36.5 హెక్టార్ల భూమిని సేకరించ బోతున్నారు. ఈ లైను అందుబాటు లోకి వస్తే తిరుపతి […]
Read Moreబీజేపీలోకి విడదల రజనీ?
-జగన్ కు రజనీ ఝలక్? -ఓడిపోయే సీటిచ్చారని ఆగ్రహం -నమ్మినవారే నట్టేట ఉంచారన్న అసంతృప్తి -చిలకలూరిపేట ఇస్తే గెలిచేదానినన్న రజనీ -తాజాగా బీజేపీ అగ్రనేతలతో మంతనాలు? -వైసీపీలో రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఆందోళన ( మార్తి సుబ్రహ్మణ్యం) హైదరాబాద్ హైటెక్‌సిటీలో టీడీపీ నాటిన ఒకనాటి మొక్క..మొన్నటి వరకూ జగన్ జమానాలో వెలిగిపోయిన మాజీ మంత్రి విడదల రజనీ.. తన పార్టీ అధినేత జగన్ కు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. […]
Read Moreజగన్ సెక్యూరిటీని తెల్లారేసరికి తీసేయడం ఎంతవరకు కరెక్ట్?
-ఉద్యోగులపై అప్పుడే వివక్ష -వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి తాడేపల్లి: ప్రభుత్వ ఉద్యోగులు చాలా విలువను పొందుతున్నామని అనుకుంటున్నారేమో కానీ ఉద్యోగులపై అప్పుడే వివక్ష మొదలైంది, వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను ఈనాడులో జలగన్నలంటూ రాశారు, అధికారులను అవమానిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అధికారులను అదిరించి, బెదిరించి తన అజమాయిషీ చాటుకున్నారు, వారిని అనేక రకాలుగా అవమానించారు, మేం ఇంత త్వరగా రెస్పాండ్ కాకూడదని, ఈ […]
Read More