ఎయిర్‌ పోర్ట్‌ తరహాలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌

2026 నాటికి పునరాభివృద్ధి పనులు పూర్తి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ సికింద్రాబాద్: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు తరహాలో ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఆధునిక రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దు తున్నామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. సుమారు రూ. 700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులను 2026 నాటికి పూర్తి […]

Read More

గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతాం

– గచ్చిబౌలి స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయింది. క్రీడలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. తెలంగాణ యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ వేదికగా మాట ఇస్తున్నా. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతాం. ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ […]

Read More

దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో వర్షాలు

– ఐఎండీ హెచ్చరిక న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజులపాటు 20 రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 28 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.

Read More

చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం

– విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు – మా ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుంది – హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంఖుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశం వస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నా జన్మ సుకృతం. కాంక్రీట్ జంగిల్ లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించేందుకు ఇక్కడ హెరిటేజ్ టవర్ నిర్మిచడం గొప్ప విషయం. […]

Read More

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో రోడ్డెక్కిన రైతులు

నిజామాబాద్ జిల్లా: ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణాలు మాఫీ చేయాలనే డిమాండ్‌తో ఇందూరు రైతులు ఆదివారం పోరు బాటపట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబా ద్ జిల్లా ఆర్మూర్‌ లో మహా ధర్నా చేపట్టారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద […]

Read More

మెటర్నటీ డాక్టర్ల నిర్లక్ష్యానికి శిశువు మృతి?

నల్గొండ జిల్లా: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నల్లగొండ ప్రభుత్వాసుపత్రి మెటర్నటీ డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ శిశువు భూమ్మీదికి రాకముందే మృతి చెందింది.నొప్పులతో బాధపడుతున్న మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కడుపు లోనే శిశువు చనిపోయింది. దాంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. నొప్పులతో బాధపడుతున్న మహిళ పట్ల నల్లగొండ ప్రభుత్వాసుపత్రి డ్యూటీ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవ హరించారు. నొప్పులు భరించలేని ఆ మహిళ ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్లేందుకు […]

Read More

మన్మథ లీల.. వై‘కామ’ గోల!

వైనాట్.. వై‘కామ’పార్టీ? వై‘కామ’గా మారుతున్న వైకాపా వైసీపీలో పెరుగుతున్న జాతిరత్నాలు కామాంధుల పార్టీగా మారుతుందంటూ మహిళా కార్యకర్తల కలవరం విజయసాయి, అవంతి, అంబటి, మాధవ్, దువ్వాడ సరసన ఎమ్మెల్సీ అనంతబాబు తన భార్య బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రంటూ రోడ్డెక్కిన శాంతి భర్త విజయసాయి డీఎన్‌ఏకు శాంతి భర్త డిమాండ్ ఓ మహిళ వీడియో బెదిరింపుతో 2 కోట్లు సమర్పించుకున్న టీటీడీ మాజీ చైర్మన్ నాటి మహిళా మంత్రితో ‘సకల’క ళా […]

Read More

నెరవేరిన సీఎం హామీ.. ఇద్దరికి ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ

అమలాపురం, మహానాడు: వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఇద్దరు వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందాయి. ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ ఖరీదు1.5 లక్షలు. అమలాపురం కలెక్టరేట్ లో స్కూటర్లను కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు […]

Read More

బాపట్లలో 20 మంది విద్యార్థునులకు అస్వస్థత

బాపట్ల: కాఫీ పొడిలో నిమ్మకాయ కలిపిన మిశ్రమాన్ని తాగిన 20 మంది విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారు. బాపట్లలో ఓ పాఠశాలలో ఆరో తరగతి చదివే విద్యార్థిని తోటి విద్యార్థునులకు కాఫీ పొడిలో నిమ్మకాయ కలిపి ఇచ్చింది. దీంతో ఆ మిశ్రమం తాగిన 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురై బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. జిల్లా డిప్యూటీ కలెక్టర్ విద్యార్థులను పరామర్శించారు.

Read More

పలాసలో పాఠశాల విద్యార్థినిలకు లైంగిక వేధింపులు

శ్రీకాకుళం, మహానాడు: కాశీబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు అదే అదే తరగతికి చదువుతున్న ఓ విద్యార్థి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లినా… లైంగిక వేధింపులపై స్పందించకపోవడంతో విద్యార్థినిలు వారి తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. అనంతరం వారు మాట్లాడుతూ… ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఫిర్యాదు అందినప్పటికీ ఎటువంటి […]

Read More