పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటా

– జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా హరిప్రసాద్ నామినేషన్ విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, జనసేన పార్టీ శాసనసభ్యులు లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, […]

Read More

అప్పుడు 15 పైసలే ప్రజలకు చేరేది

– అందుకే మమ్మల్ని ఎన్నుకున్నారు – మోదీ ప్రసంగంలో ఏపీ ప్రస్తావన ఢిల్లీ: కాంగ్రెస్ హయాంలో ఢిల్లీ నుంచి రూపాయి విడుదలైతే.. కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఎక్కడా చూసినా స్కామ్ జరిగాయని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో అవినీతి తగ్గిందన్నారు. తమకు దేశం ఫస్ట్ అని.. మిగిలినవి తర్వాతేనని వివరించారు. నిరాశలో ఉన్న దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో […]

Read More

విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బదిలీ

విజయవాడ:మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర కార్యక్రమాల్లో స్వప్నిల్ దినకర్ నేతృత్వంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలు అవార్డులు సాధించింది.

Read More

ఏపీలో కలెక్టర్లు బదిలీ

విజయవాడ: ఏపీలో క లెక్టర్ల బదిలీలకు ప్రభుత్వం తెరలేపింది. ప్రభుత్వం మారిన తొలిసారి భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. కొత్త కలెక్టర్లు వీరే.. శ్రీకాకుళం కలెక్టర్‌గా స్వప్నిల్‌ దినకర్‌ పార్వతీపురం కలెక్టర్‌గా శ్యామ్‌ప్రసాద్‌ విశాఖ కలెక్టర్‌గా హరీంద్రప్రసాద్‌ అనకాపల్లి కలెక్టర్‌గా కె.విజయ అంబేద్కర్‌ కోనసీమ కలెక్టర్‌గా రావిరాల మహేష్‌కుమార్ పల్నాడు కలెక్టర్‌గా అరుణ్‌బాబు నెల్లూరు కలెక్టర్‌గా ఆనంద్‌ తిరుపతి కలెక్టర్‌గా ఎస్‌. వెంకటేశ్వర్‌ అన్నమయ్య కలెక్టర్‌గా చామకూరి శ్రీధర్‌ కడప […]

Read More

దారి ప్రక్కన సేదదీరిన యుద్ధోపహతులు

కంటికి కనిపించే దృశ్యాలు కొన్ని మనసులో ఆలోచనల తుట్టెను కదిలిచి రకరకాల ఉద్వేగాలను రేపుతుంది. దారి ప్రక్కన చెట్టు నీడన తుండు గుడ్డ పరుచుకొన్న నిద్రా భంగిమ “దారి ప్రక్కన ఆరిన కుంపటి విధాన”.. ఒక ఉద్వేగకర దృశ్యం. ఆదమరిచి నిద్రిస్తున్న విధానం మనసులో రకరకాల కారణాలకు అన్వేషణ మొదలు. వారు ఎవరన్నది ప్రధానం కాదు గానీ, ఏపరిస్థితుల్లో అలా నిద్రాదేవి ఒడిలో సాంత్వన పొందుతున్నారో.. ఆ తీరు ఊరికే […]

Read More

సమస్యల పరిష్కార వేదికగా నారా లోకేష్ “ప్రజాదర్బార్”

రాష్ట్రం నలుమూలల నుంచి విన్నపాల వెల్లువ అమరావతి: గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు ప్రజా ప్రభుత్వంలో భరోసా కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్యస్పందన లభిస్తోంది. “ప్రజాదర్బార్” కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల […]

Read More

ఎన్డీఏ కూటమి విజయానికి పిఠాపురం ఇచ్చిన భరోసా వెలకట్టలేనిది

కాలం పెట్టిన పరీక్షలో వైసీపీ అహంకారంతో ఓడిపోయింది ఎవరి మీదా వ్యక్తిగత ద్వేషం ఉండదు శక్తివంచన లేకుండా ప్రజల కోసం పని చేయడానికే ప్రాధాన్యం గత ఐదేళ్ల కాలంలో అన్ని శాఖల్లో చోటు చేసుకున్నా అక్రమాలు, అవినీతి బయటపడుతున్నాయి 2047కు భారత్ విశ్వ గురువు కావాలి… అదే మన సంకల్పం కావాలి… పిఠాపురం జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికుల సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్ […]

Read More

మంత్రి గారి భార్య.. మజాకానా?

– రాయచోటి రెడ్డమ్మకు ఎస్కార్టు కావాలట – ఆలస్యంగా వచ్చిన పోలీసులకు అక్షింతలు – మంత్రుల భార్యలకూ ఎస్కార్టు ఇస్తారా? – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భార్య ఓవరాక్షన్ – సోషల్‌మీడియాలో విమర్శల వర్షం – సేవకులంటే ఇలాగే ఉంటారా అని సెటైర్లు – గతంలో గుంటూరు జిల్లాలో ఇలాగే పెత్తనం చేసిన ఓ మాజీ మంత్రి భార్య – పార్టీ పరువు పోతోంది బాబూ.. ( మార్తి సుబ్రహ్మణ్యం) ఒకవైపు […]

Read More

పవన్‌కళ్యాణ్‌గారు.. ఎర్రచందనం అక్రమరవాణాపై ఏ విచారణకైనా సిద్ధం

ఆరోపణలను నిరూపించలేకపోతే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా? ఇంకా ఎంతకాలం మాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు? రాజంపేట వైసీపీ ఎంపి మిథున్‌రెడ్డి సవాల్ రాజంపేట: పవన్‌కళ్యాణ్‌గారు.. దీక్షలో ఉండి కూడా ఇంత అలవోకగా ఎలా అబద్ధాలు చెప్పగలుగుతున్నారు. ఇంకా ఎంతకాలం మాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. మీరు అధికారంలో ఉన్నారు. పోలీసులు, వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడే కాదు.. పాతిక సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎర్రచందనం అక్రమరవాణాపై మీరు చేస్తున్న […]

Read More

ఏడీసీ సీఎండీగా ల‌క్ష్మీపార్థ‌సార‌థి బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌

అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి సోమ‌వారం సంస్థ ప్ర‌ధాన కార్యాల‌య‌ములో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా సంస్థ ఉన్న‌తాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆమెను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అనంత‌రం వివిధ విభాగాల అధిప‌తుల‌తో స‌మావేశ‌మై ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలోని నిర్మాణాల ప‌రిస్థితుల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో సంస్థ ముఖ్య ఇంజినీరు సీహెచ్. ధ‌నుంజ‌య్‌, సూప‌రిండెంట్ ఇంజినీరు భాస్క‌ర్‌, సీఏవో ఉమామ‌హేశ్వ‌రి, ఉద్యాన‌వ‌న అధికారి […]

Read More