ప్రజల సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపండి

ఎక్కడైనా లంచం తీసుకున్నట్లు నా దృష్టికి వస్తే ఉపేక్షించను అధికారులకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశం ప్రభుత్వ ప్రజా ఫిర్యాదుల దినోత్సవానికి హాజరైన పుట్టపర్తి నియోజవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకోవాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అధికారులకు ఆదేశించారు గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం కొత్తచెరువు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల […]

Read More

రక్తదాన శిబిరమును ప్రారంభించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు

కందుకూరు పట్టణంలోని శ్రీ వెంగమాంబ కళ్యాణ మండపం నందు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కందుకూరు సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాం. విధి నిర్వహణలో తమ కుటుంబాల సైతం దూరంగా ఉంటూ ప్రజల కోసం […]

Read More

టీడీపీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన

కార్యకర్తల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ లక్ష్యం అందుకు ఎనలేని కృషి చేస్తున్నారు తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జుజ్జూరులో విశేష స్పందన లభించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జుజ్జూరు లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన […]

Read More

పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు: మంత్రి సంధ్యారాణి

గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం సీఎం చంద్రబాబుతోనే  పల్లెలకు పూర్వ వైభవం గ్రామాల్లో రోడ్లకు మహర్దశ ప్రభుత్వం ఏర్పడి 125 రోజులలో 4,500 రూ. కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం రూ.4.20 కోట్ల నిధులతో సాలూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన సాలూరు (పార్వతీపురం మన్యం) : గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం, […]

Read More

మీ రాక మాకెంతో సంతోషం!

– ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టండి – అలయెన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలం – రాస్ పెరోట్ జూనియర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ భేటీ డల్లాస్ (యుఎస్ఏ): పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డల్లాస్ లో […]

Read More

‘ఈవీ’ పెట్టుబడులకు అనంతపురం అమోఘం!

– ఆ ప్రాంతం వ్యూహాత్మక ప్రదేశం – స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కండి – టెస్లా కేంద్ర కార్యాలయంలో సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి లోకేష్ భేటీ ఆస్టిన్ (యుఎస్ఎ): ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో జగజ్జేతగా ఉన్న టెస్లా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు […]

Read More

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు

– ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో జరుగనున్న కార్తీక మాసోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. వచ్చే యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పార్కింగ్‌ సమస్యపై దృష్టిని సారించాలని అన్నారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి ఈవో ప్రధాన పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. విచ్చేసే భక్తుల కోసం ఆర్టీసీ బస్టాండ్‌, ప్రభుత్వ […]

Read More

ఏపీలో అన్న క్యాంటీన్ పేరిట ఛారిటబుల్ ట్రస్టు

అమరావతి, మహానాడు: ఏపీలో అన్న క్యాంటీన్లకు ఇచ్చే విరాళాలకు ఇక ఆదాయపన్ను మినహాయింపు లభించనుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద వివిధ సంస్థల నుంచి కూడా విరాళాలు సేకరించనున్నారు. ఇందుకోసం ‘అన్న క్యాంటీన్’ పేరుతో ఛారిటబుల్ ట్రస్టును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందుకు ఆదాయపన్ను, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల విభాగాల నుంచి అనుమతులు లభించాయి. వచ్చే నెలలో ట్రస్టు ప్రారంభమవుతుంది.

Read More

వచ్చే ఏడాది సరస్వతి నది పుష్కరాలు

కాళేశ్వరం: సరస్వతి నదికి వచ్చే ఏడాది పుష్కరాలు రానున్నాయి. 2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశి లోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభం అవుతుందని కాళేశ్వరం ఆలయ ముఖ్య అర్చకులు కృష్ణ మూర్తి శర్మ, ఫణీంద్ర శర్మలు తెలిపారు. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్య స్నానాలు ఆచారించాల్సి ఉంటుందన్నారు. కాగా, పుష్కరాల నిర్వహణ తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Read More

ఆంధ్రాలో ఉచిత గ్యాస్ బుకింగ్ రేపటి నుంచి..

విజయవాడ, మహానాడు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉదయం 10 గంటల నుంచి గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చని, గ్యాస్ కనెక్షన్ తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More