బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు

-డి‌జి‌పి హరీష్ కుమార్ గుప్తా విజయవాడ: కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు. అట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై IT act కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, PD ACT ప్రయోగించడం వంటి […]

Read More

పిన్నెల్లికి కౌంటింగ్ సెంటర్‌లోకి నో ఎంట్రీ

-పిన్నెల్లికి సుప్రీం షాక్ -కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళవద్దని ఆదేశం -హైకోర్టు పిన్నెల్లికి ఇచ్చిన రక్షణ న్యాయాన్ని అవహేళన చేయడమేనని వ్యాఖ్య -ఈవీఎం బద్దలు కొట్టిన వీడియోను జడ్జికి చూపిన న్యాయవాది ఆదినారాయణ రావు -దీనికేమంటారని ఎమ్మెల్యే న్యాయవాని ప్రశ్నించిన సుప్రీంకోర్టు జడ్జి -నీళ్లు నమిలిన పిన్నెల్లి న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు జడ్జి -నీళ్లు నమిలిన పిన్నెల్లి న్యాయవాది ఈవీఎంను బద్దలు కొట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి […]

Read More

ట్రావెల్స్ బస్సు బోల్తా

ఒక మహిళ మృతి, నలుగురికి గాయాలు నరసరావుపేట, జూన్ 3: నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద రాత్రి తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, డ్రైవర్‌తో సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, 19 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సు కర్ణాటక నుండి యానాం వెళుతోంది. బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం […]

Read More

ఎమ్మెల్సీ విజయం తెలంగాణ అమరులకు అంకితం

-కేసీఆర్‌కు కానుక ఇస్తున్నాం..ఓటమి రేవంత్‌కు చెంపపెట్టు -మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌: స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలిచిందని, […]

Read More

కిష్టయ్య బిడ్డ చదువుకు కేసీఆర్‌ ఆర్థికసాయం

ఎంబీబీఎస్‌ చదివించిన కేసీఆర్‌… నేడు పీజీ కోర్సుకు కూడా చేయూత హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమ రుడు కానిస్టేబుల్‌ కిష్టయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్ననని ఆనాడే మాట ఇచ్చిన కేసీఆర్‌ ఇచ్చిన మాటను నిలుపుకుంటూ వస్తున్నారు. కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు […]

Read More

5న విచారణకు రండి…సజ్జలకు 41ఏ నోటీసులు

అమరావతి: కౌంటింగ్‌ రోజు అల్లర్లు చేయాలని సూచించిన కేసులో సజ్జలకు తాడేపల్లి పోలీసులు నోటీసులు పంపారు. నిబంధనలు పాటించే ఏజంట్లు అవసరం లేదని ఇటీవల వైసీపీ ఏజెంట్లకు ఇచ్చిన శిక్షణలో ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ లీగల్‌ టీం వివిధ సెక్షన్ల కింద ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. తాజాగా దానికి సంబంధించి తాడేపల్లి హెడ్‌ కానిస్టేబుల్‌ ద్వారా 5వ తేదీన విచారణకు రావాలని నోటీసులు పంపారు.

Read More

కౌంటింగ్‌ వేళ…పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు

-ఆయనపై తుళ్లూరు పీఎస్‌లో ఫిర్యాదు -ఇప్పటికే సజ్జలపై కేసు నమోదు -అధికారులను భయపెట్టేలా వ్యాఖ్యలు -గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్‌ లో పేర్ని నానిపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు అమరావతి: కౌంటింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల కౌంటింగ్‌ ఏజెంట్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయగా నిన్నటి రోజున వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అధికారులను […]

Read More

హైదరాబాద్‌ లో మాధవీలత గెలిచే అవకాశం: ఇండియా టుడే

హైదరాబాద్‌: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో అనూహ్య ఫలితం వెలువడే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్‌ మై టుడే తెలిపింది. ఎంఐఎం కంచుకోటలో ఈసారి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు తెలిపింది. మాధవీలతనే గెలుపు వరించే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. మొత్తంగా తెలంగాణలో బీజేపీకి 11-12 సీట్లు వచ్చే అవకాశం […]

Read More

కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలి

ప్రకాశం కలెక్టర్‌కు కూటమి నేతల వినతి ఒంగోలు: కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు ఒంగోలు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ను కలసి వినతిపత్రం ఇచ్చారు. ఒంగోలు కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్‌, సంతనూతలపాడు విజయకుమార్‌ దర్శి గొట్టిపాటి లక్ష్మి,లలిత్‌ సాగర్‌లు కలెక్టర్‌ గారిని కలిసిన వారిలో ఉన్నారు. కౌంటింగ్‌లో వైసీపీ దౌర్జన్యాలు, దాడులకు తెగబడకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.

Read More

పెట్రోల్‌ బాంబుల ముడిసరుకు లభ్యం

సత్తెనపల్లి: రాజుపాలెం మండలం బ్రహ్మణపల్లిలో పెట్రోల్‌ బాంబుల ముడిసరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలలో భాగంగా గ్రామం లో పోలీసులు పరిశీలిస్తుండగా గడ్డి వాములో నిల్వచేసిన పెట్రోల్‌, 8 బీరు సీసాలు, 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

Read More