పిఠాపురంలో కౌంటింగ్‌ను అడ్డుకునేందుకు కుట్ర

ఓటమి భయంతో రౌడీషీటర్లను ఏజెంట్లుగా పెట్టారు ఎన్ని కుట్రలు చేసినా పవన్‌కళ్యాణ్‌ గెలుపు ఆపలేరు తనపై వైసీపీ దుష్ప్రచారాలు మానుకోండి పిఠాపురం టీడీపీ నేత వర్మ హెచ్చరిక పిఠాపురం: తనపై వైసీపీ నేతల దుష్ప్రచారాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నేతల దుష్పచారం ప్రజలు అర్థం చేసుకున్నారు. అత్యధిక మెజారిటీతో పవన్‌కళ్యాణ్‌ గెలవబోతున్నాడన్న సమాచారంతో కౌంటింగ్‌కు ఆటంకం కలిగిం చాలన్న […]

Read More

నేటి నుంచి పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌

సాయంత్రం నుంచి దుకాణాలు మూసివేయాలి అత్యవసరమైతేనే బయటకు రావాలి ర్యాలీలు, మైకులకు అనుమతి లేదు దేవాలయాల్లోనే హనుమజ్జయంతి జరుపుకోవాలి పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్‌ సూచనలు నరసరావుపేట: టూ టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీడియో పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు ఎస్పీ మల్లికాగార్గ్‌ తెలిపారు. సోషల్‌ మీడియా లేదా వాట్సాప్‌లలో ఎగ్జిట్‌ పోల్స్‌ తరువాత ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని, దానికి […]

Read More

టీడీపీ అభ్యర్థులు కౌంటింగ్ కు ముందే నియోజకవర్గాలకు చేరుకోవాలి

పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం హైదరాబాద్: పోలింగ్ ట్రెండ్, జూన్ 4న కౌంటింగ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఫలితాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని, కౌంటింగ్ కు ముందే టీడీపీ అభ్యర్థులందరూ తమ నియోజకవర్గాలకు చేరుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సమస్యాత్మక నియోజకవర్గాల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అంతకుముందు, పార్టీ […]

Read More

ఆపద్ధర్మ ప్రభుత్వం అడ్డగోలు చెల్లింపులు

-ఇష్టమొచ్చిన కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు -రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది -ఆస్తులు, అప్పులు, చెల్లింపుల వివరాలు బయటపెట్టండి -అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇవ్వండి -రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసిన పురంధేశ్వరి విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పార్టీ నాయకులు శుక్రవారం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ బీఐ, […]

Read More

మీడియా ముందుకు జవహర్‌రెడ్డి బాధితులు

-మా భూములు చూసేందుకు వచ్చారు -తర్వాత వైసీపీ నేతలు, రౌడీలు వచ్చి బెదిరించారు -అధికారులు స్తంభాలు పాతేందుకు వచ్చారు -కొత్త జీవో ప్రకారం మాది కాదంటున్నారని ఆవేదన -కూటమి రక్షణ కల్పిస్తుందని పీతలమూర్తి భరోసా -అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం -భూరాంబందులను కటకటాల్లోకి పంపుతాం -సీఎస్‌ బినామీ త్రిలోక్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో సీఎస్‌ జవహర్‌రెడ్డి అసైన్డ్‌ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారంలో బాధితులతో కలిసి జనసేన కార్పొరేటర్‌ […]

Read More

బొటన వేలిని కొరికేసిన కుక్క

-తప్పించబోయిన మరో నలుగురిపై దాడి -తీవ్రగాయాలతో ఆసుపత్రిలో క్షతగాత్రులు -మంచిర్యాలలో దారుణం తెలంగాణ: మంచిర్యాల సున్నంబట్టి వాడలో శుక్రవారం వీధి కుక్క వీరంగం సృష్టించింది. పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తాళ్లపల్లి ప్రసాద్‌ అనే వ్యక్తి చేతి బొటన వేలిని కొరికి పట్టుకోగా వేలు తెగిపోయింది. ఆ సమయం లో దానిని అడ్డుకోబోయిన మరో నలుగురిని కరవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ […]

Read More

కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం

-పదవిలో ఉన్నా లేకున్నా కలిసికట్టుగా పనిచేయాలి -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఈ పది సంవత్సరాలలో ఐదవ ఆర్థిక శక్తిగా అవతరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మోదీ ఆధ్వర్యంలోనే రానున్న కాలంలో మూడో ఆర్థిక శక్తిగా మారనుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోనే 60 వేల […]

Read More

చంద్రబాబును కలిసిన కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాత, నవ్యాంధ్ర ఉజ్వ ల భవిష్యత్తు సాధనే లక్ష్యంగా త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ నున్న దార్శనికులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసినట్లు మీడియాకు వివరించారు.

Read More

7,8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సుకు సన్నాహాలు

తాజ్‌కృష్ణ హోటల్‌లో వేదికకు ఏర్పాట్లు వివిధ దేశాల నుంచి వరి శాస్త్రవేత్తల హాజరు వరి ఎగుమతిదారులకు సువర్ణావకాశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సదస్సు నిర్వాహకులతో చర్చలు హైదరాబాద్‌: వచ్చె నెల 7,8వ తేదీలలో తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగే ప్రపంచ వరి సదస్సుకు ముమ్మరంగా సన్మాహాలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సదస్సును నిర్వహిస్తున్న అంతర్జాతీయ పంటల […]

Read More

ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు

అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్లు పి.శ్రీలేఖ, ఎ.మురళి, ఓ.రాంభూపాల్‌రెడ్డిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Read More