జగన్‌… రాజకీయం చేయటానికి మహిళలే దొరికారా?

– వైసీపీకి గుడ్‌బై చెప్పిన అనంతరం వాసిరెడ్డి పద్మ ఆగ్రహం విజయవాడ, మహానాడు: గుడ్ బుక్ పేరుతో కార్యకర్తలను, ప్రజలను మరోసారి మోసం చేయడానికి జగన్ సిద్ధపడుతున్నారు… వైసీపీకి గుడ్‌బై….. నా రాజీనామాను మీడియా ద్వారా తెలియచేస్తున్నానని ఏపీ మహిళా కమీషన్ మాజీ ఛైర్‌పర్సన్, వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే.. నేను మహిళా చైర్ పర్సన్ గా ఉండగా, అనేక విషయాలు […]

Read More

చుక్కల భూములపై నాడు జగన్ రెడ్డికి కన్ను!

• వైసీపీ నేతలకు కట్టబెట్టేందుకు సెటిల్ మెంట్లకు దిగిన కలెక్టర్లు • పేదల భూములపై భారీ స్కెచ్ • తక్కువ ధరకే బేరసారాలు.. వినకుంటే నాడు బెదిరింపులు • ‘గ్రీవెన్స్‌’లో బాధితుల మొర మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డికి రాష్ట్రంలో ఉండే చుక్కల భూములపై కన్ను పడిందని.. దాదాపు రెండు లక్షల ఎకరాలకు పైగా ఉన్న భూములను కొట్టేయాలని ఆయన, ఆయన పార్టీ నేతలు చూశారని.. అందుకే ఆ భూములపై […]

Read More

రాష్ట్రంలో క్షీణించిన శాంతి, భద్రతలు!

– అందుకే పెరుగుతున్న అత్యాచారాలు, మోసాలు – మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శ గుంటూరు, మహానాడు: దారుణ లైంగిక వేధింపులకు గురై, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ప్రాణం కోల్పోయిన సహానా కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. అనంతరం, అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితి ఉందనడానికి, శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారిందని […]

Read More

‘దొనకొండ’కు త్వరలో పారిశ్రామిక సొగసు!

– సీఎం, కేంద్ర మంత్రిని కలిసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మంగళగిరి, మహానాడు: ప్రకాశం జిల్లాలోని దొనకొండకు త్వరలో పారిశ్రామిక సొగసు రానుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి కేంద్ర మంతి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి ఆ ప్రాంత అభివృద్ధి విషయమై చర్చించారు. మంగళగిరి సికే కన్వెన్షన్ లో మంగళవారం జరిగిన డ్రోన్ సమ్మిట్ లో లక్ష్మి పాల్గొన్నారు. […]

Read More

నేటి నుంచి అరకులో ఎయిర్ బెలూన్స్

అరకు: శీతాకాలం వచ్చిందంటే.. అరకు అందాలు కనువిందు చేస్తాయి. ఆ ప్రకృతి సుందర దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ సందర్భంగా అరకు లోయ సందర్శకులకు ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. అరకు అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు హాట్ ఎయిర్ బెలూన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేటి నుంచి పద్మావతి గార్డెన్స్లో పర్యాటకులకు హాట్ ఎయిర్ బెలున్స్ అందుబాటులో ఉండనున్నాయి.  

Read More

ముత్యాలమ్మ ఆలయంలో త్వరలో నూతన విగ్రహ ప్రతిష్ట

– మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్: ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహాన్ని త్వరలోనే ప్రతిష్టించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయం లో ప్రముఖ దేవాలయాలకు చెందిన పలువురు పండితులు, పలువురు కుమ్మరి బస్తీ వాసులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కుమ్మరిగూడ కు పండితులతో కలిసి వెళ్ళి బస్తీ వాసులతో […]

Read More

వాషింగ్టన్ డీసీలో ఘనంగా అట్లతద్దె వేడుకలు

– ఉయ్యాలలు ఏర్పాటుచేసి వాయినాలు, గోరింటాకు పంపిణీ – ఉత్సాహంగా పెద్దఎత్తున పాల్గొన్న మహిళలు – అలరించిన సాంస్కృతి కార్యక్రమాలు వాషింగ్టన్ డీసీ: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జీడబ్ల్యూటీసీఎస్ పూర్వాధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతిబింబించేలా తొలిసారిగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అట్లతద్దె పండుగను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వాసులు బతుకమ్మ పండగను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన […]

Read More

వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

అనంతపురం, మహానాడు: అనంతపురంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. జనజీవనం స్తంభించిపోయింది. పండ మేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. వాహనంపై మంగళవారం అటువైపు వెళ్ళిన సినీ నటుడు అక్కినేని నాగార్జున వరదలో చిక్కుకున్నారు. అనంతపురంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవం లో ఆయన పాల్గొనాల్సి ఉంది. పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు వరదలో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు […]

Read More

రోజూ పారిశుద్ధ్య పనుల పరిశీలన

– ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట, మహానాడు: స్థానిక కోడెల శివప్రసాద్ రావు స్టేడియంలో ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు మంగళవారం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదాచారాకులకు, ఆటలు ఆడే పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. స్వయంగా స్టేడియం ప్రాంగణంలో గడ్డి నివారణ మందులు స్ప్రై చేశారు. పట్టణం లో ప్రతి రోజు పర్యటిస్తా… పారిశుద్ధ్య పనుల్లో లోపాలు జరిగితే సాహించిదే లేదన్నారు. […]

Read More

క్రీడలకు అత్యంత ప్రాధాన్యం

– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట, మహానాడు: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలో జీ.వి.జే బాయ్స్ హై స్కూల్ లో మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి పాఠశాలల అండర్ 14 /అండర్ 17 బాలికలు, బాలుర కబడ్డీ పోటీలు నిర్వహించారు. వీటిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సెలెక్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య […]

Read More